మనుషులు ఎందుకు ప్రేమిస్తారు? బృహదారణ్యకోపనిషత్తు చెప్పిన రహస్యం | Brihadaranyaka Upanishad
Author Name:Ajagava
Youtube Channel Url:https://www.youtube.com/@Ajagava
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Bq9iHnn7kQs
Title: మనుషులు ఎందుకు ప్రేమిస్తారు? బృహదారణ్యకోపనిషత్తు చెప్పిన రహస్యం | Brihadaranyaka Upanishad
Author Name: Ajagava
Description: అజగవ సాహితీ ఛానల్ కు స్వాగతం. అసలు ఈ లోకంలో ఎవరైనా ఇంకొకరిని ఎందుకు ప్రేమిస్తారు? అలా ప్రేమించడం వల్ల ఆనందం కలిగేది ఎవరికి? ప్రేమించే వారికా? లేక ప్రేమించబడేవారికా? ప్రేమ అంటే నిస్వార్థమైందా? లేక అందులో కూడా స్వార్థముంటుందా? మొదలైన ప్రశ్నలకు సమాధానాలను బృహదారణ్యకోపనిషత్తు చెబుతుంది.
ఈ బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయం నాలుగు, ఐదు బ్రాహ్మణాలలో యాజ్ఞవల్క్యుడు, మైత్రేయీల సంవాదం ఉంది. ఆ సంవాదంలోనే పై ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.
యాజ్ఞవల్క్యుడు ఒక మహర్షి. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒకరు కాత్యాయని, రెండవ వారు మైత్రేయి. ఆ మహర్షి గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసాశ్రమానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు.
దానితో తన ఇద్దరు భార్యలను పిలిచి, ఆస్తిని పంచుతానన్నాడు. అప్పుడు మైత్రేయి.. “స్వామీ! ఈ భూమండలమంతా ధనంతో నిండిపోయి, ఆ ధనమంతా నాదైపోయిందనుకుందాం. అప్పుడు నేను మోక్షాన్ని పొందగలనా?” అని అడిగింది.
దానికి యాజ్ఞవల్క్యుడు.. “లేదు దేవీ.. ధనంతో నువ్వు సంపన్నమైన, సుఖవంతమైన జీవితాన్ని పొందగలవు కానీ.. మోక్షాన్ని మాత్రం పొందలేవు” అన్నాడు.
“అలాంటప్పుడు నాకు ఈ ధనాన్ని కాకుండా, మోక్షాన్ని పొందే మార్గాన్నే ఉపదేశించండి” అంది మైత్రేయి వినయంగా.
యాజ్ఞవల్క్యునకు సంతోషం కలిగింది. “సరే దేవి, నువ్వు కోరినట్లే మోక్షమార్గాన్ని చెబుతాను, శ్రద్ధగా ఆలకించు” అంటూ ఇలా ఉపదేశించాడు.
#brihadaranyaka #upanishads
Transcript:
(00:01) అజిగవ సాహితి ఛానల్ కు స్వాగతం. అసలు ఈ లోకంలో ఎవరైనా ఇంకొకరిని ఎందుకు ప్రేమిస్తారు అలా ప్రేమించడం వల్ల ఆనందం కలిగేది ఎవరికీ ప్రేమించే వారికా లేక ప్రేమించబడే వారికా ప్రేమ అంటే నిస్వార్థమైందా లేక అందులో కూడా స్వార్థం ఉంటుందా మొదలైన ప్రశ్నలకు సమాధానాలను బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతుంది. ఈ బృహదారణ్యక ఉపనిషత్తు రెండవ అధ్యాయం నాలుగు ఐదు బ్రాహ్మణాలలో యాజ్ఞవల్డు మైత్రేయుల సంవాదం ఉంది.
(00:34) ఆ సంవాదంలోనే పై ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. యాజ్ఞవల్చుడు ఒక మహర్షి ఆయనకు ఇద్దరు భార్యలు ఒకరు కాత్యాయిని రెండవ వారు మైత్రేయి ఆ మహర్షి గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసాశ్రమానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. దానితో తన ఇద్దరు భార్యలను పిలిచి ఆస్తిని పంచుతాను అన్నాడు. అప్పుడు మైత్రేయి స్వామి ఈ భూమండలం అంతా ధనంతో నిండిపోయి ఆ ధనమంతా నాదైపోయింది అనుకుందాం అప్పుడు నేను మోక్షాన్ని పొందగలనా అని అడిగింది.
(01:07) దానికి యాజ్ఞవల్డు లేదు దేవి ధనంతో నువ్వు సంపన్నమైన సుఖవంతమైన జీవితాన్ని పొందగలవు గానీ మోక్షాన్ని మాత్రం పొందలేవు అన్నాడు. అలాంటప్పుడు నాకు ఈ ధనాన్ని కాకుండా మోక్షాన్ని పొందే మార్గాన్నే ఉపదేశించండి అంది మైత్రేయి వినయంగా యాజ్ఞవల్చునకు సంతోషం కలిగింది. సరే దేవి నువ్వు కోరినట్లే మోక్ష మార్గాన్ని చెబుతాను శ్రద్ధగా ఆలకించు అంటూ ఇలా ఉపదేశించాడు.
(01:35) మైత్రేయి భార్య భర్తను ప్రేమిస్తుంది అంటే అది కేవలం అతడి ఆనందం కోసం మాత్రమే కాదు తాను ఆనందంగా ఉండడం కోసం అంటే తనలోని ఆత్మకు ఆనందం కలుగుతున్న కారణంగానే భార్యకు భర్త ప్రియమైన వాడు అవుతున్నాడు అదే ఆత్మానందం అలానే భర్త భార్యను ప్రేమిస్తున్నాడు అన్నా అందుకు కారణం ఆమెను ప్రేమించడం వల్ల తన ఆత్మకు ఆనందం కలుగుతోంది కాబట్టి అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారన్నా పిల్లలు తల్లిదండ్రులని ప్రేమిస్తున్నారన్నా అందుకు కారణం కూడా ఈ ఆత్మానందమే అంటే ఎవరిని ప్రేమించడం వల్ల తమ ఆత్మకు ఆనందం కలుగుతుందో వారినే మనుష్యులు
(02:15) ప్రేమిస్తారు. అలా మానవుడు ఏం చేసినా తన ఆత్మానందం కోసమే చేస్తాడు అందువల్ల ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఆత్మకే ఉందంటాడు యాజ్ఞవలక్యుడు ఎవరైనా మోక్షాన్ని పొందాలనుకుంటే ముందుగా ఈ ఆత్మ స్వరూపం ఎటువంటిదో తెలుసుకోవడానికి ప్రయత్నించాలంటాడు. ఇక్కడ యాజ్ఞవల్చుడు చెప్పింది గమనిస్తే మనకొక విషయం అర్థంవుతుంది.
(02:41) ఏ వ్యక్తి అయినా మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అంటే అలా ప్రేమించడం వల్ల ఆ ప్రేమించే వ్యక్తికి ఆనందం కలుగుతుంది అన్నమాట. స్వచ్ఛమైన ప్రేమ గురించి భవభూతి మహాకవి ఒక మాట చెబుతాడు. ఎవరు సుఖాన్ని అనుభవిస్తుంటే నీ దుఃఖం తొలగిపోయి నీకు కూడా సుఖభావన కలుగుతుందో అట్టి వారిపై నీకు ప్రేమ ఉందని అర్థం అంటాడు. అంటే ఒకరు సుఖిస్తుంటే తాను ఆనందించే స్థితికి ప్రేమ అని పేరు ఎంతో మంది తల్లిదండ్రులకు తమ పిల్లలపై ఇంతటి స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది.
(03:13) కానీ వారిని అంతల్లా ఎందుకు ప్రేమిస్తారు అంటే అలా ప్రేమించడం వల్ల తమకు ఆత్మానందం కలుగుతోంది కాబట్టి అంటే ఆత్మానందం అనేది కేవలం ఇంద్రియాలకు సంబంధించినదో భౌతికమైన విషయాలకు సంబంధించినదో కాదన్నమాట అది వాటికి మించినది కేవలం ప్రేమే కాదు దానం చేసినా త్యాగం చేసినా అందువల్ల మీకు ఆత్మానందం కలగకపోతే మీరు ఆ పని మనస్ఫూర్తిగా చేయలేరు.
(03:41) అంటే మనిషి దేని ఆనందం కోసం తాపత్రేయ పడతాడు అంటే తన ఆత్మానందం కోసం అంటే ఏ మనిషి జీవితంలో అయినా ఆత్మకు మించిన ప్రాధాన్యత దేనికి లేదన్నమాట అందుకే అటువంటి ఆత్మను గురించి తెలుసుకోవాలంటాడు యాజ్ఞవలిక్యుడు అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంటూ ఎవరికి వారికే సంబంధించినదా అని అనిపిస్తూ అందరిలోనూ అంతటన వ్యాపించి ఉన్న ఆ ఆత్మ గురించి ఎలా తెలుసుకోవాలి అన్న ప్రశ్నకు కూడా యాజ్ఞవల్క్యుడు మార్గాన్ని సూచించాడు.
(04:10) ఆత్మ స్వరూపం గురించి తెలుసుకోవడానికి ముందుగా గురువుల్ని ఆశ్రయించాలి వారు చేసే బోధలను శ్రద్ధగా విని ఆకలింపు చేసుకోవాలి. కేవలం వినడం ద్వారా ఆత్మ స్వరూపాన్ని గ్రహించలేము. అలా విన్నదానిని తర్క సహితంగా మన అనుభవాలను జోడించుకుంటూ ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. అలా నిరంతర మననం ద్వారా మన లోదృష్టికి అస్పష్టంగా కనిపిస్తూ ఉండే ఆ ఆత్మను గురించి నిశ్చితమైన ఏకాగ్ర బుద్ధితో ధ్యానం చేయాలి అంటే గురువు చెప్పేది శ్రద్ధగా వినడం శ్రవణం దానిని తర్క సహితంగా పరిశీలించడం మననం అలా పరిశీలించిన సత్యాన్ని ఏకాగ్ర చిత్తంతో నిరంతరం ధ్యానం
(04:53) చేయడం నిధిధధ్యాసనం అలా శ్రవణ మనణ నిధిధధ్యాసనముల ద్వారా అజ్ఞానపు పరులని తొలగించుకొని ఆత్మ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అసలు ఆత్మ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆత్మ గురించి తెలిస్తే సర్వం తెలిసినట్లే కాబట్టి ఈ సమస్త బ్రహ్మాండం అంతా ఆత్మ నుండే పుట్టింది ఆత్మ స్వరూపంగానే వెరుగొందుతోంది చివరికి ఆత్మలోనే లయమైపోతుంది.
(05:23) కనుక ఆత్మ కంటే వేరుగా మరేదీ లేదు. అలా అంతటా అన్నిట తానే అయినటువంటి ఆత్మయే తానున్న విషయాన్ని మనుష్యుడు తెలుసుకోవాలంటాడు యాజ్ఞవల్డు ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుంటే సృష్టి రహస్యం కూడా అవగతం అవుతుందంటూ దానికో ఉదాహరణ చెబుతాడు. కర్రతో దుందుబిని మోగించినప్పుడు అనేక రకాల శబ్దాలు పుడతాయి. ఆ శబ్ద తరంగాలు అంతటా వ్యాపిస్తాయి. ఇక్కడ దుందుబిని ఆత్మకు ఉపమానంగా తీసుకుంటే దాని నుండి సృష్టించబడిన శబ్దాలు ఆత్మ నుండి ఉత్పన్నమైనటువంటి ఈ సకల చరాచర సృష్టికి ఉపమానం అవుతాయి.
(05:59) మనం అంతటా వ్యాపించిన ఆ శబ్ద తరంగాలను పట్టుకోలేము కానీ దుందుబిని పరిశీలించి దానిని ఎలా వాయించినప్పుడు శబ్దం పుడుతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటే ఆ శబ్ద రహస్యాన్ని అవగతం చేసుకోవచ్చు. అలానే శంఖం పూరించినప్పుడు వీణ వాయించినప్పుడు పుట్టే నాదాలను కూడా మనం పట్టుకోలేం ఆ నాదాలు ఎలా పుడుతున్నాయో తెలుసుకోవాలంటే వాటికి ఆధారభూతమైనటువంటి శంఖాన్ని వీణను గమనించాలి అంటే మనం ఆత్మ గురించి తెలుసుకుంటే ఆ ఆత్మ నుండి పుట్టే ఈ సృష్టి యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకోవచ్చు.
(06:33) మరి ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలంటే యాజ్ఞవల్చుడు చెప్పినట్లుగా ముందుగా మనం గురువుని ఆశ్రయించాలి. జ్ఞానపరమైన విషయాలను ఉపనిషత్తుల్లోని లోతును మనం కేవలం ఆయా పుస్తకాలను చదవడం ద్వారా తెలుసుకోలేం అందుకు గురువుగారి సన్నిధి ఎంతో అవసరం. ప్రేమకు ఆత్మకు ఉన్న సంబంధం గురించి లీలా మాత్రంగా అర్థం చేసుకోవడానికి మాత్రం ఈరోజు మనం చెప్పుకున్న విషయాలు ఉపయోగపడవచ్చు.
(07:01) చివరిగా ఈ యాజ్ఞవలకీ బోధ వల్ల మనకు అర్థమయ్యే విషయాలు ఏమిటంటే ఈ లోకంలో ఎవరైనా ఇంకొకరిని ఎందుకు ప్రేమిస్తారు అంటే అందువల్ల తమకు ఆత్మానందం కలుగుతోంది కాబట్టి అలా అని ప్రేమ అన్నది స్వార్థమా అంటే లౌకికంగా కాకపోవచ్చు ఎందుకంటే తమ ప్రేమకు ప్రతిగా వాళ్ళఏమీ ఆశించరు కాబట్టి అది ఈ లోక వ్యవహారం వరకు స్వచ్ఛమైనదే నిస్వార్థమైనదే కానీ అలా ప్రేమించడంలో వారికి ఆత్మానందం అనే సుఖం కలుగుతోంది.
(07:33) అది ఆధ్యాత్మికమైనది అలా స్వచ్ఛమైన ప్రేమ అన్నది లౌకికంగా నిస్వార్థమైనదే అయినప్పటికీ ఆధ్యాత్మికంగా ఆత్మానందం అనే ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది. అందుకే ప్రేమ అన్నది ఒక నిస్వార్థపు స్వార్థం. ఇక ఈ నాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీవంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చేయాలి అనుకునేవారు 994912154 నెంబర్కు మీ మనసు మనసుకు నచ్చినంత నగదును
(08:18) ఫోన్పే లేదాగ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పిటిఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ

No comments:
Post a Comment