ఓం నమో భగవతే శ్రీ రమణాయ
శరీరంతో తాదాత్మ్యం చెంది 'ఈ శరీరమే నేను' అనుకునేవాడు తనని తాను చంపుకుంటున్నట్లే. 'నేను ఆత్మను' అనుకునేవాడే మహా ధన్యుడు.
సూర్యకాంతితో చీకటి మాయమయినట్లు 'నేను ఆత్మను' అనే ధ్యానం సంచిత కర్మనంతా దగ్ధం చేస్తుంది. ఇక కర్మఫలం ఎలా మిగులుతుంది?
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ప్రశ్న :
భగవాన్! ప్రపంచంలో ఇంత దుఃఖాన్ని దైవము ఎందుకు అనుమతించింది? దైవము సర్వశక్తిమంతము కదా! దైవము ఒక్క వేటులో సర్వదుఃఖాలను నశింపచేసి ఎల్లరకూ ఆత్మశాంతిని ఎందుకు ఇవ్వకూడదు?
మహర్షి :
ఆత్మశాంతికి మార్గము, ఆర్తి(వ్యాకులత).
ప్రశ్న :
మరోవిధంగా మార్గం లేదా!
మహర్షి :
వ్యాకులతయే దానికి మార్గము.
ప్రశ్న :
భగవాన్! దైవం నాకెందుకు కనపడడు?
మహర్షి :
కనపడితే దైవానికి నువ్వు మనశ్శాంతి లేకుండా చేస్తావు! నువ్వంటే దైవానికి భయం! నీ కళ్ళకి కనపడ్డాడంటే నీ కోరికల చిట్టా విప్పుతావు! వదలిపెట్టవని ఆయనకి తెలుసు. అందుకే కనపడడు.
No comments:
Post a Comment