పొరలు కమ్మిన మనసులో
తెరలు తీసేదేవ్వరు?
మరగ మారిన మదిలో
మమత నిండేదెన్నడు?
మరలి రాని కాలాన్ని
ఒడిసి పట్టేదెవ్వరు?
మరపు రాని తలపులు
మాసిపోయేదెన్నడు?
కనుల కురిసే నీటిలోన
కలువలు విరిసేనా?
కలత నిండిన ఎడదలో
కన్న కలలు పండేనా?
మారిన దారులలో
మనశ్శాంతి దొరికేనా?
కోరిన స్వాతంత్రంతో
కొరతలు తీరేనా?
మాట నచ్చక మౌనం
మనసు నచ్చక దూరమా
మార్పుతో మనుగడ
మధురం చేసుకోరా!
పెంచుకుంటే పెరిగేది
తుంచుకుంటే తరిగేదే
ప్రేమైనా.. కోపమైనా
బంధాలకు విలువే లేదా?
అహాలను పోషిస్తే
ఇహంలో సుఖమేది?
చీకటిని తరిమేసే
వెలుతురేగా వేకువంటే!
☘️🌼🌹☘️🌼🌹☘️
బృంద 🙏
No comments:
Post a Comment