Thursday, April 2, 2026

*సప్త జ్ఞాన భూమికలు*

 2412d4;24f5;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀


            *సప్త జ్ఞాన భూమికలు*
                   ➖➖➖✍️
 
```
మానవాళిలో రెండు రకాలవారున్నారు: ``` *1.జ్ఞానులు, 2. అజ్ఞానులు.*
```
జ్ఞానంలో ఏడు స్థితులు ఉన్నాయి. వీటినే``` *“సప్తజ్ఞాన భూమికలు”*``` అంటాం.``` *1.శుభేచ్ఛ, 2, విచారణ, 3. తనుమానసం, 4.సత్త్వాపత్తి, 5. అసంసక్తి, 6. పదార్థ భావని, 7. తురీయం అన్నవే “సప్తజ్ఞాన భూమికలు”*

*1.”శుభేచ్ఛ”:*```
“నాకు బ్రహ్మజ్ఞానం కావాలి” అన్న ఇచ్ఛ; “నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి” అన్న తీవ్ర ఆకాంక్ష.
```
*2. “విచారణ”:*```
 “బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి” అన్న మీమాంస; ‘బ్రహ్మజ్ఞాన ప్రాప్తి విధానం -ధ్యానం, స్వాధ్యాయం, సజ్జనసాంగత్యం’ అని తెలుసుకోవడం.”```

*3. “తనుమానసం”:*```
ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, “తత్” సాధనలో నిమగ్నులై ఉండడమే “తనుమానసం”. అంటే “తత్” సాధనలో నిమగ్నులై ఉండడమే! అంటే ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే తనుమానసం.```

*4. “సత్త్వాపత్తి”:*```
శుద్ధసాత్వికం సాధించడమే ‘సత్త్వాపత్తి.’ అంటే ఇప్పుడు తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి.

ఇక మిగిలింది శుద్ధ సాత్వికమే. 

“తమోగుణం” అంటే “సోమరితనం” 
“రజోగుణం” అంటే “నాకు తెలుసు” అనే అధికారదర్పం. 
ఈ నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్ర స్థాయినందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీ మండలం పూర్తిగా శుద్ధమైన స్థితి; మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి; అదే “యోగి” అయిన స్థితి.

“అహం బ్రహ్మాస్మి” అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. 
”బ్రహ్మవిదుడు” అయిన స్థితి.```

*5. “అసంసక్తి”:*```
దివ్యచక్షువు ఉత్తేజితమవుతూన్న స్థితి. “తనువు మరి సంసారం రెండూ తాత్కాలికమైనవే” అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెండింటి మీదా పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే “అసంసక్తి” దీన్నే “పద్మపత్రమివాంభసా” అన్నాడు కృష్ణుడు గీతలో.

అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి ఉన్నా ధర్మనిష్టుడు మరి కర్మనిష్టుడు; తనువు పట్లా మరి సంసారం పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక, “సత్యద్రష్ట” కాబోతున్నాడు. కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ నిలిపినవాడు. ఇదే ‘ఆసంసక్తి’. ఇతనినే “బ్రహ్మవిద్వరుడు” అంటాం.```

*6. ”పదార్థభావని”:* ```
అంటే దివ్యచక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నవాడు. ప్రతి ‘పదం’ యొక్క ‘అర్థం’ లో ప్రతి ‘వస్తువు’ యొక్క ‘భావం’ లో ప్రత్యక్షంగా నివసిస్తున్న వాడు. అంటే “బ్రహ్మ విద్వరీయుడు” అయిన స్థితి. ఇదే “సిద్ధ స్థితి”; ఇదే “సవికల్ప సమాధి స్థితి” కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా “కొద్దిగా, సంశయాలు ఉన్న స్థితి.”```

*7.“తురీయం”:*```
ఇది మానవుని యొక్క “పూర్ణ వికాస స్థితి” సిద్ధుడు ‘బుద్ధుడు’ అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధుళ్ళుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం కట్టుకుని తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై ఉన్నవాళ్ళనే “బుద్ధుళ్ళు” అంటాం. ఇదే ‘సహస్రదళ కమలం’; ఇదే ‘వేయి పడగల పాము’.

ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచినప్పుడల్లా సహస్ర దళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది. ఇతనినే``` 
*“బ్రహ్మవిద్వరిష్టుడు”* ```అంటాం.
``` *“తురీయం”*``` అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు.``` *“తురీయ”*``` అంటే``` “మూడింటిని దాటిన” ```అని అర్థం. అంటే``` *“నిర్వికల్ప సమాధి స్థితి”* కి ```చేరుకున్న స్థితి.``` *“సమాధి”* ```అంటే “సమాధానాలు తెలుసుకున్న స్థితి”. నిర్వికల్ప సమాధి అంటే ” ఏ సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి.”✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀

No comments:

Post a Comment