సొంతవాళ్లే శత్రువులుగా మారితే ఎలా ఎదుర్కోవాలి? | Best Telugu Motivational Video
Author Name:SRIRAM ALL IN ONE
Youtube Channel Url:https://www.youtube.com/@sriramallinone
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rphiB4cixbI
Transcript:
(00:00) జీవితం అనే ప్రయాణంలో ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఒక చేదు నిజం ఎదురవుతుంది. బయట ప్రపంచంలో మనకు శత్రువులు ఉంటే వారిని ఎదుర్కోవడం చాలా సులభం. ఎందుకంటే వారు మనకు ఎదురుగా నిలబడతారు. వారి చేతిలో ఉన్న ఆయుధం మనకు కనిపిస్తుంది. వారి కళ్ళల్లో ఉన్న ద్వేషం మనకు తెలుస్తుంది. అప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక కవచాన్ని సిద్ధం చేసుకుంటాం.
(00:28) కానీ అసలైన ప్రమాదం బయటి శత్రువులతో కాదు. మన ఇంట్లోనే మనతో పాటు కలిసి భోజనం చేసే వ్యక్తులతోనే వస్తుంది. ఒక మహా వృక్షం బయట నుంచి వచ్చే గాలి వానలు కూలిపోదు. కానీ దాని వేర్ల లోపల చేరు పురుగులు ఆ చెట్టును లోపల నుంచి నిశశబ్దంగా తినేస్తాయి. అలాగే మన జీవితంలో కూడా మనం ప్రాణంగా ప్రేమించిన వారు మన రక్త సంబంధీకులు మన ఎదుగుదలకు అండగా ఉంటారని నమ్మిన సొంత మనుషులే మన పాలిట శత్రువులుగా మారినప్పుడు ఆ బాధను వర్ణించడానికి ఏ భాషలోనూ పదాలు సరిపోవు.
(01:04) ఆ నొప్పి శరీరానికి తగిలే గాయం లాంటిది కాదు నేరుగా ఆత్మను తొలిచేసే నరకం మనసు ముక్కలైపోతుంది. నమ్మకం అనే పునాది కూలిపోతుంది. నేను ఎవరికైతే నా జీవితాన్ని నా సంపాదనను నా సమయాన్ని ధారపోశానో వారే నా వెనక నుంచి కత్తి దించారా అన్న ప్రశ్న ప్రతి రాత్రి నిద్రపోనివ్వకుండా వెంటాడుతుంది. చరిత్ర పుటలను ఒక్కసారి తిరిగేసి చూస్తే సామ్రాజ్యాలు కూలిపోయింది పరాయి దేశాల దండయాత్రల వల్ల కాదు అంతఃపురంలో జరిగిన కుట్రల వల్లనే రామాయణంలో వాలి సుగ్రీవుల కథను ఒక్కసారి గుర్తు చేసుకోండి.
(01:46) ఇద్దరు సొంత అన్నదమ్ములు ఒకరి ప్రాణం మరొకరు అన్నంతగా పెరిగారు. కానీ వారి మధ్య వచ్చిన ఒక చిన్న అపార్థం ఆ తర్వాత రగులుకున్న అహంకారం ఒకరినొకరు చంపుకునే స్థాయికి తీసుకువెళ్ళాయి. బయట వాళ్ళు ఎవరో వచ్చి వారిని విడదీయలేదు. వారిలో పుట్టిన అపనమ్మకమే వారిని శత్రువులను చేసింది. ఈరోజు మన సమాజంలో మన ఇళ్లలో జరుగుతున్నది కూడా ఇదే.
(02:16) మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేక మన ఆనందాన్ని చూసి సహించలేక మన కళ్ళెదుటే మన సొంతవాళ్లే మన పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ చేదు నిజాన్ని అంగీకరించడానికి చాలామందికి ఒక జీవితకాలం పడుతుంది. కానీ దీన్ని ఎంత త్వరగా గుర్తిస్తే నీ జీవితం అంత త్వరగా సురక్షితమవుతుంది. అసలు మన శ్రేయస్సును కోరుకోవాల్సిన సొంత మనుషులే ఎందుకు మనకు విషం లాగా మారుతారు వారు ఎందుకు మన ఎదుగుదలను అడ్డుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలి అంటే మన మానవ నైజన్ లోని చీకటి కోణాలను అర్థం చేసుకోవాలి.
(02:56) చాలాసార్లు మనం కుమిలిపోతూ ఉంటాం. నేను వారికి ఎలాంటి కీడు చేయలేదే వారి కష్టాల్లో నా చేతికి ఎముక లేనట్టు సహాయం చేశానే అయినా వారు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు అని ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక అతి పెద్ద సత్యం ఏమిటంటే ఒకరు మిమ్మల్ని ద్వేషించడానికి మీరు తప్పు చేయాల్సిన అవసరం లేదు. మీ విజయమే వారికి ఒక పెద్ద శిక్ష.
(03:24) మనస్తత్వ శాస్త్రం ప్రకారం సొంత కుటుంబంలో శత్రుత్వం పుట్టడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి. మొదటిది ఆస్తుల పట్ల డబ్బు పట్ల ఉండే అంతు లేని దాహం ఈ లోకంలో రక్తాన్ని నీరుగా మార్చేయగల ఒకే ఒక రసాయనం డబ్బు ఎన్నో ఏళ్లుగా ఒకే కంచంలో తిన్న అన్నదమ్ములు ప్రాణంగా కలుసున్న అక్కా చెల్లెలు కూడా ఆస్తి పంపకాలు డబ్బుల విషయాలు వచ్చేసరికి కరుడు గట్టిన శత్రువులుగా మారిపోతారు.
(03:57) వాళ్ళ కళ్ళకు అప్పుడు బంధం కనిపించదు. కేవలం కాగితాలు కరెన్సీ నోట్లు మాత్రమే కనిపిస్తాయి. నీ దగ్గర ఉన్నది లాక్కోవాలి లేదా నీకంటే ఎక్కువ వారు సంపాదించాలి అన్న పిచ్చివారిని రాక్షసులుగా మారుస్తుంది. నీ మీద ప్రేమ కంటే నీ డబ్బు మీద ఉన్న ఆశ వారిని నడిపిస్తుంది. ఇక రెండవది మనిషిని లోపల నుంచి కాల్చేసే ఈర్ష. ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు.
(04:28) మీరు గమనిస్తే ఎక్కడో ఉన్న ఒక అపరిచితుడు కోటీశ్వరుడు అయితే మీ సొంత వాళ్ళకు ఎలాంటి బాధ ఉండదు కానీ వారితో పాటు ఒకే ఇంట్లో పెరిగిన మీరు వారితో సమానంగా చదువుకున్న మీరు ఈరోజు వారికంటే ఒక మెట్టు పైన ఉంటే వారి మనసు అంగీకరించదు. వాళ్ళ లోపల ఒక నిరంతర యుద్ధం నడుస్తూ ఉంటుంది. నాతో పాటు ఉన్న వీడు ఇంత గొప్పవాడు ఎలా అయిపోయాడు అన్న అసూయ వారిని నిద్రపోనివ్వదు.
(04:58) వాళ్ళు మీరు బాగుండాలని కోరుకుంటారు కానీ వాళ్ళకంటే మీరు బాగుండకూడదు అని బలంగా కోరుకుంటారు. ఆ అసూయ నెమ్మదిగా ద్వేషంగా మారుతుంది. [సంగీతం] ఆ ద్వేషమే కుట్రలకు దారి తీస్తుంది. మీ పేరును చెడగొట్టడానికి మీ క్యారెక్టర్ ను సమాజం ముందు తక్కువ చేయడానికి వారు శతవిధాలా ప్రయత్నిస్తారు. మూడవది ఎదుటివారిని అణచివేయాలనే అహంకారం.
(05:25) ప్రతి కుటుంబంలో కొందరు వ్యక్తులు ఉంటారు. వారు గీసిన గీతను అందరూ దాటకూడదు అని శాసిస్తుంటారు. తాము చెప్పిందే వేదం కావాలి తమ నిర్ణయం ప్రకారమే అందరూ బ్రతకాలి అనుకుంటారు. అలాంటి ఇంట్లో మీరు స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెడితే మీరు మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే అది వారి అహంకారానికి పెద్ద దెబ్బలా అనిపిస్తుంది.
(05:50) మీరు వారి చెప్పు చేతల్లో లేరనే ఒకే ఒక కారణంతో వారు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. మిమ్మల్ని మానసికంగా కృంగదీసి మళ్ళీ వారి కాళ్ళ దగ్గరకు తీసుకురావాలని చూస్తారు. ఇలాంటి మనుషుల మధ్య మీరు బ్రతుకుతున్నప్పుడు కేవలం సెంటిమెంట్ తో ఆలోచిస్తే మీరు జీవితాంతం ఓడిపోతూనే ఉంటారు. అయితే సొంతవాళ్లే శత్రువులుగా మారినప్పుడు చాలామంది చేసే ఒక పెద్ద చారిత్రక తప్పు ఉంటుంది.
(06:19) అదేమిటంటే ఓపెన్ బుక్ లాగా బ్రతకడం. వీళ్ళు నావాళ్లే కదా అని తమ జీవితంలోని ప్రతి చిన్న రహస్యాన్ని ప్రతి కష్టాన్ని ఆర్థిక ఇబ్బందులను భార్యా భర్తల మధ్య ఉన్న గొడవలను తమ భయాలను బలహీనతలను ఎలాంటి ఫిల్టర్ లేకుండా సొంతవాళ్ళ ముందు కక్కేస్తుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి మీ రహస్యాలను ఒకరి ముందు బయట పెట్టడం అంటే మిమ్మల్ని సర్వనాశనం చేసే తుపాకీని వాళ్ళ చేతిలో పెట్టి నీరే ట్రిగర్ లాగమని చెప్పడంతో సమానం.
(06:53) ఒక కోటను బయట నుంచి ఎంతమంది శత్రువులు దండెత్తినా కూల్చలేరు. కానీ లోపల ఉన్న ఒక్కడు తలుపులు తెరిస్తే ఆ కోట సర్వనాశనం అవుతుంది. కుటుంబ సభ్యులను నమ్మడం తప్పు కాదు కానీ గుడ్డిగా మన ప్రాణ రహస్యాలను వాళ్ళ చేతిలో పెట్టడం అతి పెద్ద మూర్ఖత్వం. ఈరోజు మీ మీద ప్రేమగా ఉన్న వ్యక్తి రేపు మీ మీద ద్వేషం పెంచుకున్నప్పుడు మీరు ఏడుస్తూ వారికి చెప్పిన మీ బలహీనతలనే వారు మీ మీద ఆయుధాలుగా ప్రయోగిస్తారు.
(07:24) సమాజం ముందు మీ పరువు తీయడానికి అవే రహస్యాలను వాడుకుంటారు. మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. అందుకే పెద్దలు చెప్తారు హృదయంలో కొన్ని కదులు ఎవరికీ తెరవకూడదు అని మీ ఆర్థిక పరిస్థితి మీ భవిష్యత్తు ప్రణాళికలు మీ వ్యక్తిగత భయాలు ఎప్పుడూ మీ లోపలే ఒక సురక్షితమైన ప్రదేశంలో దాగి ఉండాలి. ఇక మరో ప్రమాదకరమైన వలయం గురించి మాట్లాడుకోవాలి.
(07:52) అదే బంధం అనే మత్తు చాలామంది ఇక్కడే బురిడీ కొడుతుంటారు. వాళ్ళు మనకు ఎంత ద్రోహం చేసినా ఎంత అన్యాయం చేసినా మనల్ని రోడ్డు మీదకు లాగినా సరే పోనీలే నా రక్తం కదా నా తోడ పుట్టిన వాడు కదా కొన్నాళ్ళకి వాడే మారుతాడులే అని వాళ్ళు చేసే ప్రతి తప్పును కప్పి పుచ్చుతుంటారు. కానీ ఒక నిజం తెలుసుకోండి తప్పును సహించడం అంటే ఆ తప్పుకు మీరు కూడా భాగస్వామ్యం వహించడమే ఒక పాముకు మీరు పాలు పోసినంత మాత్రాన అది మీ మీద ప్రేమను పెంచుకోదు.
(08:29) దానికి అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా కాటు వేస్తుంది. ఎందుకంటే కాటు వేయడం దాని నైజం అలాగే స్వార్థంతో నిండిపోయిన బంధువులను మీరు ఎంత ప్రేమతో దగ్గరకు తీసినా వారు మళ్ళీ మళ్ళీ మీకు వెన్నుపోటు పడుస్తూనే ఉంటారు. ఎందుకంటే వారి తప్పులను మీరు క్షమిస్తున్నారు అనే ధైర్యం వారికి ఒక అహంకారాన్ని ఇస్తుంది. నన్ను అడిగేవారు లేరు.
(08:59) నేను ఏం చేసినా వీడు భరిస్తాడు అనే చులకన భావం వారికి ఏర్పడుతుంది. బంధం పేరుతో అన్యాయాన్ని భరించడం ఎప్పటికీ ధర్మం అనిపించుకోదు. మీ ఆత్మగౌరవాన్ని చంపుకుని 10 మందిని మెప్పించడం కంటే నిజాయితీగా మీకు మీరు సమాధానం చెప్పుకుంటూ బ్రతకడం చాలా ముఖ్యం. మరి ఇలాంటి విషపూరితమైన కుటుంబ సభ్యులను ఎదుర్కోవడం ఎలా వాళ్ళు ఆడే మైండ్ గేమ్స్ నుంచి బయట పడడం ఎలా దీనికి ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం మీ [సంగీతం] భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం ఇంగ్లీష్లో దీన్నే ఎమోషనల్ డిటాచ్మెంట్ అంటారు.
(09:37) ఎవరైనా మిమ్మల్ని కావాలని బాధ పెడుతున్నప్పుడు మీరు ఏడ్చినా మీరు వాళ్ళతో గొడవ పడినా వాళ్లే గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది కూడా అదే మిమ్మల్ని మానసికంగా డిస్టర్బ్ చేయడమే వారి లక్ష్యం. మీరు వారి మీద అరిస్తే మీకే కోపం ఎక్కువ అని సమాజానికి చూపిస్తారు. మీరు ఏడిస్తే మీరే బలహీనులు బలహీనులు అని ప్రచారం చేస్తారు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని రచ్చగొట్టినప్పుడు మీరు ఇవ్వాల్సిన ఏకైక సమాధానం నిశశబ్దం.
(10:14) మీరు మౌనంగా స్థిరంగా ముఖంలో ఎలాంటి ఎమోషన్ లేకుండా ఒక రాతి శిల్పంలా నిలబడితే శత్రువుకు ఏం చేయాలో అర్థం కాదు. మీ మౌనం వారిని భయపెడుతుంది. మీ ప్రశాంతత వారి వ్యూహాలను పటాపంచలు చేస్తుంది. మీరు ఒక సముద్రం లాగా మారాలి. సముద్రం పైన ఎన్నో అలలు తుఫాన్లు వస్తుంటాయి. కానీ సముద్రం అట్టడుగున ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. మీ మనసు కూడా అలాగే ఉండాలి.
(10:45) బయట వాళ్ళు విసిరే రాళ్ళు మీ హృదయం లోపలికి వెళ్ళకూడదు. ఎవరైతే తన బాధను తన కోపాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడో వాడిని ఓడించడం ఈ భూమి మీద ఎవరి తరము కాదు. చివరిగా జీవితంలో అత్యంత కఠినమైన కానీ అత్యంత అవసరమైన ఒక అడుగు వేయాల్సి ఉంటుంది. అదేమిటంటే ఎక్కడ మీ ఆత్మగౌరవం మంటగలుస్తుందో ఎక్కడ మీ ప్రతిభకు గుర్తింపు లేదో ఎక్కడ మీ ప్రాణాలకు మీ మనశశాంతికి ముప్పు ఉందో అక్కడి నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవడం.
(11:22) చాలామంది బంధువులు ఏమనుకుంటారు? సమాజం నన్ను తప్పుపడుతుందేమో అన్న భయంతో రోజు నరకం అనుభవిస్తూ కూడా ఆ విషపూరితమైన వాతావరణంలోనే బ్రతుకుతూ ఉంటారు. కానీ మీ జీవితాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులకు దూరంగా వెళ్ళడం పిరికితనం కాదు. అది మీ జీవితం పట్ల మీరు తీసుకునే అత్యుత్తమ నిర్ణయం. ఒక ఇల్లు తగలబడుతున్నప్పుడు అందులో కూర్చుని నా ఇల్లు కదా అని కాలిపోరు.
(11:52) ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీస్తారు. అలాగే బంధాలు కాలిపోతున్నప్పుడు కూడా అక్కడి నుంచి బయట పడటమే నిజమైన తెలివితేటలు. దూరంగా వెళ్ళడం అంటే వాళ్ళ మీద పగతీర్చుకోవటం కాదు రోజు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం కాదు. దూరం అంటే భౌతికంగా మానసికంగా వారితో సంబంధాలు తెంచుకోవటం. మీ ఫోన్ కాల్స్ తగ్గాలి. మీ కలైకలు ఆగిపోవాలి.
(12:23) మీ ప్రపంచంలోకి వారు రాలేనంత ఎత్తుకు మీరు ఎదగాలి. మీ విజయం వాళ్ళ చెవుల్లో మారుమోగాలి కానీ మీ జాడ వాళ్ళకు దొరకకూడదు. అదే మీరు వాళ్ళకఇచ్చే అతి పెద్ద శిక్ష. గుర్తుంచుకోండి మిత్రులారా మన జీవితం చాలా చిన్నది. ఇందులో ఏడుస్తూ కూర్చోవటానికి ఎవరో కుట్రలు చేస్తున్నారని కుమిలిపోవటానికి సమయం లేదు. మిమ్మల్ని అర్థం చేసుకొని వారి కోసం మీ కన్నీళ్లు వృధా చేయకండి.
(12:55) మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. ఒక అడుగు వెనక్కి వేసినా సరే 10 అడుగులు ముందుకు దూకడానికి సిద్ధంగా ఉండండి. నీ విజయమే మీకు జరిగిన ప్రతి అవమానానికి సరైన సమాధానం కావాలి.
No comments:
Post a Comment