Saturday, September 26, 2026




Home
Shorts
You

PRATIKULA VEDAM
57 minutes ago (edited)
🔴రాజకీయాల్లో ఎప్పటికీ మారని ఒక Basic Rule ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే "ప్రజాధనం దుర్వినియోగం" అని గొంతు చించుకుంటారో, అధికారంలోకి రాగానే అదే పని "ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం" అనే ముసుగులో గొప్ప పాలసీ అయిపోతుంది. AP ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త Social Media Influencers Policy సరిగ్గా అలాంటిదే.

🟠ఒక ఆశ్రమంలో ఒక పాత మాస్టర్ ఉండేవాడు. ఆయన ఆశ్రమానికి వచ్చే విరాళాలను కేవలం తన మాట వినే శిష్యులకు మాత్రమే పంచుతూ, వాళ్ల చేత తన గొప్పదనాన్ని పొగిడించుకునేవాడు. అది చూసిన ఒక యువ సన్యాసి తీవ్రంగా రగిలిపోయాడు. "ఇది ఆశ్రమ నిధుల దుర్వినియోగం! గురువు గారు స్వార్థంతో ధర్మాన్ని నాశనం చేస్తున్నారు" అని ఊరంతా ప్రచారం చేశాడు.

జనాలంతా ఆ యువ సన్యాసి నిజాయితీకి, ఆవేశానికి ముగ్ధులయ్యారు. పాత మాస్టర్‌ను గద్దె దించి, ఆ యువ సన్యాసిని కొత్త గురువుగా ఆ కుర్చీలో కూర్చోబెట్టారు.

కొన్ని నెలలు గడిచాయి. కొత్త మాస్టర్ కూడా ఆశ్రమ నిధులను తీసి, తనకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళకి "ధర్మ ప్రచారకులు" అని ఒక కొత్త పేరు పెట్టి, వాళ్ళకి జీతాలుగా ఇవ్వడం మొదలుపెట్టాడు.

ఇది గమనించిన ఒక పాత భక్తుడు వెళ్లి, "అదేంటి మాస్టర్? పాత గురువు గారు చేసిన తప్పునే మీరూ చేస్తున్నారు కదా? అప్పట్లో ఆయన చేస్తే తప్పు పట్టారు, ఇప్పుడు మీరే ఆ పని చేస్తున్నారు?" అని సూటిగా అడిగాడు.

దానికి ఆ కొత్త మాస్టర్ చాలా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని, "పిచ్చి వాడా, ఆయన తన అహంకారం కోసం, స్వార్థం కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. నేను ఆశ్రమ పవిత్రతను, ధర్మాన్ని రక్షించడం కోసం ఇస్తున్నాను. ఆయనది అవినీతి, నాది పవిత్ర కార్యం. రెండిటికీ చాలా తేడా ఉంది" అని బదులిచ్చాడు.

ఈ కథలో ఉన్న అసలు వేదాంతం ఏంటంటే, ఎదుటివాడు చేస్తే అది తప్పు, మనం చేస్తే అది strategy. మనుషుల ego ఎంత తెలివైనది అంటే, తాను చేసే ప్రతి స్వార్థపూరిత పనికీ ఒక అందమైన moral justification వెతుక్కుంటుంది.

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నది అక్షరాలా ఇదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు "అది public money దుర్వినియోగం" అని గొంతు చించుకుంటారు. అధికారంలోకి రాగానే, దానికి "public awareness" అని ఒక ముద్దు పేరు పెడతారు.

🔵ఒక Influencer అంటే నిష్పాక్షికంగా మాట్లాడాలి. కానీ నెలకు ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు తీసుకునే ఏ Youtuber లేదా Twitter account అయినా ప్రభుత్వాన్ని నిలదీస్తుందా? కచ్చితంగా లేదు. వాళ్ళు కేవలం Paid PR ఏజెంట్లుగా మారిపోతారు. ప్రభుత్వంలో ఉండే బొక్కల్ని ప్రశ్నిస్తే, వాళ్ళ పాత పోస్టులను కూడా ఆడిట్ చేస్తాం, నిబంధనలు ఉల్లంఘిస్తే black list చేస్తాం అంటున్నారు. ఇలా అనడంలో అసలు అర్థం ఏంటంటే.. "మేము చెప్పినట్లే వినాలి, మాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాకూడదు."

🟢అసలు ఈ Digital Campaign Trend 2018లో అప్పటి TDP ప్రభుత్వమే 'AP Content Corporation' పేరుతో మొదలుపెట్టింది. 2019లో అధికారంలోకి వచ్చిన YSRCP దాన్ని 'APDC' గా పేరు మార్చి, భారీ బడ్జెట్‌తో తమకు అనుకూలంగా వాడుకుంది. ఇప్పుడు 2024లో TDP మళ్లీ పాత formatను కొత్త packaging లో తీసుకొచ్చింది.

Overallగా చెప్పాలంటే, ఇది పాత సీసాలో కొత్త సారా కూడా కాదు.. అచ్చంగా పాత సారానే. కాకపోతే లేబుల్ మారింది, బ్రాండ్ అంబాసిడర్లు మారారు. ప్రజల tax డబ్బులతో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తమ సోషల్ మీడియా ఆర్మీని పోషించుకోవడానికి లీగల్‌గా వాడుకుంటున్న ఒక loop hole ఇది. రాజకీయం అనేది కేవలం అధికారాన్ని నిలబెట్టుకునే ఒక Survival game. So అందులో విలువలు, నీతులు వెతకడం మన అమాయకత్వమే అవుతుంది.

-PRATIKULA VEDAM
12


 http://youtube.com/post/UgkxVIF7R8ae9VxL2AKmQZ90D9l_kfEtPlCW?si=4weT4LbdOdzS5seD

No comments:

Post a Comment