Thursday, April 2, 2026

The Dark Side of Motherhood: ఎవ్వరూ చెప్పని భయంకర నిజం! | Nagna Satyam Telugu Podcast

The Dark Side of Motherhood: ఎవ్వరూ చెప్పని భయంకర నిజం! | Nagna Satyam Telugu Podcast

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OaRWtS4tmvc



Transcript:
(00:01) [సంగీతం] ప్రేమ బొంద అంతా బిజినెస్ బాబు ఇక్కడ స్వార్థం లేనిదే ఏ బంధం పుట్టదు ఏ బంధం పెరగదు. మనం పవిత్రం అని పూజించే అమ్మకణం వెనక కూడా ఒక పక్కా కమర్షియల్ లెక్క ఉంది. అమ్మ అంటే ఒక త్యాగం అమ్మ అంటే ఒక దేవత అని సినిమాలు తీసి తీసి మన బుర్రలు ఖరాబ్ చేశారు. కానీ అసలు నిజం ఏంటంటే ఈ భూమి మీద అత్యంత తెలివైన స్వార్ధపరురాలు ఎవరా అని అడిగితే అది తల్లి ఒక ఆడది బిడ్డను కనాలనే కోరిక దగ్గరే స్వార్థం మొదలవుతుంది.
(00:42) ఆ బిడ్డ నాకోసం పుట్టాలి నా కడుపున పుట్టాలి రేపు పొద్దున్న నేను ముసలిదాన్ని అయ్యాక నాకు ఒక గొడుగులా ఉండాలి ఇవన్నీ స్వార్థం కాకపోతే ఇంకేంటి సరే తల్లి చేసే త్యాగాలు అంటారా అవన్నీ ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్స్ చిన్నప్పుడు నీకు అన్నం పెట్టింది నీ చదువు కోసం నగలమ్మింది అంటే అది నీ మీద ప్రేమతో కాదు రేపు నువ్వు ఒక పెద్ద పొజిషన్ కి వెళ్లి తన పేరు నిలబెడతావని సమాజంలో తనకి గౌరవం వస్తుందని ఇవంతా వాళ్ళకి తెలియకుండానే జరుగుతాయి.
(01:09) నువ్వు ఆ ప్లాన్ ప్రకారం నడుచుకోకపోతే చూడు ఆ తల్లి కళ్ళలో అగ్ని జ్వాలలే ఇంకా నిన్ను కన్నందుకు నేను నన్ను చెప్పుతో కొట్టుకోవాలి అనే డైలాగ్ విన్నావా అంటే అర్థం ఏంటి తను నీ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అయిందని ఆమె ఏడుపు తన కలలు నీ ద్వారా నెరవేరలేదని ఆమె ఆక్రోశం మరి అక్కడ నీ ఇష్టం ఏమైపోయింది నీ లైఫ్ ఏమైపోయింది నీకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుందని ఆమె ఎందుకు గుర్తించదు ఎందుకంటే నువ్వు ఆమెకు ఒక ప్రాణం కాదు ఒక ప్రాపర్టీవి చాలా మంది మంది తల్లులు తమ పిల్లల జీవితాలని కంట్రోల్ చేయడంలో ఒక సైకో ఆనందాన్ని పొందుతారు.
(01:44) నీకు ఏ డ్రెస్ కావాలో తనే డిసైడ్ చేయాలి. నువ్వు ఏ చదువు చదవాలో ఆమె డిసైడ్ చేస్తుంది. చివరకు నువ్వు ఎవరితో పడుకోవాలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా ఆమె పెత్తనమే దీన్ని ప్రేమ అంటారా ఇది పక్కా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ నేను నీకోసం అన్ని చేశాను. నువ్వు నాకోసం ఇది చేయలేవా అని అడిగే ప్రతి తల్లి ఒక డీల్ మాట్లాడుతుంది. ప్రేమలో డీల్స్ ఉండవు బాబు కానీ ఇక్కడ ప్రతి అడుగులో ఒక కండిషన్ ఉంటుంది.
(02:09) ఆమె చెప్పినట్టు వింటే నువ్వు మంచి కొడుకువి ఆమె పద్ధతికి ఎదురు తిరిగితే నువ్వు వెధవవి అంటే అక్కడ ప్రేమ అనేది నువ్వు ఆమెక ఇచ్చే ఒబీడియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే కదా స్వార్థం అంటారు. చరిత్రలో చూసినా, పురాణాల్లో చూసినా ఈ కన్నతల్లి స్వార్థం కనిపిస్తూనే ఉంటుంది. కైకేయిని చూడు తన కొడుకు భరతుడు రాజు కావాలని రాముణని అడవులకు పంపింది.
(02:29) అక్కడ కొడుకు మీద ప్రేమ కంటే నేను రాజమాతను కావాలి అనే అహంకారం స్వార్థం లేవా అలానే కుంతిని తీసుకో తన కొడుకుల ప్రాణాలు కాపాడుకోవడం కోసం కర్ణుడి దగ్గరికి వెళ్లి నువ్వు నా కొడుకువి అని ఎమోషనల్ డ్రామా ఆడింది. ఇన్నాళ్ళు లేని అమ్మతనం యుద్ధం ముంగిటి ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకంటే తన మిగతా ఐదుగురు కొడుకులు బతకాలి కాబట్టి అంటే ఒక కొడుకు ప్రాణం కంటే తన దగ్గర ఉన్న కొడుకుల క్షేమమే ఆమెకు ముఖ్యం.
(02:54) ఇక్కడ కూడా సెలెక్టివ్ స్వార్థమే కదా సమాజం మనల్ని భయపెట్టిస్తుంది. అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నరకానికి పోతావు అని అందుకే ఎవరు నోరు విప్పరు కానీ లోపల ప్రతి కొడుకు ప్రతి కూతురు ఒక పాయింట్ దగ్గర తల్లి పెత్తనాన్ని భరించలేక ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఉంటారు. నా కొడుకు నన్నే అడగాలి నన్నే చూసుకోవాలి ఆ వచ్చే కోడలు నా మాట వినాలి అని కోరుకునే ప్రతి అత్త ఒక తల్లి కదా అక్కడ ఎందుకు ఆ ప్రేమ మాయమైపోతుంది ఎందుకంటే అక్కడ అధికారం ముఖ్యం తన కొడుకు మీద తనకున్న గ్రిప్ పోతుందనే భయం అది ఆ భయంలో గొడవలు మొదలవుతాయి.
(03:28) ఒక మనిషిని ఇంకో మనిషికి దూరం చేయాలని చూసే ఏ మనస్తత్వం అయినా అది స్వార్థమే దానికి అమ్మ అనే ముసుగు వేసినా అది విషమే. ఇంకో విషయం ఈ త్యాగం అనే పదాన్ని తల్లులు ఒక వెపన్ లాగా వాడతారు. నేను పస్తులుండి నిన్ను సాకాను అంటారు. ఎందుకున్నావు అది నీ బాధ్యత. ఒక ప్రాణాన్ని భూమి మీదకు తెచ్చినప్పుడు వాడిని పెంచడం నీ కర్తవ్యం దాన్ని ఒక గొప్పగా ఒక అప్పుగా పిల్లల మీద రుద్దడం ఏ రకమైన న్యాయం? ఒకవేళ కనిన వెంటనే ఆ బిడ్డ ఎక్కడైనా పడేసిన ఆ బిడ్డ బతకగలదు.
(03:57) నువ్వు చేసిన త్యాగానికి పిల్లలు నీకు జీవితాంతం బానిసలుగా ఉండాలని కోరుకోవడం ఏ రకమైన న్యాయం? పిల్లలు అంటే నీకోసం పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళు ఈ ప్రపంచం కోసం పుట్టిన వాళ్ళు కానీ తల్లులు వాళ్ళని తమ ఇంటి నాలుగు గోడల మధ్య తమ ఆలోచనల మధ్య ఖైదీలు చేస్తారు. చాలా మంది తల్లులు తమ పర్సనల్ లైఫ్ లో ఫెయిల్ అయినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల మీద చూపిస్తారు.
(04:17) మొగుడు సరిగ్గా చూసుకోకపోతే ఆ కోపాన్ని పిల్లల్ని అతిగా కంట్రోల్ చేయడం ద్వారా సాటిస్ఫై చేసుకుంటారు. నాకు ఎవ్వరూ లేరు. నువ్వే నా సర్వస్వం అని పిల్లల మీద ఒక ఎమోషనల్ బరువును మోపుతారు. ఆ బరువు మోయలేక పిల్లలు తమ సొంత ఇష్టాలను చంపుకొని అమ్మ కోసం బతుకుతుంటారు. ఇదొక రకమైన స్లో పాయిజన్ ఒక మనిషి ఎదుగుదలని ఆపే ప్రతీదీ క్రైమ్ తల్లి ప్రేమ పేరుతో జరిగే ఈ క్రైమ్ గురించి ఎవ్వరూ మాట్లాడరు.
(04:42) బిడ్డ పుట్టినప్పుడు తల్లికి కలిగే ఆనందం వెనక కూడా ఒక సైకాలజీ ఉంది. ఇక మీడిట నా మాట వినే ఒక ప్రాణం ఉంది. నాకంటూ ఒక తోడు దొరికింది అని సెల్ఫ్ సెంట్రిక్ ఆలోచన అది. నువ్వు ఎప్పుడైతే ఎదగడం మొదలు పెడతావో ఎప్పుడైతే నీకంటూ ఒక సొంత ఆలోచన వస్తుందో [సంగీతం] అప్పటినుంచే తల్లికి నీకు మధ్య యుద్ధం మొదలవుతుంది. ఎందుకంటే నీకు రెక్కలు రావడం ఆమెకు ఇష్టం ఉండదు.
(05:02) నువ్వు ఎగిరిపోతే ఆమె ఒంటరైపోతుంది. అందుకే ప్రేమ అనే దారంతో నీ కాళ్ళని కట్టేస్తుంది. ఆ దారం తెంచుకోవాలని చూస్తే ద్రోహి అని ముద్ర వేస్తుంది. ఈ ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదు. తల్లి ప్రేమ కూడా అంతే దానికి నువ్వు నీ వ్యక్తిత్వాన్ని మూల్యంగా చెల్లించాలి. ఆమె చెప్పినట్టు ఆడితే ఆమె దేవత లేదంటే ఆమె ఒక సాధారణ మనిషి కంటే ప్రమాదకరంగా మారుతుంది.
(05:23) పురాణాల్లో తల్లి కోసం తండ్రిని చంపిన పరశురాముడిని గొప్పగా చెప్తారు. కానీ తన స్వార్థం కోసం కొడుకుని బలి ఇచ్చే తల్లుల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ గ్లామరైజ్డ్ అమ్మతనం వెనకున్న అసలు రహస్యం భయం. సమాజం ఏమనుకుంటుందో అనే భయం ఒంటరితనం అనే భయం ఈ భయాలని కప్పి పుచ్చుకోవడానికి వాడే రంగుల పేరే మమకారం.
(05:43) ఒక తల్లి తన బిడ్డను తనకంటే గొప్పగా చూడాలని కోరుకుంటుంది అంటారు. కానీ నిజానికి అది తన కంట్రోల్ లో ఉన్నంతవరకే సాధ్యం. బిడ్డ తనను దాటిపోతున్నాడు అని తెలిసిన క్షణం ఏ తల్లి సహించలేదు. అది కెరియర్ అయినా రిలేషన్షిప్ అయినా తన ప్రమేయం లేని ఏ సంతోషం బిడ్డకు కలిగినా ఆమె లోపల ఎక్కడో ఒక అసూయ కలుగుతుంది. నేను లేకుండా వీడు ఎలా సంతోషంగా ఉన్నాడు అనే ఆలోచన ఆమెను దహించేస్తుంది.
(06:06) అందుకే కావాలని సమస్యలు సృష్టించడం సెంటిమెంట్ డైలాగులు కొట్టడం మొదలు పెడుతుంది. ఇదంతా వినడానికి చాలా రఫ్ గా ఉండొచ్చు. కానీ ఇదే నిజం. కళ్ళు తెరిచి చూస్తే ప్రతి ఇంట్లోనూ ఈ ఎమోషనల్ డ్రామా కనిపిస్తుంది. అమ్మని ఒక మనిషిలా చూడండి. దేవతలా కాదు అప్పుడు ఆమె లోపల ఉన్న ఈ లోపాలు ఈ స్వార్థం ఈ కుతంత్రాలు అన్నీ కనిపిస్తాయి. ఆమె కూడా ఒక ఆడదే ఆమెకు కూడా ఈగో ఉంటుంది.
(06:29) ఆమెకు కూడా జెలసీ ఉంటుంది. ఆ జలసీ తన బిడ్డ మీద కూడా ఉండొచ్చు. సినిమాల్లో చూపించే సెంటిమెంట్ సీన్లు చూసి ఏడవకండి రియాలిటీలోకి రండి. ప్రతి రిలేషన్ ఒక గివ్ అండ్ టేక్ పాలసీ మీద నడుస్తుంది. అమ్మ ప్రేమ కూడా దానికి మినహాయింపు కాదు. ఆమె నీకు జన్మనిచ్చింది నిజమే. కానీ అది ఆమె కోరిక కోసం నువ్వు అడిగితే ఇవ్వలేదు కదా మరి ఆమె చేసిన దానికి నువ్వు ఎందుకు బానిసగా ఉండాలి కృతజ్ఞత ఉండాలి కానీ అది నీ బతుకుని బలి ఇచ్చేంతగా ఉండకూడదు.
(06:53) ఈ లోకంలో ఎవరి స్వార్థం వాళ్ళది తల్లిది కూడా అంటే ఆ స్వార్థాన్ని గుర్తించు ఆ మాయలో నుంచి బయటపడు అప్పుడే నీ లైఫ్ నీ చేతుల్లోకి వస్తుంది. లేదంటే అమ్మ అనే బ్రాండ్ కి నువ్వు ఒక బానిసవు మాత్రమే. తల్లి మీద ప్రేమ ఉండాలి అది మంచిదే కానీ అతి ప్రేమ మంచిది కాదు. [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(07:52) [సంగీతం]

No comments:

Post a Comment