Tuesday, March 24, 2026

బుషులు శపిస్తే తెగిపడిన అంగం శివలింగం అన్నవాడి నాలుక తెగనరకాలి | అస్సలు నిజం ఏంటి??

బుషులు శపిస్తే తెగిపడిన అంగం శివలింగం అన్నవాడి నాలుక తెగనరకాలి | అస్సలు నిజం ఏంటి??

Author Name:vijaya durga

Youtube Channel Url:https://www.youtube.com/@vijayadurga281

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SOcCT34ADgA



Transcript:
(00:00) ముందుగా మీ అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం ఏదైతే ఉందో అది నేను ఫస్ట్ అఫ్ ఆల్ వినకూడదు విన్నా గాని మాట్లాడకూడదు అయినప్పటికీ కూడా మీ అందరికీ సమాధానం చెప్పడం కోసం నేను మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే వింటామో వాళ్ళ నాలుకలు తెగ నరకాలి కానీ ఆ విధంగా మనం చేయలేకపోతున్నాం విషయం ఏంటంటే చాలామంది మూర్ఖులు వేసేటటువంటి ప్రశ్న ఏంటంటే మీ శివ పురాణంలో శివుడు అడవిలో నగ్నంగా తిరిగాడు ఋషిపద్ముల ముందు అలాగే ఋషిపత్నులు శివుడు నగ్నత్వానికి ఆకర్షితులయితే ఋషులు వచ్చి కోపోద్రిక్తులై ఆవేశంతో అహంకారంతో శివుని
(00:38) శపిస్తే శివుడి యొక్క అంగం తెగి భూమి మీద పడింది కాబట్టి ఆ లింగాన్ని మీరు పూజిస్తున్నారు. ఇది మూర్ఖులు మాట్లాడేటటువంటి మాటలు ఈ మాటలకి సమాధానం మనం కచ్చితంగా చెప్పి తీరాల్సిందే ముందుగా మీకు ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి రామాయణం గాని మహాభారతం కానీ మీ బైబిల్ గాని ప్రతిదీ కూడా చరిత్ర కానీ శివ పురాణం విష్ణు పురాణం అనేవి చరిత్రలు కావు నాయన అవి మన యొక్క జీవనశైలిలో ఏ విధంగా మనం నడుచుకోవాలో మనకు నేర్పేటటువంటి చారిత్రాత్మకమైనటువంటి కథలు అంటే ప్రతీకాత్మకంగా కొన్ని కథలు చెప్పబడినవి వాటినే పురాణ కథలు అంటారు ఆ పురాణ కథల ద్వారా మన జీవన శైలిని మనం
(01:20) నేర్చుకుంటాం అన్నమాట అంతేకానీ అది చరిత్ర కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం కూడా నేను చెప్తాను జాగ్రత్తగా వినండి శివ పురాణం అనేది వేదవ్యాసుడు రచించాడు అనేది మనకు తెలుసు కానీ వేదవ్యాసుల వారు స్వయంగా రచించారా ఆయన చేత్తో రచించిన గ్రంథమేనా అది ఒకసారి ఆలోచించండి ఆ కాలంలో వేదవ్యాసుల వారి మాటల ద్వారా ఈ గ్రంధం చెప్పబడుతూ వచ్చింది తరతరాలు కొన్ని తరాల వరకు కూడా ఆయన శిష్యులు శిష్యుల పరంపరలో ఈ విషయాలన్నీ కూడా చెప్పబడుతూ వచ్చాయి.
(01:54) అంటే మాటల ద్వారా స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఒకరి ఆలోచన ఇంకొకరికి ఉంటుందా అది మారుతూ మారుతూ మారుతూ వస్తుంది. అదేవిధంగా తరువాతి తరాల్లో పండితులు గాని కొంతమంది రచయితలు గాని వాళ్ళు రచించడం జరిగిందన్నమాట. ఈ విధంగా కథ అనేది సారాంశం ఒక్కటే కానీ చెప్పే విధానం మార్చబడుతూ వచ్చింది ఇది మనం గమనించాలి విషయానికి వస్తే అడవిలో శివుడు నగ్నంగా తిరిగాడు అసలు నగ్నత్వం అంటే ఏమిటి నగ్నత్వం అంటే ఒంటి మీద బట్టలు లేకుండా తిరగడం అని మాత్రమే అనుకుంటున్నావా నీకు అసలు సంస్కృతం తెలుసా తెలుగే సరిగ్గా రాదు సంస్కృతాన్ని నువ్వు డీకోడ్ చేసేస్తావు పురాణాలు చదివేస్తావు నీ బైబిల్ ని నువ్వు
(02:34) చదువుకోవడం నేర్చుకోవు కానీ పురాణాల మీద పడతావు సరే సరే నగ్నత్వం అంటే ఏమిటంటే నిరాడంబరత్వం నిర్గుణాకారం అంటే ఏ గుణము ఆయనకి అంటదు నిరాడంబరంగా ఉంటాడు ఆయన అరూప రూపి కూడా అంటే రూపం కూడా లేనివాడు అసలు రూపమే లేనటువంటి వాడు నగ్నంగా ఎలా ఉంటాడు కాదు కదా నగ్నత్వం అంటే శుద్ధ చేతన చైతన్య శక్తి అంటే నీలో నాలో ఆ ఈ మాటలు ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడిలో కూడా ఏ శక్తి అయితే వాడిని నడిపిస్తూ ఉందో ఆ శక్తే ఆ శివతత్వం పరమేశ్వరుడు ఆ శక్తినే నగ్నత్వం శివుడు నగ్నంగా తిరిగాడు అని రాయబడింది అన్నమాట మీకు నగ్నత్వం అంటే అర్థమైంది కదా ఇకపోతే శివుడు నగ్నంగా తిరుగుతుంటే
(03:21) ఋషిపత్నులు ఆకర్షితులు అయ్యారు ఇక్కడ ఋషిపత్ములు అంటే ఎవరో తెలుసా నీలో నాలో ఉండేటటువంటి ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఏదైతే ఉందో ఈ నిరాడంబరత్వానికి ఈ శక్తికి ఈ సమస్త ప్రకృతి కూడా ఆయనకి ఆకర్షితులయింది. అంటే నీలో నాలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఆయన శక్తికి ఆకర్షితులయి ఆయనను దేవుడిగా అంగీకరించింది. కానీ ఆ విషయం ఋషులకు నచ్చలేదు.
(03:51) ఋషులు ఋషిపత్నులు ఆకర్షితులు అవ్వడం చూసి తట్టుకోలేక కోపోద్రిక్తులుయ్యారు కోపం ఆవేశం అహంకారం వాళ్ళలో వచ్చేసింది. ఎందుకు అంటే మనందరికి పాత విషయం తెలిసిందే కదా అసలు ఋషులు అనంగానే వాళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి వాళ్ళకి కోపం ఎక్కువ శపిస్తారు ఈ విషయం అయితే మనకి తెలుసు కదా అందుకే ఋషులతో పోల్చారు అన్నమాట అక్కడ సందర్భాన్ని ఇక్కడ ఋషి పత్నులు ఆకర్షితులు అవ్వంగానే ఋషులకు కోపం వచ్చింది అంటే మనకే మనలో ఉన్నటువంటి అహంకారం పెరిగిపోయింది నేనే శక్తిని నేనే కర్తని నాకే జ్ఞానం ఉంది నేను ఎదురుగుండా ఉన్న శక్తిని ని ఎందుకు అంగీకరించాలి
(04:32) నేను ఎందుకు ఆకర్షితులు అవుతున్నాను అవ్వకూడదు కదా అన్న అహంకారంతోటి ఈ ఋషులు ఏం చేశారు శపించారు. ఏమని శపించారు నీ అంగం తెగిపడును గాక అని కాదు శపించింది ఏమిటి అంటే నీ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి క్షీణించిపోవును గాక అని ఋషులు శపించారు. అంటే వీళ్ళల్లో ఉన్న శక్తే గొప్పది అన్న అహంకారంతోటి ఎదురుగుండా ఉన్న శక్తి దైవత్వాన్ని గుర్తించలేకుండా ఆ శివ తత్వాన్ని గుర్తించకుండా ఈ ఋషులు ఏం చేశారంటే నీలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది పూర్తిగా నశించిపోవాలి మేము మాత్రమే జ్ఞానవంతులము మేమే దేవుళ్ళం అనే ఫీలింగ్ తోటి ఈ ఋషులు ఉన్నారన్నమాట. అంటే
(05:15) ఈనాడు ఆ అబ్బాయి ఎవరైతే మాట్లాడుతున్నాడో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి అహంకారంతో మాట్లాడే మాటలు ఉన్నాయి చూసారా అలాంటి మనుషులే ఆ రోజున ఋషుల రూపంలో చెప్పబడ్డారు కథల ద్వారాగా ఋషులు శపించారు ఏమని నీలో ఉన్నటువంటి శక్తి నశించిపోవును గాక కానీ పరమేశ్వరుడు గొప్పవాడు ఆయనక ఏమన్నా వీళ్ళ శాపాలు తగులుతాయా తగలవు కదా కానీ వీళ్ళలో ఉన్న అహంకారాన్ని నశింపచేయడం కోసం ఆ పరమే పరమేశ్వరుడు ఏం చేసాడంటే తన శక్తిని ఈ భూమి మీదకి విడుదల చేసేసాడు అన్నమాట ఒక అగ్ని స్తంభ రూపమై ఆయన శక్తి జ్వలించే జ్వాలాగ్ని లాగా ఈ భూమి మీదకు వదిలాడు ఆది
(05:57) అంతం లేనటువంటి ఆ శక్తి ఈ భూమి మీదకు రాగానే ఈ ఋషులకు అర్థమైపోయింది ఆ శక్తి ముందు నా శక్తి చాలా బలహీనమైనది నేను ఎందుకు పనికి రాను అన్న సంగతి వీళ్ళు గ్రహించగలిగారు ఆ గ్రహించిన క్షణం ఈ ఋషుల్లో అహంకారం అనేది చచ్చిపోయింది అహంకారాన్ని తీసేయగలిగినవాడు కేవలం ఆ పరమేశ్వరుడు మాత్రమే ఇంతవరకు మీకు క్లియర్ గా అర్థమయింది కదా అంటే ఋషుల యొక్క అహంకారాన్ని అణచడం కోసమే పరమేశ్వరుడు ఈ భూమి మీదకి జ్వాలాగ్ని రూపంలో అగ్నిస్తంభ రూపంలో వచ్చాడన్నమాట ఇంతవరకు క్లియర్ ఈ అగ్ని స్తంభ రూపంలో వచ్చినటువంటి శివుడి యొక్క వేడికి తట్టుకోలేక ఈ సకల సృష్టి
(06:35) కాలిపోతుంటే ఆ పార్వతి మాత యొక్క శక్తి పానిపట్టం రూపంలో వచ్చి ఆయన్ని తనలో ఇముడ్చుకుంది అని చెప్తారు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి వాళ్ళు మాట్లాడేటటువంటి పాడు మాట ఏమిటంటే పార్వతీ మాత యొక్క యోని భాగం అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఒక మాట అడుగుతాను చెప్పండి శక్తి అంటే స్త్రీ శక్తి పురుష శక్తి గాని ఏదైనా ఆ శివునిలో అర్థభాగమే కదా ఆయన అర్ధనారీశ్వరుడే కదా అమ్మ వేరు అయ్య వేరు కాదు పార్వతీదేవి వేరు పరమేశ్వరుడు వేరు కాదు దైవం అనేది ఒక్కటే కానీ వాళ్ళని మనం మనం చూసే విధానం ఆ మార్పు అనేది మనలో ఉంది కానీ భగవంతుడు ఒకే ఒక్కడు శివుడు శక్తి స్వరూపమై ఉన్నాడు
(07:21) కాబట్టి ఆయనే ఆయన శక్తిని తనలో ఇముర్డ్చుకోటానికి పార్వతీ మాత రూపంలో ఆ శక్తి స్వరూపిని రూపంలో ఈ పానిపట్టంగా మారి ఆ శక్తిని తనలో నిక్షిప్తం చేశాడు మనల్ని లింగ రూపంలో ఆరాధించుకోవడానికి అనుమతిని అనుగ్రహించాడు అంతేగాని భగవంతుని మానవ రూపంలో చూసి నీ కళ్ళలో కామాన్ని నింపుకొని కామపు చేష్టలతో కామపు వికృత వికృతమైన మాటలు మాట్లాడుతూ అసహ్యంగా ప్రవర్తించకండి భగవంతుడు అంటే మనిషి కాదు మానవ రూపం కాదు ఆయన అరూపరూపి రూపమే లేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో శివుడికి రూపమే లేదు రూపమే లేని వాడికి నగ్నత్వాన్ని ఎలా అంటగడతావురా అంట్ల వెధవ దయచేసి నన్ను క్షమించండి
(08:07) ఇలాంటి మాటలు మాట్లాడకూడదని అనుకుంటున్నాను కానీ పరమేశ్వరుడిని నిందిస్తే మాత్రం నాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇది కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళు తెలివి ఉన్నవాళ్ళు మనం తెలుసుకోగలము అన్న ఉద్దేశంతో మన పూర్వీకులు మనకు చెప్పబడినటువంటి ఒక కథ. దీని ద్వారా మనం జ్ఞానాన్ని పెంచుకోవచ్చు మనం జ్ఞానాన్ని పొందుకోవచ్చు కానీ ఇంకా నిష్ట దరిద్రులు ఉన్నారు వాళ్ళకి అర్థం కాదు ఆ విషయాన్ని గ్రహించే మన పూర్వీకులు మరొక కథను కూడా చెప్పడం జరిగింది విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ వచ్చాడు బ్రహ్మ నేను ముందంటే విష్ణువు నేను ముందంటే వాళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి
(08:44) వాగ్వాదంలో శివుడు ఒక అగ్నిస్తంభంగా మారాడు ఆ అగ్నిస్తంభం యొక్క ఆదిని అంతాన్ని కనుగొనడం బ్రహ్మ బ్రహ్మ వల్ల గాని విష్ణువు వల్ల గాని కాలేదు ఆ అగ్నిస్తంభమే ఈరోజు మనం భూమిమీద శివలింగ రూపంలో ఆరాధించుకుంటున్నాము అనే విషయం ఆ కథ గురించి మనందరికీ తెలుసు కదా అట్లీస్ట్ ఈ కథ మీకు అర్థం కాకపోతే ఆ కథనన్నా విని శివుని యొక్క తత్వాన్ని తెలుసుకుంటారు జ్ఞానాన్ని పెంచుకుంటారు అన్న ఉద్దేశంతో మరొక కథ రూపంలో కూడా మీకు చెప్పడం జరిగింది అది కూడా మీకు అర్థం కాదు ఎందుకంటే అసలు మనం మనుషులం అయితే కదా ఇప్పటివరకు నేను చెప్పిన విషయం విషయం మీకు
(09:22) పూర్తిగా అర్థమయింది అని నేను అనుకుంటున్నాను మరొకసారి జాగ్రత్తగా వినండి ఋషి పత్నులు అంటే స్త్రీ శక్తి మన ఇంద్రియములు మన మనసు బుద్ధి ఋషులు అంటే మనలో ఉన్న అహంకారం ఈ అహంకారాన్ని అణచివేయడానికి మనకున్న దారి శివతత్వం పరమేశ్వరుడు ఆ శక్తి స్వరూపిని అంటే నువ్వు అమ్మగా చూసినా అయ్యగా చూసినా అక్కడ ఉన్నది మాత్రం ఒకే శక్తి ఆ శక్తికి ఆకర్షితమయ్యేది సకల సృష్టి ప్రకృతి నీ ఇంద్రియాలు నీ మనసు కానీ నీలో ఉన్న అహంకారం నశించిపోతే మాత్రం నీకు భగవంతుడికి తేడా లేదు ఆ భగవంతుడు ఎక్కడో ఎదురుగుండా లేడు నీలోనే ఉన్నాడు.
(10:00) అసలు నీలో ఉన్నటువంటి ఆత్మకి నువ్వు బట్టలు తొడగలవా నగ్నంగా ఉంది అని నువ్వు చెప్పగలవా లేదు కదా అదేవిధంగా పరమేశ్వరుడికి నగ్నత్వాన్ని ఏ విధంగా అంటగడతావు ఆ శక్తి స్వరూపుని శక్తిగా ఆరాధించి పరమేశ్వరుడిగా అంగీకరించి శివతత్వాన్ని గ్రహించగలిగితే నీవు మోక్ష మార్గంలోకి వెళ్ళగలుగుతావు ఒక జ్ఞానిగా ఎదగగలుగుతావు భారత దేశంలో భరతభూమిలో పుట్టినందుకు నీవు కూడా ఒక మనిషివి అనిపించుకుంటావు నిజాన్ని గ్రహించు నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు ఈ నిజాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో కాస్త లెన్తీగా ఉంది కాబట్టి లాంగ్ వీడియో చేయడం
(10:36) జరుగుతుంది ఈ లాంగ్ వీడియో అయినప్పటికీ కూడా ఈ విషయం మాత్రం అందరికీ తెలియాలి దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి

No comments:

Post a Comment