Thursday, April 2, 2026

చనిపోయేది నేను కాదు 💠 చిన్న వయసులో జ్ఞానం | అరుణాచలం ఒక అద్భుతం | యోగానంద జీవితంలో ముఖ్యమైన సంఘటన..🚨

చనిపోయేది నేను కాదు 💠 చిన్న వయసులో జ్ఞానం | అరుణాచలం ఒక అద్భుతం | యోగానంద జీవితంలో ముఖ్యమైన సంఘటన..🚨

Author Name:My Journey Sg

Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ALIZA0wuxMg



Transcript:
(00:04) ప్రజయా హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఈ కుండలిని సిరీస్ లో మాట్లాడుకోబోయే టాపిక్ అసలు సాధన లేకుండా కుండలిని జాగృత్తి జరిగితే దాని అర్థం ఏమిటి? ఈరోజు చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో అడిగే ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. నేను పెద్దగా యోగ సాధన ఏమి చేయలేదు. కానీ నా శరీరంలో ఏదో శక్తి కదులుతున్నట్టు అనిపిస్తుంది.
(00:29) ఇది కుండలనే జాగృత్తి అవుతుందా? మరొక ప్రశ్న సాధన లేకుండా కుండలినే యాక్టివేట్ అవుతుందా? మరి కొందరు ఇలా అనుకుంటారు. బహుశా ఇది గత జన్మలో చేసిన సాధన వల్ల అయి ఉండొచ్చు. ఈ విషయం గురించి చాలా అపోహలు కూడా ఉన్నాయి. అందుకే ఈరోజు మనం చాలా క్లియర్ గా ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. అసలు కుండలిని అంటే ఏంటి? యోగశాస్త్రాల ప్రకారం మన శరీరంలో ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది.
(00:53) దానిని కుండలని శక్తి అని అంటారు. ఈ శక్తి సాధారణంగా వెన్నుపూస చివరి భాగంలో నిద్రిస్తున్నట్టుగా ఉంటుంది. యోగ సాంప్రదాయాల ప్రకారం ఈ శక్తి మెల్లగా పైకి ఎక్కుతూ మన చైతన్యాన్ని విస్తరిస్తుంది. ఈ ఆలోచన గురించి అనేక యోగ గ్రంథాలు చెబుతున్నాయి. ఉదాహరణకు హతయోగ ప్రాదీపిక మరియు శివ సంహిత వంటి పుస్తకాల్లో ఈ కుండలిని గురించి వివరంగా ఉంది.
(01:16) కుండలిని జాగృతి అనేది కేవలం శరీరా అనుభవం కాదు ఇది ఒక చైతన్య మార్పు సాధారణంగా కుండలి ఎలా జాగృతి అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కుండలి జాగృతి అనేది మెల్లగా జరుగుతుంది. దానికి కారణం యోగ సాధన, ధ్యానం, ప్రాణాయామం, భక్తి, గురువు మార్గదర్శన. ఈ ప్రక్రియ చాలా సున్నితమైనది. అందుకే చాలా మంది గురువులు ఇలా చెబుతారు.
(01:38) కుండలిని సాధన అనేది ఓర్పుతో చేయాలి. శక్తి పెరిగితే శరీరం మనసు దాన్ని హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. అయితే సాధన లేకుండా కుండలిని జాగృతి అవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం సున్నితమైనది. కొన్ని సందర్భాల్లో అవుననే చెప్పాలి కానీ అది చాలా అరుదు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని కారణాలు ఉండవచ్చు. నెంబర్ వన్ గతజన్మ సాధన.
(02:01) యోగ తత్వశాస్త్రం ప్రకారం మనం గతజన్మలో చేసిన సాధన పూర్తిగా పోదు. ఆ అనుభవాలు సంస్కారాలుగా మనలో నిలిచిపోతాయి. సరైన సమయం వచ్చినప్పుడు అవి మళ్ళీ మేల్కొనే అవకాశం ఉంది. రెండవది గురువు కృప. కొన్నిసార్లు గురువు ఆశీర్వాదం వల్ల కూడా శక్తి కదలికలు ప్రారంభం అవుతాయి. మూడవది [సంగీతం] లోతైన భక్తి తీవ్రమైన భక్తి కూడా ఒక ఆధ్యాత్మిక శక్తిని మేలుకొలుపుతుంది.
(02:23) ఆధ్యాత్మిక చరిత్రలో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు రమణ మహర్షి. ఆయన చిన్న వయసులోనే ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభవం పొందారు. ఆ అనుభవం తర్వాత ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంకొక ఉదాహరణ పరమహంస యోగానంద. ఆయన తన రచనల్లో గతజన్మ సాధన గురించి కూడా చెప్పారు. ఈ ఉదాహరణలు మనకు ఒక విషయం చెబుతున్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణం ఒకే జన్మలో పూర్తయ్యేది కాదు.
(02:47) అయితే వీళ్ళ ఇద్దరి గురించి నేను వీడియో ఎండింగ్ లో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకే చూడండి. అయితే నిజంగా కుండలని కదిలితే వచ్చే అనుభవాలు ఎలా ఉంటాయి? కొంతమందికి ఈ అనుభవాలు కనిపించవచ్చు. వెన్నుపూస దగ్గర వేడి అంటే కరెంట్ లాంటి ఫీలింగ్ శరీరంలో కంపనలు ధ్యానం సహజంగా జరగటం తల వద్ద ఒత్తిడి కొంతమందికి నుదిటి దగ్గర కూడా చాలా ప్రెజర్ ని ఫీల్ అవుతూ ఉంటారు.
(03:13) కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇవి మాత్రమే ఉంటే అది కుండలిని అని చెప్పడం సరైంది కాదు. కొన్నిసార్లు ఇవి నర్వస్ సిస్టం స్పందనలు కూడా అయి ఉండవచ్చు. భావోద్వేగ మార్పులకు కూడా ఇదొక కారణం. ధ్యానం వల్ల వచ్చిన శరీర స్పందనలు కూడా అవ్వచ్చు. నిజంగా కుండలిని జాగృతి జరిగితే కొన్ని లోతైన మార్పులు కనిపిస్తాయి. ఉదాహరణకు మనసు ప్రశాంతంగా మారటం, అహంకారం తగ్గటం, ప్రేమ, కరుణ పెరగటం, జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవటం మొదలవుతుంది.
(03:42) లోపల ఒక స్థిరమైన ఆనందం ఉంటుంది. ఇవి నిజమైన ఆధ్యాత్మిక మార్పులు. అయితే కుండలిని అనుభవం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇలాంటి అనుభవాలు వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీరు అస్సలు భయపడకూడదు. ఇది సహజమైన ప్రక్రియ కావచ్చు. రెండవది మంచి నిద్ర సరైన ఆహారం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవది ధ్యానం మెల్లగా అలవాటు చేసుకోండి.
(04:05) బలవంతంగా శక్తిని పెంచే సాధనాలు అస్సలు చేయకండి. నాలుగవది అనుభవం ఉన్న గురువులను సంప్రదించండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటేనే మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో తెలుస్తుంది. మీ అనుభవాలు పంచుకోవడానికి మీ అనుభవాలలో అర్థం కాని విషయాలను తెలియచెప్పడానికి గురువు ఆవశ్యకత ఎంతైనా ఉంది కదా ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఒక పెద్ద అపోహ ఉంది.
(04:29) చాలా మంది చిన్న చిన్న అనుభవాలను కూడా కుండలిని జాగృతి అని అనుకుంటున్నారు. కానీ నిజమైన కుండలిని జాగృతి చాలా లోతైన ప్రక్రియ. అది కేవలం శరీరా అనుభవం కాదు. అది ఒక చైతన్య విస్తరణ. కాబట్టి చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. సాధన లేకుండా కూడా కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు రావచ్చు కానీ వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నిజమైన ఆధ్యాత్మిక మార్గం అంటే ఓర్పు, అవగాహన, సాధన, వినయం.
(04:54) ఈ నాలుగు ఉంటే ఆధ్యాత్మిక ప్రయాణం సాఫీగా జరుగుతుంది. అయితే వీడియో స్టార్టింగ్ లో చెప్పిన విధంగా ఇప్పుడు మనం రమణ మహర్షి గురించి అలాగే పరమహంస యోగానంద వీళ్ళ గురించి తెలుసుకుందాం. వారి జీవితాలలో జరిగిన అనుభవాలను పరిశీలిద్దాం. ఫస్ట్ రమణ మహర్షి గురించి సాధన లేకుండా జరిగే ఆధ్యాత్మిక జాగృతి గురించి తన చిన్ననాటి జీవితం గురించి మాట్లాడుకుందాం.
(05:17) రమణ మహర్షి 1879 లో తమిళనాడులో తిరుచులి అనే గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు వెంకటరామన్ అయ్యర్. చిన్ననాటిలో ఆయన చాలా సాధారణ బాలుడే. అప్పటివరకు ఆయనకు యోగ సాధన, ధ్యానం ఆధ్యాత్మిక సాధనలు ఇవేమి ప్రత్యేకంగా చేయలేదు. అందుకే ఆయన జీవితంలో జరిగిన ఆధ్యాత్మిక అనుభవం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అకస్మాత్గా జరిగిన ఆధ్యాత్మిక అనుభవం అది.
(05:40) రమణ మహర్షి 16 సంవత్సరాల వయసులో ఒకరోజు అద్భుతమైన అనుభవం జరిగింది. ఒకరోజు ఆయన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్గా ఒక తీవ్రమైన మరణ భయం వచ్చింది. అది సాధారణ భయం కాదు. ఇప్పుడు నేను చచ్చిపోతానా అనే భావన ఆయనకు వచ్చింది. కానీ ఆయన భయపడకుండా ఒక ప్రయోగం చేశారు. ఆయన నేలపై పడుకొని శరీరాన్ని పూర్తిగా కదలకుండా ఉంచారు. అప్పుడు ఆయన తనలో ఒక ప్రశ్న అడిగారు.
(06:05) ఈ శరీరం చనిపోతే నిజంగా ఎవరు చస్తారు? అప్పుడు ఆయన ఒక గొప్ప సత్యాన్ని గ్రహించారు. శరీరం కదలకుండా పడుకొని ఉంది. కానీ లోపల ఒక చైతన్యం ఇంకా ఉంది. ఆ క్షణంలో ఆయన గ్రహించారు. నేను శరీరం కాదు నేనే అవగాహన. నేనే ఆ చైతన్యం. ఈ అనుభవం తర్వాత ఆయన చైతన్యం పూర్తిగా మారిపోయింది. ఆ సంఘటన తర్వాత ఆయన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. మరణ భయం పూర్తిగా పోయింది.
(06:29) మనసు చాలా ప్రశాంతంగా మారింది. ప్రపంచ విషయాలపై ఆసక్తి తగ్గింది. లోపల నిరంతరం శాంతి అనుభవం వచ్చింది. ఇది జరిగినప్పుడు ఆయనకు గురువు లేరు. యోగ శిక్షణ లేదు. ప్రత్యేకమైన సాధన ఏమి చేయలేదు. అందుకే చాలా మంది ఆధ్యాత్మిక గురువులు దీన్ని సహజ ఆత్మ జాగృతిగా భావిస్తారు. ఆ అనుభవం తర్వాత రమణ మహర్షికి ఒక లోతైన ఆకర్షణ వచ్చింది.
(06:52) అది తమిళనాడులోని పవిత్ర పర్వతం అరుణాచలం ఆయన ఇంటిని వదిలి తిరువన్మలకి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన అనేక సంవత్సరాలు లోతైన ధ్యానంలో జీవించారు. ఆయన చాలా కాలం మౌనంగా ఉండేవారు. లోపల ధ్యానంలో మునిగిపోయేవారు. అతని సమీపంలో కూర్చున్న వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన శాంతి అనుభూతి వచ్చేది. రమణ మహర్షి జీవితం మనకు ఒక విషయాన్ని చెబుతుంది. కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక జాగృతి సాధన లేకుండానే కూడా జరుగుతుంది.
(07:17) కానీ అది చాలా అరుదు. అది సాధారణంగా గతజన్మ సంస్కారాలు లేదా లోతైన ఆత్మ సిద్ధత వల్ల జరుగుతుంది. ఇప్పుడు మనం పరమహంస యోగానంద గతజన్మ సంస్కారాల గురించి మరియు సాధన ద్వారా జాగృతి గురించి తెలుసుకుందాం. పరమహంస యోగానంద 1893 లో గోర్కాపూర్లో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆధ్యాత్మిక విషయాలపై చాలా ఆసక్తి ఉండేది.
(07:41) ఇతర పిల్లలతో పోలిస్తే ఆయనలో భక్తి ధ్యానం దేవుని అనుభవించాలనే కోరిక చాలా బలంగా ఉండేది. యువకుడిగా ఉన్నప్పుడు యోగానంద భారతదేశం అంతా తిరిగి [గొంతు సవరించుకోవడం] ఒక నిజమైన గురువును వెతికారు. చివరకు ఆయన స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి వారణాసిలో కలుసుకున్నారు. ఆయన చూసిన వెంటనే ఒక లోతైన అనుభూతి వచ్చింది. అది ఇలా అనిపించింది. అది నేను చాలా కాలంగా వెతుకుతున్న గురువు ఇతనే అని.
(08:05) యుక్తేశ్వర్ మార్గదర్శకత్వంలో యోగానంద క్రియాయోగ అనే శక్తివంతమైన ధ్యాన పద్ధతిని అభ్యసించారు. ఈ సాధన ద్వారా శ్వాస నియంత్రణ, ప్రాణశక్తి నియంత్రణ, లోతైన ధ్యానం జరిగేవి. ఈ సాధన ద్వారా ఆయన లోతైన ఆధ్యాత్మిక అనుభవాలను పొందారు. యోగానంద తన జీవితంలో అనేకమైన మిస్టిక్ అనుభవాలను వివరించారు. అందులో లోతైన ఆనందం, విశాలమైన చైతన్యం అంతర్గత శాంతి ఉన్నాయి.
(08:30) ఆయన ప్రసిద్ధ గ్రంథం ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగిలో ఈ అనుభవాలను వివరంగా చెప్పారు. తర్వాత యోగానంద అమెరికాకు వెళ్లి ఆధ్యాత్మిక బోధనాలను ఇచ్చారు. అక్కడ ఆయన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే సంస్థను స్థాపించారు. ఆయన సందేశం చాలా స్పష్టంగా ఉంది. ధ్యానం మరియు సాధన ద్వారా ప్రతి ఒక్కరు ఉన్నతమైన చైతన్యాన్ని అనుభవించొచ్చు అని. ఈ ఇద్దరు మహానుభావుల జీవితం మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది.
(08:52) ఆధ్యాత్మిక జాగృతి రెండు విధాలుగా జరుగుతుంది. అకస్మాత్తుగా జరిగే జాగృతి ఇది చాలా అరుదుగా జరుగుతుంది. సాధన ద్వారా మెల్లగా జరిగే జాగృతి ఇది చాలా సాధారణంగా జరుగుతుంది. అందుకే చాలా మంది గురువులు ఒకే విషయాన్ని చెబుతారు. సాధన, అవగాహన మరియు ఓర్పు ఇవే నిజమైన ఆధ్యాత్మిక మార్గం. మరి వచ్చే వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుసుకుందాం.
(09:14) ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి అది వాళ్ళకి తెలిసి జరగొచ్చు తెలియకుండా జరగొచ్చు కొన్ని కలల్లో వస్తాయ అంటే ప్రతి కలకి చాలా డీప్ మీనింగ్ ఉంటది దాన్ని డీకోడ్ చేస్తే దాంట్లో అసలు ఏం మెసేజ్ ఉంది అలా తెలుస్తది నాకు కూడా కలలో చాలా సైన్స్ వచ్చేటివి అన్నమాట సో ఒక్కొక్కటి మనం ఈ సిరీస్ లో మాట్లాడుకుందాం మీరు కామెంట్ లో పెట్టండి సో మనం దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం.
(09:36) సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ నాసహైగబాం ప్రవజం [సంగీతం] ప్రజామినాసహైగవా ఆహం ప్రవజం [సంగీతం] ప్రజయామి సహైగబాం ప్రవజం [సంగీతం] ప్రజయ

No comments:

Post a Comment