విజ్ఞానమిత్ర
1 day ago
🕊️🦅 *కళ్ళకు కనిపించేది సత్యమా? పరమాత్మ సంకల్పం సత్యమా?* 🪶
ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడితో కలసి వెళ్తూ చెట్టుపై ఉన్న పక్షిని చూపించి:
"అర్జునా! అది పావురమా?" అన్నాడు.
"అవును కృష్ణా, పావురమే" అన్నాడు అర్జునుడు.
"కాదు, అది డేగలా ఉందే?" అన్నాడు కృష్ణుడు.
"అవును, డేగే" అన్నాడు అర్జునుడు.
"కాదు కాదు, కాకిలా కనిపిస్తోంది!" అన్నాడు మళ్లీ కృష్ణుడు.
"నిజమే, అది కాకే!" అని బదులిచ్చాడు అర్జునుడు.
అప్పుడు కృష్ణుడు నవ్వి—"నీకు స్వతంత్ర ఆలోచన లేదా? నేను చెప్పిన ప్రతిదానికీ సరేనంటున్నావెందుకు?" అని అడిగాడు.
అందుకు అర్జునుడు చెప్పిన అద్భుత సమాధానం:
"కృష్ణా! నా కళ్ళకు కనిపించే నిదర్శనం కంటే నీ మాటలే నాకు ప్రమాణం. నీ సంకల్పంతో దేనినైనా క్షణాల్లో మార్చగలవు. నువ్వు పావురం అంటే అది ఆ క్షణంలో పావురమై తీరుతుంది!"
🌿 భగవద్గీత సందేశం (15.1):
ఊర్ధ్వమూలమధఃశాఖ
అశ్వత్థం ప్రాహురవ్యయమ్
ఛందాంసి యస్య పర్ణాని
యస్తం వేద స వేదవిత్
పైకి కనిపించే కొమ్మల వంటి ఈ భౌతిక సృష్టి ఎప్పటికప్పుడు రూపాలు మారే మాయ. కానీ దీనికి మూలమైనవాడు ఆ పరమాత్ముడే. కంటికి కనిపించే మాయను కాకుండా, సృష్టికి మూలమైన *భగవంతుని సంకల్పాన్ని పరిపూర్ణంగా నమ్మడమే నిజమైన శరణాగతి, నిజమైన జ్ఞానం!*
No comments:
Post a Comment