Tuesday, September 29, 2026

Marcus Aurelius & Epictetus Guide: How to Stop Caring About Things You Can't Control| Nagna Satyam

Marcus Aurelius & Epictetus Guide: How to Stop Caring About Things You Can't Control| Nagna Satyam

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8C70i0Z3dFM





Title: Marcus Aurelius & Epictetus Guide: How to Stop Caring About Things You Can't Control| Nagna Satyam

Author Name: Nagna Satyam

Description: Are you constantly stressed, anxious, or letting outside situations ruin your day? In this video, we break down ancient Stoic philosophy from Marcus Aurelius and Epictetus to help you build unbreakable mental toughness, detach from outcomes outside your control, and find genuine life fulfillment.

Most people believe happiness comes from luxury and cheap pleasure (Hedonism). But science and philosophy prove this only traps you on the Hedonic Treadmill. Real peace comes from Eudaimonia (human flourishing) and understanding the Dichotomy of Control: knowing what is yours to control, and completely letting go of the rest.

The Hedonism Trap: Why modern dopamine, luxury, and material chasing always lead to emptiness.

Hedonic Treadmill Explained: The psychology of why new phones, cars, and higher salaries never permanently satisfy you.

Aristotle’s Eudaimonia: Why meaningful struggle and effort create true fulfillment over instant gratification.

Epictetus & The Dichotomy of Control: How to reclaim your mental remote control and stop reacting to external chaos.

Friedrich Nietzsche’s "Will to Power": Why human consciousness needs challenge, purpose, and resistance to stay alive.

References:
Meditations by Marcus Aurelius

Enchiridion (Discourses) by Epictetus

Nicomachean Ethics by Aristotle

Thus Spoke Zarathustra by Friedrich Nietzsche#Stoicism #MarcusAurelius #Epictetus #MentalPeace #Philosophy #Psychology #SelfImprovement #Eudaimonia #mindset

Transcript:
(00:04) మనిషికి హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికిరెండున్నర వేల ఏళ్ల క్రితం ఏథెన్స్ నడి వీధుల్లో అరిస్టాటిల్ సాక్రటీస్ నుంచి మొదలు పెడితే మొన్నటి నీషే దాకా ఫిలాసఫర్లు తమ జీవితాలను తగలేసుకున్నారు. పుస్తకాలు రాశారు సిద్ధాంతాలు దంచారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు రాసిన ఆ లైబ్రరీల కొద్ది ఫిలాసఫీని పక్కన పెట్టి ఈరోజు మనం బతుకుతున్న తీరును చూస్తే మనిషి ఆనందం విషయంలో ఎంత కుళ్లిన సెవన్లా బతుకుతున్నాడో తెలుస్తుంది.
(00:39) మనం ఈ హ్యాపీనెస్ అనే పదాన్ని మార్కెట్ లో దొరికే ఒక సరుకుగా మార్చేసాం. ఎలా అంటే నువ్వు ఇంకా హ్యాపీగా లేవు ఎందుకంటే నీ దగ్గర ఫలానా వస్తువు లేదు ఫలానా ఉద్యోగం లేదు ఫలానా బ్రాండ్ లేదు అని గుర్తు చేస్తూనే ఉంటారు. మనిషి చరిత్రలో సంతోషాన్ని రెండు భాగాలుగా చీల్చారు. ఒకటి హిడోనిజం రెండవది యుడైమోనియా. ఈ రెండు పదాల మధ్య ఉన్న తేడాను ఎవడైతే అర్థం చేసుకోలేదో వాడు జీవితాంతం ఒక ఎలుకలా బోనులో తిరిగే చక్రం మీదే పరిగెడుతూ చస్తాడు తప్ప వాడికి అసలైన జీవితం అంటే ఏంటో తెలీదు.
(01:17) మొదట హీడోనిజం గురించి మాట్లాడుకుంటాం. ఇది చాలా సింపుల్ ఎపిక్యూరస్ అరిస్టిపస్ లాంటి గ్రీకు ఫిలాసఫర్లు దీని గురించి మాట్లాడారు. దీని అర్థం ఏంటంటే సుఖాన్ని పెంచుకోవడం నొప్పిని తగ్గించుకోవడం ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్లి ఖరీదైన బిర్యానీ తింటావు. పడక గదిలో సుఖాన్ని వెతుక్కుంటావు. ఒక వీకెండ్ పబ్బుకు వెళ్లి మద్యం తరుగుతావు లేదా మాల్ కి వెళ్లి కొత్త బట్టలు కొంటావ్.
(01:41) ఇవన్నీ జరిగిన ఆ క్షణంలో నీ బ్రెయిన్ లో డోపమైన్ అనే ఒక కెమికల్ బ్లాస్ట్ అవుతుంది. ఆ క్షణం నువ్వు ఆహా నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటావ్. కానీ ఆ సుఖానికి ఉన్న శాపం ఏంటో తెలుసా అలవాటు పడడం దీన్నే సైకాలజీలో హిడానిక్ ట్రెడ్మిల్ అంటారు. నువ్వు మొదటిసారి కొత్త ఫోన్ చేతిలోకి తీసుకున్నప్పుడు నీ గుండె ఎంత వేగంగా కొట్టుకుందో రెండో వారం అదే ఫోన్ వైపు చూసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఉండదు.
(02:07) నువ్వు మొదటిసారి కారు కొన్నప్పుడు నీ ఒంట్లో పాకిన ఆ త్రిల్ ఆరో నెల ఆ కారుని డ్రైవ్ చేస్తున్నప్పుడు రాదు. అంటే శరీరానికి ఇంద్రియాలకు ఇచ్చే ప్రతి సుఖము ఒక నిర్దిష్ట సమయం తర్వాత చచ్చిపోతుంది. అది సాధారణం అయిపోతుంది. అప్పుడు నీ మెదడు అంతకంటే పెద్ద డోస్ కోసం డిమాండ్ చేస్తుంది. ఒకప్పుడు 10వేల జీతంతో బతికినప్పుడు లక్ష రూపాయలు వస్తే స్వర్గం అనుకున్నావు.
(02:34) తీరా లక్ష రాగానే నీ లైఫ్ స్టైల్ మారిపోయింది. ఆ లక్ష సరిపోవడం లేదు ఇప్పుడు నీకుమూడు లక్షలు కావాలి. సో ఇది హ్యాపీనెస్ కాదు. ఒక డ్రగ్ అడిక్ట్ మొదటిసారి గంజాయి తాగినప్పుడు వచ్చిన మత్తు రెండోసారి రాక డ్రగ్ మోతాదు పెంచుకుంటూ తన నరాలను నాశనం చేసుకుంటున్నాడో ప్రెసెంట్ మనిషి కూడా మెటీరియలిస్టిక్ సుఖాల డోస్ పెంచుకుంటూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
(02:56) సుఖాన్ని వెంబడించే ప్రతి మనిషి చివరికి శూన్యంలోకే చేరుకుంటాడు. ఎందుకంటే శరీరానికి ఇచ్చే సుఖాలన్నీ టెంపరరీనే. ఆకలి తీరగానే తిండి మీద అసహ్యం వేస్తుంది. కోరిక తీరగానే శరీరం మీద విరక్తి పుడుతుంది. మరి ఆ తర్వాత మిగిలేదేంటి? అదే ఆ భయంకరమైన బోర్డం. అదే ఆ అంతర్గత శూన్యత. అందుకే అరిస్టాటిల్ వచ్చి ఈ హీడానిజం ని నేలకేసి కొట్టి కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చాడు.
(03:28) అదే యుడైమోనియా దీనికి డైరెక్ట్ తెలుగు పదం లేదు కానీ చెప్పాలంటే హ్యూమన్ ఫ్లరిషింగ్ లేదా తన సొంత సామర్థ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడం అరిస్టాటిల్ ఏమంటాడంటే సంతోషం అనేది నువ్వు ఫీల్ అయ్యే ఒక ఎమోషన్ కాదు అది నువ్వు బ్రతికే ఒక జీవన విధానం ఫర్ ఎగ్జాంపుల్ పెయింటర్ ఉన్నాడు వాడు ఒక గొప్ప చిత్రాన్ని గీయాలనుకుంటున్నాడు. వాడు రాత్రంతా నిద్రపోడు వాడి కళ్ళు మండుతాయి వీపు నొప్పి పుడుతుంది.
(03:54) సరిగ్గా తిండి ఉండదు. వాడు ఎండిపోయిన రొట్టె ముక్క తింటూ ఆ కాన్వాస్ మీద రంగులు దిద్దుతుంటాడు. ఆ సమయంలో వాడి శరీరానికి ఏమైనా సుఖం ఉందా అంటే లేదు కానీ ఆ బొమ్మ పూర్తయ్యి దాన్ని చూసి వాడు లోపల ఒక నిట్టూర్పు విడుస్తాడు చూడు ఆ క్షణంలో వాడి గుండెలు పుట్టే ఆ తృప్తి ముందు ప్రపంచంలో ఏ బిలియనీర్ సంపద అయినా నిలబడగలదా చస్తే నిలబడదు.
(04:18) అంటే మనిషికి హ్యాపీగా ఉండాలంటే సుఖం అక్కర్లేదు మనిషికి కావాల్సింది అర్థవంతమైన శ్రమ అర్థవంతమైన నొప్పి నువ్వు పడుకున్న సోఫాలో ఆనందం ఉండదు నువ్వు వ్యాయామశాలలో బరువులఎత్తుతూ కండాను చిట్లుతుంటే చెమట కారుతుంటే అనుభవించే ఆ అలసటలో ఆనందం ఉంటుంది. ఒక కష్టమైన కోడింగ్ ప్రాబ్లం ని గంటల తరబడి సాల్వ్ చేయలేక తల బాదుకొని చివరికి అది రన్ అయిన క్షణంలో ఆనందం ఉంటుంది.
(04:44) ఎందుకంటే అక్కడ మనిషి తన పరిమితులను తాను దాటుతున్నాడు. తనను తాను ఒక సృష్టికర్తగా చూసుకుంటున్నాడు. ఇక్కడే మార్కస్ అరేలియస్, ఎపిక్టేటస్ లాంటి స్టోయిక్ తత్వవేత్తల ఆలోచనలు మన చెంప పగలగొడతాయి. వాళ్ళు ఏమన్నారంటే మనిషి అసంతృప్తికి కారణం బయటి ప్రపంచం కాదు. బయటి ప్రపంచాన్ని చూసి వాడు తన మనసులో నిర్మించుకునే ఊహాజన్యత కథలు అని అంటే నీకు ఒక ప్రమోషన్ రాలేదు.
(05:10) అది కేవలం ఒక సంఘటన మాత్రమే కానీ నీ మెదడు ఏం చేస్తుంది నాకు ప్రమోషన్ రాలేదు నా జీవితం వ్యర్థం సమాజం నన్ను చూసి నవ్వుతోంది. నేను దేనికి పనికి రాను అని ఒక పెద్ద శోక సముద్రపు కథ నల్లుతుంది. ఆ కథ నిన్ను చంపేస్తుంది. ఎపిక్టేటస్ చాలా స్పష్టంగా చెప్పాడు. నీ నియంత్రణలో ఏముందో నీ నియంత్రణలో ఏది లేదో వేరు చేసి చూడు అని ఎదుటివాడు నిన్ను పొగడటం నీ చేతుల్లో లేదు.
(05:35) ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడం నీ చేతుల్లో లేదు. కరోనా లాంటి వైరస్ రాకుండా ఉండడం నీ చేతుల్లో లేదు. నీ చేతుల్లో లేని విషయాల గురించి నువ్వు ఆందోళన చెందితే నువ్వు ప్రపంచానికి పెంపుడు కుక్కలా మారిపోతావు. ఎవడో వచ్చి ఒక బిస్కెట్ వేస్తే తోక ఊపుతావు. వాడు రాయి విసిరితే మూలుగుతావు. నీ భావోద్వేగాల రిమోట్ కంట్రోల్ ని ఇంకొకడి చేతిలో పెట్టి నేను ప్రశాంతంగా ఉండాలి అనుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి ఉంటుందా చెప్పు నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే ఆ సంఘటన పట్ల నీ స్పందన నీ ఆలోచన నీ నడవడిక నీ ధైర్యం ఎవడైతే తన కంట్రోల్ లో లేని దాన్ని పూర్తిగా వదిలేసి తన కంట్రోల్ లో ఉన్న
(06:11) దాని మీద మాత్రమే దృష్టి పెడతాడో వాడిని ఈ విశ్వంలో ఏ శక్తి కదిలించలేదు. ఆ స్థితిలోనే మనిషికి అసలైన స్వేచ్ఛ దొరుకుతుంది. ఇక చూస్తే నీషే దీనికి ఏమన్నాడంటే మనిషి ఎప్పుడూ ఆనందం కోసం పాకులాడడు ఆ పని చేసేది కేవలం పెంపుడు జంతువులు మాత్రమే మనిషికి నిజంగా కావాల్సింది విల్ టు పవర్ అంటే తన అస్తిత్వాన్ని తన బలాన్ని నిరూపించుకునే అవకాశం అని ఇక్కడ మనిషి ఎప్పుడు కుంగిపోతాడో తెలుసా డబ్బు లేనప్పుడు కాదు తిండి లేనప్పుడు కాదు తను నిస్సహాయుడిగా మిగిలిపోయానని తెలిసినప్పుడు ఇంకొకడి దయా దాక్షిణ్యాల మీద బతకాల్సి వచ్చినప్పుడు మనిషి జన్మతః ఒక పోరాట యోధుడు వాడి నరాలలో
(06:54) వేల ఏళ్ల వేటగాళ్ళ రక్తం ప్రవహిస్తుంది. వాడికి ఒక ఎనిమీ కావాలి ఒక పర్వతం ఎక్కడానికి కావాలి ఒక సవాలు కావాలి ఎదుర్కోవడానికి ఒకవేళ నువ్వు వాడికి అన్ని సౌకర్యాలు ఇచ్చి రోజు మూడు పూటల బిర్యానీ పెట్టి ఏ పని లేకుండా ఏసీ రూమ్లో కూర్చోబెడితే వాడు ఆరు నెలల్లో పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే ఘర్షణ లేని చోట మనిషి చైతన్యం కుళ్లిపోతుంది.
(07:18) మనిషిని బ్రతికించేది సంతోషం కాదు ఆ గమ్యం వైపు నడిచేటప్పుడు కాళ్ళకు తగిలే రాళ్లుు రప్పలు ఆ ఒరిపిడి ఆ సంకల్పం మరి మనిషికి హ్యాపీగా ఉండాలంటే నిజంగా ఏం కావాలి? స్వేచ్ఛగా ఏది ఆశించకుండా నా చిన్న పనిని మందికి 200 పెట్టు పని చేయడమే. అందులోనే అన్ని అంటే బాధ కష్టం నొప్పి కసి అన్ని కలిసి పుట్టేదే ఈ ఆనందం ఆ ఆనందం స్వచ్ఛమైనదిగా ఉంటుంది.
(07:48) అంతేగాని తాగితేనే ఆనందం ప్రేమిస్తేనే ఆనందం అనుకొని బతికితే పిచ్చోడు నాకు పిచ్చి లేదు అన్నట్టు ఉంటుంది.

No comments:

Post a Comment