Wednesday, October 7, 2026

అక్రమ సంబంధం ఉన్న వారిని ఏమీ అనకూడదు.!!!అంటే మీకే నష్టం……..??#teluguvideo#affair #illegalaffairs

అక్రమ సంబంధం ఉన్న వారిని ఏమీ అనకూడదు.!!!అంటే మీకే నష్టం……..??#teluguvideo#affair #illegalaffairs

Author Name:Avunu…adapilla..ne!

Youtube Channel Url:https://www.youtube.com/@Adapilla-h1o

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1f6tfltnaOs





Title: అక్రమ సంబంధం ఉన్న వారిని ఏమీ అనకూడదు.!!!అంటే మీకే నష్టం……..??#teluguvideo#affair #illegalaffairs

Author Name: Avunu…adapilla..ne!

Description: Awareness

📝 Description

భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలిసినప్పుడు చాలామంది కోపంతో వెంటనే గొడవ పడతారు. కానీ అలాంటి సమయంలో తొందరపడి స్పందించడం కంటే ముందుగా ప్రశాంతంగా ఉండి, చట్టబద్ధంగా లభించిన ఆధారాలను భద్రపరచుకోవడం, మీ హక్కులు మరియు అందుబాటులో ఉన్న legal remedies గురించి తెలుసుకోవడం ముఖ్యమైన విషయం.

ఈ వీడియోలో:

🔹 భర్త అక్రమ సంబంధం తెలిసినప్పుడు వెంటనే ఎందుకు react అవ్వకూడదు?
🔹 Evidence ఎందుకు ముఖ్యమైనది?
🔹 Evidence సేకరించేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
🔹 మరో మహిళపై legal action విషయంలో అసలు విషయం ఏమిటి?
🔹 మీ future, పిల్లలు, financial security గురించి ఏం ఆలోచించాలి?
🔹 Emotionతో కాకుండా legal adviceతో ఎలా ముందుకు వెళ్లాలి?

గొడవ కాదు… ప్రతీకారం కాదు… సరైన సమాచారం, సరైన ఆధారం, సరైన legal advice ముఖ్యం.

⚠️ Disclaimer: ఈ వీడియో సాధారణ legal awareness కోసం మాత్రమే. ఇది వ్యక్తిగత న్యాయ సలహా కాదు. ప్రతి కేసు facts మరియు వర్తించే చట్టాలపై ఆధారపడి ఉంటుంది. మీ పరిస్థితికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు qualified lawyerని సంప్రదించండి. అక్రమసంబంధం #భర్తఅక్రమసంబంధం #MarriageProblems #RelationshipProblems #LegalAwareness #WomenRights #WomensRights #FamilyProblems #MarriageLife #Divorce #LegalAdvice #Evidence #FamilyLaw #TeluguYouTube #TeluguVideos #TeluguWomen#affairs #husbandwifeaffairs#youtubevideos #treading #viral#illegalaffairs

Part..1    • అక్రమ సంబంధం ఉన్నవాళ్లని ఏమీ అనకండి! ముందు...

Transcript:
(00:00) అక్రమ సంబంధం పెట్టుకున్నవాళ్ళని ఏమి అనొద్దు పార్ట్ట ఇది పార్ట్ వన్ అనేది నా ఛానల్ లో ఉంది చూడండి ఆల్రెడీ కింద లింక్ ఇచ్చాను పార్ట్ వన్ చూస్తే పార్ట్ట ఇది అర్థంవుతుంది. పార్ట్ వన్ లో నేను ఏం చెప్పాను మీ లైఫ్ పార్ట్నర్ అది భార్య గాని భర్త గాని ఎవరైనా వేరే వాళ్ళతో రాంగ్ రిలేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఏమి అనకండి వాళ్ళతో గొడవ పడకండి మరి వాళ్ళని ఏం చేయాలి అనే ప్రాసెస్ నేను క్లియర్ గా ఆ వీడియోలో చెప్పాను ఆ వీడియోని చాలామంది చూశారు కూడా దాదాపు 1 లాక్ వ్యూస్ వచ్చినయి అయితే కామెంట్లో ఒకటే నెగిటివిటీ అక్రమ సంబంధం పెట్టుకున్నవాళ్ళని ఏమ
(00:41) అనొద్దా ఏమ అనకుండా తల మీద పెట్టుకోవాలా కోపం వచ్చిద్ది కదా బాధ వచ్చిద్ది కదా నువ్వు ఉంటే ఆ ప్లేస్ లో ఏం చేస్తావ అని కొంతమంది ఇంకొంతమంది అయితే అవతల వ్యక్తి మీద కేసు పెట్టమంటున్నాం అది కరెక్టేనా పెట్టొచ్చా కొంతమంది నష్టపరిహారం ఎలా తీసుకోవచ్చు ఏ కేసు పెట్టొచ్చు అని ఇలా రకరకాల డౌట్లు కామెంట్లు అడిగారు అవన్నీ నేను ఈ వీడియోలో మీకు సమాధానం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే వెళ్లి చూడండి ఆ వీడియోలో నేను ఏం చెప్పాను మీ లైఫ్ లో ఉన్న మీ పార్ట్నర్ అది భార్య గాని భర్త గాని ఫర్ ఎగ్జాంపుల్ భర్త వేరే అమ్మాయితో రాంగ్ రిలేషన్
(01:16) పెట్టుకున్నాడు అనే విషయం మీకు తెలిస్తే మీరు వెంటనే వాళ్ళ మీద అటాక్ చేయకుండా గొడవ పడకుండా ముందు మీకు కోపం ఉంటది బాధ ఉంటది అయినా మీ ఎమోషన్ ని మీరు కంట్రోల్ చేసుకొని ముందు ప్రాపర్ గా ప్రూఫ్స్ ని ఎవిడెన్స్ ని సంపాదించండి అని చెప్పాను ఎందుకు అలా చెప్పాను ఇప్పుడు రాంగ్ రిలేషన్ ఉందని తెలిసిన వెంటనే మీరు వెళ్లి ఆ కోపాన్ని తట్టుకోలేకుండా ఆ బాధని భరించలేక భర్త మీద వెళ్లి గొడవ పడితే ప్రశ్నిస్తే నిందిస్తే వెంటనే వాళ్ళు ఎలెక్ట్ అవుతారు.
(01:48) ఎలెక్ట్ అయిపోయి మీకు ప్రూఫ్లు ఎవిడెంట్లు ఏమి దొరక్కుండా జాగ్రత్త పడతారు. ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఇవన్నీ తారుమారు చేస్తారు అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎవరికన్నా పలానా వ్యక్తి ఇలా చేశాడు అని చెప్పాలన్నా నీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. ప్రోపర్ ఎవిడెన్స్ ఉండాలి అందుకని నేను ఫస్ట్ తెలిసిన వెంటనే మీకు బాధున్నా గొడవ పడకండి. ముందు నిదానంగా ఉండి ప్రశాంతంగా ఉండి వాళ్ళతో రోజు ఎలా ఉంటున్నారో అలాగే సాధారణంగా ఉంటూ ప్రాపర్ ఎవిడెన్స్ ప్రూఫ్లల్ని ఫోటోస్ అని వీడియోస్ అని వాళ్ళద్దరి మధ్య జరిగిన లావాదేవీలు సంభాషణ ఇలాంటివి ప్రాపర్ ఎవిడెన్స్ ని సంపాదించండి అని చెప్పాను. ఈ
(02:25) మాట ఇలా చెప్పినందుకు చాలామంది ఏమ అనపోతే అలాగా కోపం రాదా బాధపడ కోపం రాదా అని చెప్పట్లేదండి బాధ వస్తది కోపం వస్తది జీవితంంతా అల్లకొల్లలంగా అనిపిస్తది నేను కాదనట్లేదు కాబట్టి చెప్పాను కదా మీరు వెళ్లి ఫస్టే అటాక్ చేసి గొడవ పడినట్టు మాట్లాడితే వాళ్ళు జాగ్రత్త పడతారు ప్రూఫ్స్ దొరకవు మీకు ప్రూఫ్స్ దొరకకపోతే మీరే పిచ్చోళ్ళు అవుతారు అప్పటివరకు ప్రూఫ్స్ దొరికేంతవరకు కాముగా ఉండమన్నా దాని అర్థం అది అక్రమ సంబంధం పెట్టుకున్న మీ భర్తని ఏమ అనొద్దు మీ భార్యని ఏమి అనొద్దు అంటే దాని దాని అర్థం ఏంటి ప్రూఫ్స్ దొరికేంతవరకు సాధారణంగా ఉంటూ
(02:58) కంట్రోల్ చేసుకొని ముందు ఎవిడెన్స్ ని సంపాదించండి. ఆ తర్వాత ప్రూఫ్స్ పెట్టి అడగండి అనేది అర్థం అక్కడ అంతేగన ఏమ అనొద్దు మీ భర్తని ఏమ అనమాకండి అని కాదు అక్కడ అర్థం వీడియోని క్లియర్ గా చూడండి అంతే కాదు అవతల వ్యక్తి ఉన్నారు మీ హస్బెండ్ తో ఎవరైతే రిలేషన్ పెట్టుకున్నారో అవతల వ్యక్తి దగ్గరికి వెళ్లి మీరు కోపంతో ఊగిపోతూ ఆమెని ఏదో ఒకటి అంటూ కొడుతూ ఉన్నారు అనుకోండి దాని వల్ల ఏం ఉపయోగం చెప్పండి ఒకరోజుంతా కొడతారు తర్వాత అయినా మీరు అలసిపోతారు కదా మళ్ళీ కూర్చొని మీరే ఏడవాలి వాళ్ళు బానే ఉంటారు పైగా అందరి దృష్టిలో మేమ మిమ్మల్ని
(03:31) నెగటివ్ చేస్తారు మీ భర్త దగ్గర వాళ్ళు సానుభూతి సింపతీ పొందుతారు. నీ భార్య చూడు ఇలా చేసింది ఇంత రాక్షసి ఇలాంటి దానితో ఎలా కాపురం చేస్తున్నావ అని మిమ్మల్ని నెగిటివ్ చేసి చూపిస్తారు. మీరు వెళ్లి వాళ్ళని కోపపడటం వల్ల వాళ్ళని వెళ్లి అరవటం వల్ల కొట్టడం వల్ల అలా కాకుండా ప్రాపర్ ఎవిడెన్స్ ఫోటోలు వీడియోస్ ఇవన్నీ ప్రాపర్ గా మీరు సంపాదించి వాటిని ఆధారంగా చేసుకొని ఒక మంచి లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక మీకు సలహా ఇస్తాడు.
(04:00) మీరు చెప్పండి ఇలాగ నా లైఫ్ బ్రేక్ అయిపోయింది నా లైఫ్ డామేజ్ అయింది నా ఫ్యూచర్ పోయింది నా కుటుంబ పరువు పోయింది నేను అవతల వ్యక్తి మీద కేస్ పెట్టాలనుకుంటున్నాను అంటే ఆయన మీకు ఒక సలహా ఇస్తాడు కేస్ పెట్టొచ్చు ఇక్కడ చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు కేస్ పెట్టొచ్చు అవతల వ్యక్తి మీద మనక ఏం రైట్స్ ఉంటాయి అంటే కరెక్టే అవతల వ్యక్తి మీ హస్బెండ్ తో రాంగ్ రిలేషన్ పెట్టుకుంది కాదనట్లేదు మన భారతదేశంలో అడల్టరీ తప్పు కాదు అనేది ఉంది కానీ ఇక్కడ మీ లైఫ్ డామేజ్ అయిపోయింది కదా మీ ఫ్యూచర్ పోయింది కదా మీ మనశాంతి పోయింది కదా మీరు మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ అన్ని
(04:31) పోగొట్టుకున్నారు కుటుంబ పరువును పోగొట్టుకున్నారు మీరు నష్టపోయారు ఎవరి వల్ల అవతల వ్యక్తి వల్ల అవతల వ్యక్తి మీ కుటుంబంలోకి రావడం వల్ల ఈ కారణంతో మీరు ఆమె మీద సివిల్ కేస్ ఫైల్ చేయొచ్చు అది మీరు మీ లాయర్ దగ్గరికి వెళ్లి అడిగితే చెప్తాడు ఎప్పుడు మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నప్పుడు సివిల్ ఫైల్ చేసి కాంపెన్సేషన్ కింద నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు అవతల వ్యక్తి దగ్గర 5 లక్షల నుంచి 80 లక్షల దాకా మీరు నష్టపరిహారం కూడా అడిగి తీసుకోవచ్చు అది అది ఆ అవతల వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి ఉంటది ఎంత అనేది ఇలా చేస్తే మీరు అవతల వ్యక్తిని
(05:06) దెబ్బ కొట్టినట్టే అని నేను ఆ వీడియోలో చెప్పాను. ఇక్కడ నన్ను అడిగింది చాలా మంది ఎలా అంటే అవతల వ్యక్తి మీద ఎలా కేసు పెట్టొచ్చు అంటే పెట్టొచ్చు మీరు నష్టపోయారు కదా మీకు నష్టం జరిగింది కదా మీరు మీ జీవితాన్ని కోల్పోయారు కదా ఆవిడ మీ హ్యాపీనెస్ ని మీకు రావలసిన ప్రేమని మీకు రావలసిన టయాన్ని మీ భవిష్యత్తుని అన్నిటిని నాశనం చేసింది కదా అన్నిటిని నష్టపరిచింది కదా మీరు కేస్ పెట్టొచ్చు నష్ట పరిహారం తీసుకోవచ్చు అంతేగానీ ఊరికే తొందరపడేసి హస్బెండ్ మీద గొడవ పెట్టేసుకొని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేసుకొని మీరు ఏ ఆధారాలు లేకుండా
(05:38) నిలబడితే మీరే పిచ్చోళ్ళ అవుతారు అనేది నేను ఆ వీడియోలో చెప్పాను అలా అని నేను హస్బెండ్ ని వదిలేయమని చెప్పట్లేదు ఫస్ట్ అక్కడ మీకు మీరు నష్టాన్ని పూరించుకున్న తర్వాత హస్బెండ్ తో ఉండడమా హస్బెండ్ ని కూర్చోబెట్టి మాట్లాడటమా లేకపోతే ముందుకు వెళ్ళడమా డైవర్సీస్ తర్వాత విషయం ముందైతే మీరు అవతల వ్యక్తిని కొట్టాలి అనుకున్నప్పుడు ఫైనాన్షియల్ గా కొట్టండి ఎప్పుడైనా ఒక మాట అన్నప్పుడు ఆ నెప్పి ఎంతసేపు ఉంటది ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బ ఎంతసేపు ఉంటది తర్వాత వాళ్ళు సదామాలు అయిపోతారు అలా కాదు జోబులో నుంచి ఒక రూపాయి పోతున్నప్పుడు అసలు పెయిన్ అంటే
(06:11) ఏంటో తెలుస్తుంది. మీకు రెండు లక్షలోమూడు లక్షలో మీరు తీసుకెళ్ళిన ప్రూఫ్ల ఆధారంగా కట్టాల్సి వచ్చింది అనుకోండి కోర్ట్లో అప్పుడు ఏం చేస్తారు సచ్చినట్టు కట్టక తప్పదు అప్పుడు ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. ఓహో నేను ఈ పని చేయడం వల్లే కదా ఈరోజు నేను ఇన్ని లక్షలు కట్టాల్సి వస్తుంది. ఆ పెయిన్ వాళ్ళకి తగిలితే రెండోసారి ఈ పని చేయరు.
(06:31) ఇప్పుడు చెప్పండి ఏది కరెక్ట్ డబ్బులు పోతున్నప్పుడు మీ హస్బెండ్ మీదకి ఆవిడే ప్రెజర్ తీసుకెళ్ళిద్ది. అప్పుడు వాళ్ళద్దరి మధ్య మీరు డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసినోళ్ళు అవుతారు ఒక ప్రాబ్లం ని క్రియేట్ చేసినోళ్ళు అవుతారు అలా దెబ్బ కొట్టాలి. అది నేను ఆ వీడియోలో చెప్పింది అంతేగాన హస్బెండ్ ని ఏమ అనొద్దా అంటే ఎప్పటి వరకు ఏమ అనొద్దు అన్నాను ప్రూఫ్స్ ఎవిడెన్స్ మీరు ముందే బయటపడితే ఆ ఎవిడెన్స్ మీకు దొరకపోవచ్చు అలా ఎవిడెన్స్ లేక చాలామంది పిచ్చోళ్లుగా నిలబడుతున్నవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి ఏం చేస్తారు పాపం ఎవిడెన్స్ లేక అన్యాయంగా దీనంగా అలాగే చూస్తూ నించున్నోళ్ళు
(07:04) చాలామంది ఉన్నారు. అందుకే మీరు కాముగా ఉండమది ఎందుకు నేను బాధ లేక కాదు కంట్రోల్ చేసుకొని ప్రూఫ్ సంపాదించుకొని ప్రూఫ్ల ఆధారంగా మాట్లాడండి అవతల వ్యక్తిని దెబ్బ కొట్టాలంటే ఇలా కొట్టండి యాక్చువల్ గా ఎప్పుడైనా ఇలాంటి వాటిల్లో భర్త మీద గొడవ పడటం భర్తని ఏదో ఒకటి అనటం ఇంట్లో డిస్టర్బ్ చేసుకోవడం ఎప్పుడు ఇది ఒక ఓల్డ్ ప్రాసెస్ ఇలా చేశారనుకోండి ప్రూఫ్స్ పెట్టుకొని అవతల వ్యక్తి మీద నష్టపరిహారం కేసు వేశారనుకోండి ఆ కేసులో కిక్ ఉంటది మజా ఉంటది అసలు అసలు మీరు అంటే ఏంటో చెప్పకనే చెప్పినట్టు ఉంటది అది నేను ఆ వీడియోలో మీకు చెప్పింది. మీరు వాళ్ళ
(07:40) రిలేషన్ పెట్టుకున్నందుకు వేయట్లే కేస్ ఇక్కడ మీరు నష్టపోయారు కదా అవతల వ్యక్తి వల్ల మీ లైఫ్ డామేజ్ అయింది. మీ హ్యాపీనెస్ పోయింది మీ మెంటల్ హెల్త్ బ్రేక్ అయింది నేను నష్టపోయాను నాకు నష్ట పరిహారం కావాలని వేస్తున్నారు వేయొచ్చు సివిల్ ఫైల్ చేయొచ్చు మీరు ఒక మంచి లాయర్ దగ్గరికి వెళ్ళండి. సో అన్ని డౌట్లు క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను.
(08:03) ఈ వీడియో మీ డౌట్లు క్లియర్ చేయాలని మళ్ళీ కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అప్పటివరకు అవును ఆడపిల్లని నమస్తే.

No comments:

Post a Comment