వెయ్యి పుస్తకాలు చదివే కంటే ఎక్కువ జ్ఞానం ఈ ఒక్క సంఘటన వింటే వస్తుంది👍POSTCARD(38) from KANTHRISA
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=C_NxxrOssNs
Transcript:
(00:01) మన జీవితంలో ఎన్ని పుస్తకాలు చదివినా అర్థం గాన కొన్ని విషయాలు కొన్నిసార్లు చూడగానే అర్థమైపోతాయి. చదివింది ఓన్లీ మనసుకే కానీ కొన్నిసార్లు శుద్ధంగా చూసింది అది మన హృదయాంతరాలలోకి చూచుకొని పోతుంది. ఈరోజు అటువంటి ఒక చిన్న అపూర్వమైన సంఘటన చాలా కాలం గమనించడం వల్ల నాలో కలిగిన ఒక సంవేదన నేను మీతో చెప్తాను సిటీకి వచ్చిన తర్వాత ఫైన్ ఆర్ట్స్ లో చేరిన తర్వాత నాకు పోర్ట్రేట్స్ అంటే ఎదుటి వ్యక్తిగా ఎదురుగా ఒక వ్యక్తి కూర్చుంటే బొమ్మ వేయాలని ఒక కుతూహలం విపరీతమైన కుతూహలం నాకు ఎవరు దొరికేవాళ్ళు కాదు ఎందుకంటే
(00:45) నేను వేస్తే బాగా వచ్చేది కాదు అందుకని ఎవడు పడితే వాడిని అడిగేవాడిని భంగపడేవాడిని ఇదిఇలా ఉండగా నాకు బిగ్ బజార్ దగ్గర కూర్చున్నప్పుడు బొమ్మలు వేస్తున్నప్పుడు ఒక ఆవిడ పరిచయం అయింది పెద్ద ఆవిడ డాక్టర్ లక్ష్మీ చంద్ర అనుకుంటా అతని పేరు చాలా ఏళ్ళ అయిపోయింది కదా గుర్తులేదు సరిగ్గా ఆవిడ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ నడుపుతూ ఉండేది.
(01:13) సో ఆవిడ తన కార్డు ఇచ్చింది నాకు అసలు రిహాబిలిటేషన్ అంటే కూడా తెలియదు. నీకు బొమ్మలు వేసుకోవాలని కుతూహలంగా ఉంటే గనుక ఆ మా దగ్గర చాలామంది పిల్లలు ఉంటారు [సంగీతం] నువ్వు వచ్చి వేసుకో అంది. జాక్పాట్ తగిలినట్టే ఇక్కడ ఎక్కడ డబ్బు ప్రస్తావన లేదు చూశరా నాకు బొమ్మలు వేయాలను క్యూరియాసిటీ ఎంతో ఒక మనిషి ఎదురుగా ఉండాలి వాడిని [సంగీతం] చూస్తూ బొమ్మేయాలి యస్ ఇట్ ఈస్ గా రావాలి అంతే నేను ఆ బస్సు పట్టుకొని ఆ పంజగుట్ట అక్కడఎక్కడో ఉన్న ఆ సెంటర్ కి వెళ్ళాను అప్పుడు తెలిసింది రిహాబిలిటేషన్ సెంటర్ అంటే ఏమిటని అంతా [గురకలు] హైపర్ యక్టివ్ ఉన్న పిల్లలు మానసిక
(01:53) సంతులనం కోల్పోయిన పిల్లలు నాకు అసలు గుండె కలుపుకోమన్నది. ఆమెను కలిశాను వీళ్ళంతా మనలాంటి వాళ్లే కొంచెం బ్రెయిన్ యాక్టివిటీ అటు ఇటు ఉండటం వల్ల కొంచెం ఇంతగా ప్రవర్తిస్తారు. వాళ్ళు మన లోకంలో ఉండరు తన పిచ్చివాళ్ళు కాదు హైపర్ నేను ఎవరి దగ్గరికి వెళ్లి కూర్చున్నా స్థిరంగా ఉండరు వాళ్ళు అరే ఏమిటి ఇది ఒకరోజు ఒక పిల్లవాడు అక్కడ చాలా యక్టివ్ గా తిరుగుతున్నాడు అరుస్తున్నాడు కేకలు వేస్తున్నాడు నేను కూర్చో బాబు అని బొమ్మ వేయడానికి వెళితే ఒక్కటి కొట్టాడు వాడు పడిపోయాను విపరీతంగా భయం వేసింది నాకు అంత పరిగ
(02:40) పరిగెత్తుకొని మేడం దగ్గరికి వెళ్ళాను కొట్టాడు మేడం అన్నా నవ్వింది ఆ తర్వాత పదే పదే అక్కడికి వెళ్ళేవాడిని ఊరికే చూసేవాడిని ఎందుకో తెలియదు నాకు ఆ తర్వాత నాకో చిన్న స్టోరీ తెలిసింది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ పిల్లవాడి వాళ్ళ పేరెంట్స్ చాలా డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు వృద్ధిరతర డాక్టర్స్ ఆస్ట్రేలియాలో ఎక్కడో స్థిరపడ్డారు.
(03:05) వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ సంతానం ఇట్లా కలిగింది. సో ఆ పిల్లవాడిని సరిగ్గా చూసుకునే వాళ్ళు లేక ఈ రిహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టారు. ఇది ఇలా ఉండగా ఓ కుటుంబం ఉంది. ఎంత వింత స్టోరీ ఒక సినిమా తీయొచ్చు ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు ఇద్దరు అన్నలు ఏదో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళఏదో సాధించామని వాళ్ళ గొప్ప ఫీలింగ్ చిన్నవాడు ఏమి చేయడు వాడు వాడు చిన్నప్పటినుంచి చదువు వాడికి పట్టలేదు కానీ ఆశ్చర్యం ఏంటంటే వాడి హృదయం చాలా కల్మషం లేనిది.
(03:43) వాడు అందరినీ ప్రేమిస్తాడు అందరినీ గౌరవిస్తాడు. ఏదైనా చిన్న పని ఉన్నా శ్రద్ధగా చేస్తాడు ఇంటి పట్టునే ఉంటాడు. ఎప్పుడు వాడికి తిట్లే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలు వాళ్ళ బంధువులు వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో కానీ ఎప్పుడు అతని హృదయంలో ఎదుటి వ్యక్తి పట్ల నెగిటివిటీ [సంగీతం] లేదు. ఒకసారి ఈ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో హైపర్ యక్టివ్ అబ్బాయి ఆ అబ్బాయి గురించి ఈ మేడం కి ఏదో అనిపించింది.
(04:14) ఆస్ట్రేలియా నుంచి పేరెంట్స్ వచ్చారు. వస్తే ఒకతను ఉన్నాడు అతని కేర్ టేకర్ పెట్టుకుంటారా అని అడిగితే సరే సో ఈ మేడం ఆ ఎవరైతే ఈ ముగ్గురు అన్నలు ముగ్గురు ఉన్నారో అన్నదమ్ములు ఆ చిన్నవాడు ఏ పని చేయనివాడు చదువుకొని వాడు లోకజ్ఞానం లేనివాడు అతన్ని తీసుకొచ్చి ఈ అబ్బాయిని చూసుకో అని చెప్పిందట చూసుకో అన్న మరుక్షణమే అతను అబ్బాయిని చూసుకోవడం మొదలు పెట్టాడు.
(04:47) ఆ తర్వాత ఒక సంవత్సరం తిరిగేలోపు ఆ అబ్బాయి యొక్క మానసిక పరివర్తనలో గొప్ప మార్పు వచ్చింది. పేరెంట్స్ ఆశ్చర్యపోయారు డాక్టర్ ఆశ్చర్యపోయింది. ఇతనికి ఉన్న నిష్కల్మశమైన హృదయం అతని మీద ఒక ప్రభావం చూపిస్తుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు సైంటిఫిక్ ఏదో ఆ తర్వాత ఎవరైతే కేర్ టేకర్ గా పనిచేస్తున్న ఆ అతను ఉన్నాడో అతన్ని ఆస్ట్రేలియా తీసుకెళ్ళారు.
(05:13) తీసుకెళ్ళిన తర్వాత అతను ఆ పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు ఈ పిల్లవాడితో స్పెండ్ చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మెల్లగా పదాలు పలకడం రాయడం నేర్పించాడు. [సంగీతం] అతని సమయంంతా డివోట్ చేశాడు అతనికి వేరే డిస్ట్రాక్షన్ే లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఒక రెండు రెండున్నర సంవత్సరాలు తిరిగేలోపు డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆ పిల్లవాడి యొక్క బ్రెయిన్ లో కొన్ని అమూల్యమైన మార్పులు వచ్చాయి అని ఈ మేడం చెప్పింది నాతో ఆ తర్వాత మేడం నాతో అన్న మాట ఏమిటంటే ఈ అబ్బాయి వాళ్ళ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఉద్యోగం తెచ్చేసుకొని జీవితంలో ఏదో సాధించేసుకో అనుకున్నారు కానీ వాళ్ళ
(05:55) మనసు నిండా కల్మషము కుట్రలు కుతంత్రాలు పక్కవాడి మీద నెగిటివ్ అభిప్రాయాలు ఏం లాభం ఈ చిన్న పిల్లవాడు ఉన్నాడే వాడి బ్రెయిన్ బాగా లేదు కానీ వాడి హృదయం చాలా బాగుంది. వాడు దేన్ని ద్వేషించడు దేన్ని కోరుకోడు వాడికి ఏది అక్కర్లేదు. వాడి బ్రెయిన్ వాడితో ఒక ఆటలు ఆడిస్తుంటే వాడుఏదో హైపర్ గా బిహేవ్ చేశడు కానీ కావాలని ఏది చేయడు వాడు అట్లాగే ఈ చిన్న ఈ తమ్ముడు ఎవడైతే ఉన్నాడో అతను అంతే కానీ ఆశ్చర్యం అనుకోకుండా నేను చేసిన పని వల్ల వాళ్ళద్దరు కలిశారు ఇప్పుడు అతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు.
(06:31) పేరెంట్స్ చాలా సంతోషపడ్డారు. ఆ అబ్బాయి జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఆ అబ్బాయి మెల్లగా హ్యూమన్ గా బిహేవ్ చేస్తున్నాడు. డాక్టర్స్ మెడిసిన్స్ వల్ల సాధ్యం కానిది ఇతను చూపించిన ఒక అవ్యాజమైన కరుణ ప్రేమ వల్ల మేనిఫెస్ట్ అయింది అని తెలుసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిలో చాలా ఆస్తి [సంగీతం] అతనికి రాసి ఇచ్చేశరు. జీవితకాలం పిల్లవాడిని చూసుకో అన్నారు.
(06:57) అతను ఆస్తిని పట్టించుకోలేదు. మీరు ఆస్తి ఇచ్చారు కానీ పొంగిపోయింది లేదు ప్రత్యేకంగా వాళ్ళని గౌరవించింది లేదు. ఆ పిల్లవాడిని చూసుకుంటూనే ఉన్నాడు. ఇలా చెప్పి మేడం ఏమన్నదంటే కొందరు జీవితంలో డబ్బు సంపాదించడానికి ఏదో చేస్తారు. వాళ్ళ కొంతే వస్తుంది చాలా కష్టపడతారు ఒత్తిడి వేరే వాళ్ళ పట్ల అభిప్రాయాలు ఇవన్నీ కానీ అతను చూడు తను తనలా ఉన్నాడు.
(07:23) తన పని తాను చేసుకుంటున్నాడు. అతని జీవితంలో అన్నీ వచ్చాయి. ప్రయత్నం లేకుండా ఒక పని దొరికిద్ది. అప్రయత్నంగానే విదేశాలకు వెళ్ళాడు. అప్రయత్నంగానే వేరే వాళ్ళ అందరి హృదయాలు గెలుచుకున్నాడు. తను ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తున్నా అన్న స్పృహ లేకుండానే ఒక వ్యక్తి జీవితంలో కాంతిని తీసుకొచ్చాడు. తన జీవితంలో సరిపోయినంత డబ్బు సంపద అంతా వచ్చింది.
(07:48) దాంతో ఎవరైతే ద్వేషించే అన్నలు ఉన్నారో వదినలు ఉన్నారో తన తల్లిదండ్రులు ఉన్నారో అందరికీ డబ్బులు ఇచ్చాడు. అతను అలాగే ఉన్నాడు. అలా ఉండాలయ్యా జీవితం అంటే ఇదంతా ఒక మూడు నాలుగు సంవత్సరాల కాలంలో అడప దొడప మేడంని కలుస్తున్నప్పుడు నాకు తెలిసిన కథ ఈ చిన్న విషయం నా జీవితంలో ఒక అద్భుతమైన ప్రభావం చూపించింది.
(08:17) ఇప్పుడు ఒక వ్యక్తిగా నేను ఏం చేస్తాను ఏం చేయను అది కాదు ముఖ్యం సాటి మనిషిని ద్వేషించకూడదు. మన హృదయంలో మనలో కల్మషము కుట్రలు కుతంత్రాలు నెగిటివిటీ ఏది ఉండకూడదు. పవిత్రంగా ఉండాలి. నువ్వు ఈ సమాజాన్ని దేశాన్ని ఉద్ధరించిన తర్వాత నీలో కల్మశం ఉన్నప్పుడు ఆ కల్మశమే నిన్ను నడిపిస్తుంది. తద్వారా నువ్వు చేసే మంచి పనులో కూడా కల్మశం యొక్క ఇంపాక్ట్ ఉంటుంది.
(08:46) అన్నది ఏదో నాలో ఒక భావన కలిగింది. ఒకసారి అతన్ని కలిశాను అతను ఒక చిరునవ్వు నవ్వాడు నేను ఒక చిరునవ్వు నవ్వాను. సాదా సీదా మనిషిగా కనిపిస్తున్న అతను ఏ సాధన చేయకున్నా ఒక పరమహంస స్థితిలో ఉన్నాడు అతను ఎందుకో హటాత్తుగా నాకు ఈరోజు అతను గుర్తొచ్చాడు. అందుకని ఆ కథను చాలా క్లుప్తంగా మీకు చెప్పాను దానికంటే ఒక బుక్కే రాయొచ్చు అనే సంఘటనలు ఉన్నాయి.
(09:17) సో నేను చెప్పాలనుకున్నది ఒకటి మీరు సాటి మనిషికి ఏమ ఇస్తారో లేదో అది చాలా చిన్న విషయం. మీరు మీలా ఉండండి ద్వేషరహితంగా ఉండండి అదే మీరు సాటి మనిషికి ఇచ్చే ఒక అపూర్వమైన బహుమానం అని మాత్రం నేను రూడిగా చెప్పగలను. శ్రీ సరసవైస
No comments:
Post a Comment