ఇతరులను వారి స్థానంలో ఉంచే మహిళగా ఉండండి | చాణక్యుడి 9 ప్రమాదకరమైన ఉపాయాలు | Chanakya Niti For Women
Author Name:Telugu Vastu Tips
Youtube Channel Url:https://www.youtube.com/@teluguvaastutips
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6u6uWlKlQCc
Title: ఇతరులను వారి స్థానంలో ఉంచే మహిళగా ఉండండి | చాణక్యుడి 9 ప్రమాదకరమైన ఉపాయాలు | Chanakya Niti For Women
Author Name: Telugu Vastu Tips
Description: 🔥 జనాలను వాళ్ల స్థాయిలో ఉంచే మహిళ అవ్వాలంటే ఈ చాణక్య నీతి తెలియాలి! | Chanakya Niti for Women
మనసులో మంచితనం ఉండి కూడా పదే పదే మోసపోయారా? అందరినీ బాగా చూసుకున్నా, మీకు అవసరమైనప్పుడు ఎవరూ తోడు లేరా? మీ మౌనాన్ని అందరూ మీ బలహీనత అనుకున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే.
చాణక్య నీతి ప్రకారం, ప్రపంచం మంచి గుణాల భాషను అర్థం చేసుకోదు, హద్దుల భాషను మాత్రమే అర్థం చేసుకుంటుంది. అరవకుండా, గొడవపడకుండా, ప్రశాంతంగా ఉంటూనే ఎదుటివాళ్లకు వాళ్ల స్థానం ఏంటో గుర్తుచేసే 12 శక్తివంతమైన సూత్రాలు ఈ వీడియోలో ఉన్నాయి.
📌 ఈ వీడియోలో మీరు నేర్చుకునేవి:
✅ ఎవరినీ మీ మీద ఆధిపత్యం చెలాయించనివ్వకండి
✅ మీ బలహీనతను ఎవరికి చూపించాలి, ఎవరికి చూపించకూడదు
✅ పదే పదే ఛాన్సులు ఇస్తే ఏం జరుగుతుంది, Limited Chances సూత్రం
✅ ప్రశాంతంగా ఉంటూనే ఇచ్చే ఎదురుదాడి
✅ మీ భావోద్వేగాలను రహస్యంగా ఉంచే కళ
✅ మీరు అందుబాటులో లేకపోవడమే మీ అసలైన శక్తి ఎలా అవుతుంది
✅ మీ మౌనాన్ని ఎలా శక్తిగా మార్చుకోవాలి
✅ ఇతరులతో పోల్చుకోకుండా మీ సొంత గుర్తింపును ఎలా తయారుచేసుకోవాలి
💬 కామెంట్ చేయండి: "నా విలువను నేనే నిర్ణయించుకుంటాను"
ఈ వీడియో నచ్చితే 👍 లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని చాణక్య నీతి వీడియోల కోసం మన ఛానెల్‌ని 🔔 సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
▶️ మహిళల కోసం చాణక్య నీతి ఇతర వీడియోలు:
🔗 Video 1: [ • సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? తెలివైన మహిళగ... ]
🔗 Video 2: [ • మీలో ఈ 5 గుణాలు ఉంటే మీరు సాధారణ స్త్రీ కా... ]
🔗 Video 3: [ • Strong కాదు... Mastermind మహిళగా ఉండండి ||... ]
⚠️ Disclaimer: ఈ వీడియో కేవలం సమాచారం మరియు ప్రేరణ కోసం మాత్రమే. ఇది చాణక్య నీతి ఆధారంగా రూపొందించిన ఒరిజినల్ కంటెంట్.
#ChanakyaNiti #చాణక్యనీతి #TeluguMotivation #WomenEmpowerment #SelfRespect #చాణక్యనీతిమహిళలకు #ChanakyaNitiForWomen #TeluguWisdom #LifeLessons
Disclaimer:
This video is created for educational and informational purposes based on Buddhist philosophy and spiritual teachings. The script, narration, editing, and overall creative direction are intended to educate and inspire viewers.
Some of the visuals/images used in this video were generated with the assistance of AI tools. However, they are not used in their original form. I personally edit, enhance, animate, and transform them using Adobe After Effects and Adobe Premiere Pro. The audio has also been professionally edited using Audacity.
The final video represents my own original creative work through editing, animation, storytelling, and production.
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మాట్లాడబోయేది మనసులో ఎంతో మంచితనం ఉండి కూడా పదే పదే మోసపోయిన ప్రతి మహిళ కోసం అందరినీ బాగా చూసుకుంటూ వచ్చి తనకు ఒక ఆసరా కావాల్సినప్పుడు మాత్రం జనాలు వెనక్కి తగ్గిపోవడం చూసిన ప్రతి అమ్మాయి కోసం అలాగే చాలా ఎమోషనల్ చాలా సాఫ్ట్ పాపం చాలా అమాయకురాలు అని చెప్పి అందరూ తేలిగ్గా తీసేసుకున్న ప్రతి మహిళ కోసం ఒక్కసారి నిజం చెప్పండి మీరు ఎవరికైనా అవసరానికి మించి ప్రాధాన్యత ఇస్తే ఆ మనిషే మిమ్మల్ని అందరికంటే ముందు పట్టించుకోవడం మానేసి వదిలేసాడా ఎప్పుడైనా మీ మౌనాన్ని మీ బలహీనత అనుకున్నారా ఒకవేళ మీ ఆన్సర్
(00:39) ఎస్ అయితే ఈరోజు ఈ మెసేజ్ మీకోసమే ఈరోజు నేను మీకు ఊరికే ఏదో మోటివేషన్ ఇవ్వడానికి రాలేదు. మానసిక బలం అనే ఒక గొప్ప కళను నేర్పించబోతున్నాను. అది ఒక ఆడదాన్ని లోపల నుంచి ఎంత స్ట్రాంగ్ గా మారుస్తుందంటే జనాలు ఆమెను చూసి భయపడక్కర్లేదు. కానీ ఎప్పటికీ తేలిగ్గా మాత్రం తీసుకోలేరు. ఎవ్వరూ ఆమె ఎమోషన్స్ తో ఆడుకోలేరు ఆమెను వాడుకొని వదిలేయలేరు.
(01:02) ఈ ప్రపంచంలో ఎక్కువగా మోసపోయేది ఎవరో తెలుసా స్వచ్ఛమైన మనసు ఉన్నప్పటికీ హద్దులు ఎలా పెట్టుకోవాలో తెలియని వారే అని చాణక్యుడు అంటాడు. ఫ్యామిలీని రిలేషన్స్ ని కాపాడుకోవడానికి ఆడవాళ్ళు తరుచుగా సైలెంట్ గా ఉండిపోతారు. కుటుంబాన్ని కలిపి ఉంచడానికి తనను తాను కష్టపెట్టుకుంటుంది. తన ప్రేమను నిలబెట్టుకోవడానికి తన ఆత్మగౌరవాన్ని కూడా పణంగా పెడుతుంది.
(01:24) కానీ త్యాగానికి బలహీనతకి చాలా తేడా ఉంది. శాంతంగా ఉండటానికి లొంగిపోవడానికి చాలా తేడా ఉంది. అవతలి వాళ్ళకు వాళ్ళ స్థానం ఏంటో చూపించడం అంటే వాళ్ళను అవమానించడం కాదు మన హద్దులు ఏంటో స్పష్టంగా చెప్పడమే ఎవ్వరూ దాటడానికి సాహసించని ఒక గీతను గీయడం ఒకవేళ ఎవరైనా ఆ గీత దాటడానికి ప్రయత్నిస్తే ప్రశాంతంగానే ఉండి అంతే గట్టిగా వాళ్ళని అక్కడే ఆపేయడం.
(01:50) ఒక్కసారి మీ లైఫ్ లోకి వెనక్కి తిరిగి చూడండి. మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా బాధ పెట్టిన ఒక ఐదుగురిని గుర్తు తెచ్చుకోండి. నిజం ఏంటో తెలుసా వాళ్ళ రేంజ్ కి మించిన ప్లేస్ ని వాళ్ళకి ఇచ్చింది మీరే వాళ్ళకి అర్హత లేనంత ప్రాధాన్యత మీరు ఇచ్చారు. మీరు ఎంత బాధ పెట్టినా భరిస్తూనే ఉంటారని వాళ్ళకి అర్థమైన మరుక్షణం నుంచే ఈ ఆట మొదలైంది.
(02:09) కానీ ఈ రోజు నుంచి ఈ ఆట మారబోతోంది. ఈరోజు మీరు చాణక్య నీతిలోని 12 అత్యంత పవర్ఫుల్ సూత్రాలు నేర్చుకోబోతున్నారు. ఇవి ఒక మహిళని లోపల నుంచి ఎంత స్ట్రాంగ్ గా మారుస్తాయ అంటే ఆమె ఉన్నప్పుడు జనాలు ప్రతి మాట చాలా చూసి తూచి మాట్లాడతారు. ఆమె మౌనాన్ని ఎవ్వరూ బలహీనత అనుకోరు. దాని వెనుక ఉన్న లోతుని అర్థం చేసుకుంటారు. జనాలు మీకు భయపడటం కాదు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా గౌరవించాలి అని, మీ నో అనే ఒక్క మాటను చివరి నిర్ణయంగా ఒప్పుకోవాలని, మిమ్మల్ని ఎవరైనా తేలిగ్గా తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించాలని మీరు కోరుకుంటే, ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి.
(02:47) ప్రతి మహిళ ఈ పవర్ ను నేర్చుకోవాలని మీకు అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ కొట్టి మీ అటెండెన్స్ వేసుకోండి. కామెంట్స్ లో నా హద్దులు నేనే పెట్టుకుంటాను అని టైప్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టైం వచ్చింది. కేవలం అందరి దృష్టిలో మంచి అమ్మాయిగా ఉండిపోవడం కాదు ఎవ్వరూ మీ ఆత్మగౌరవాన్ని దాటి ప్రవర్తించే ధైర్యం చేయలేనంత పవర్ఫుల్ గా మారడానికి పదండి మొదలు పెడదాం.
(03:12) ఫ్రెండ్స్ వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మహిళల కోసం చాణక్య నీతిపై నేను ఇప్పటికే మూడు వీడియోలు చేశాను. ఆ వీడియోలకు మీరు ఇచ్చిన సపోర్ట్ కి చాలా థాంక్స్. ఆ వీడియో లాగే ఈ వీడియో కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. కాబట్టి మాకు సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే హైప్ బటన్ కూడా నొక్కండి. ఈ వీడియో జీవితంలో మీలాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరికొంతమంది మహిళలకు కూడా చేరేలా చేయండి.
(03:36) అలాగే నా పాత వీడియోలు చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఆ వీడియోల లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి రూల్ ఎవరిని మీ మీద ఆధిపత్యం చెలాయించనివ్వకండి. సిస్టర్స్ ఒక్కసారి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడుక్కోండి ఎదుటి మనిషి మనవాడే కదా అన్న ఒక్క కారణంతో మీరు ఎప్పుడైనా మౌనంగా ఉండిపోయారా అతను మీ హస్బెండ్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్ కావచ్చు క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు లేదా మీ బాస్ కావచ్చు సరేలే వదిలేయ్ ఇంట్లో గొడవలు ఎందుకు ప్రశాంతత ముఖ్యం అనుకని ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారా ఒకవేళ మీ ఆన్సర్ ఎస్ అయితే అసలు
(04:11) ప్రాబ్లం ఇక్కడే మొదలవుతుంది. చాలాసార్లు ఇక్కడి నుంచే ఒక మహిళా సెల్ఫ్ రెస్పెక్ట్ నెమ్మదిగా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. చాణక్యుడు ఒక మాట చెప్తాడు. ఓర్పు అనేది చాలా మంచి గుణమే. కానీ ఆ ఓర్పే హద్దు దాటితే అది బలహీనత అయిపోతుంది. ప్రపంచం మంచి గుణాల భాషను అర్థం చేసుకోదు. కేవలం హద్దుల భాషను మాత్రమే అర్థం చేసుకుంటుంది.
(04:31) ఒక స్త్రీ మొదటిసారి తన గొంతును అణచుకున్నప్పుడు అవతలివాడు ఆమె మంచిని అర్థం చేసుకోడు అసలు ఈమె ఎంతవరకు భరించగలదో అని టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మీరు ఎదురు చెప్పరు అని అతనికి అర్థమైన మరుక్షణం నుంచే మిమ్మల్ని సమానంగా చూడటం మానేసి తన కంట్రోల్ లో ఉంచుకోవడానికి ట్రై చేస్తాడు. ఈ ఆధిపత్యం అనేది ఒక్క రోజులో రాదు చాలా చిన్న చిన్న విషయాల నుంచే మొదలవుతుంది.
(04:54) ఎవరో మీ మాటను మధ్యలో ఆపుతారు. మీరు కేవలం ఒక చిరునవ్వు నవ్వి సైలెంట్ అయిపోతారు. ఎవరో మీ కష్టానికి రావలసిన క్రెడిట్ కొట్టేస్తారు. అప్పుడు మీరు పోనీలే పర్లేదు అని సరిపెట్టుకుంటారు. ఎవరైనా మీ టైం కి అసలు వాల్యూ ఇవ్వరు. మిమ్మల్ని గంటల తరబడి వెయిట్ చేయిస్తారు. మీ ఫీలింగ్స్ ని చాలా లైట్ తీసుకుంటారు. అప్పుడు కూడా మీరు బహుశా ఒక బంధాన్ని కాపాడుకునే పద్ధతి ఇదేనేమో అని పొరబడతారు.
(05:16) కానీ నిజం ఏంటో తెలుసా మీరు మీ హద్దులు దాటి సైలెంట్ గా ఉన్న ప్రతిసారి అవతలి వ్యక్తికి నువ్వు నా విషయంలో ఇలా ప్రవర్తించినా పర్లేదు అని మీరే పర్మిషన్ ఇస్తున్నారు. నెమ్మదిగా ఆ మనిషి మీ గొంతు పైకి లేవకముందే దాన్ని అణచేస్తాడు. ఈరోజు మీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తాడు. రేపు మీ ఆత్మవిశ్వాసాన్ని ఎల్లుండి మీ ఆత్మగౌరవాన్నే ప్రశ్నిస్తాడు. ఆఖరికి మీ సొంత లైఫ్ లోనే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి జీవితాంతం కష్టపడుతూ ఉండిపోతారు.
(05:43) అందుకే గుర్తుపెట్టుకోండి మొదట్లో మీరు పాటించే ఆ మౌనమే రాను రాను మీకు ఒక అలవాటుగా మారిపోతుంది. అలా అని దీని అర్థం మీరు ప్రతి చిన్న విషయానికి గొడవ పడేలా మారాలని కాదు. అసలైన బలం అరిచి చెప్పడంలో ఉండదు. సైలెంట్ గా ఉండే ప్రశాంతతలోనే ఉంటుంది. చాణక్య నీతి నేర్పేది ఏంటంటే అత్యంత పవర్ ఫుల్ సమాధానం ఎప్పుడూ గొంతు మృదువుగా ఉండి మాటలు స్పష్టంగా గట్టిగా ఉన్నప్పుడే వస్తుంది.
(06:07) ఎవరైనా మీ హద్దు దాటడానికి ట్రై చేసినప్పుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వండి. నేరుగా వాళ్ళ కళ్ళలోకి చూసి చాలా ప్రశాంతంగా ఇలా చెప్పండి. నేను దీనిని అంగీకరించను. దట్స్ ఇట్ అక్కడ ఎలాంటి అరుపులు వద్దు, కోపాలు వద్దు పెద్ద పెద్ద వివరణలు అస్సలు వద్దు. నమ్మండి మొదటిసారి తన సరిహద్దు గీతను గీయగలిగిన మహిళే ఆ తర్వాత అందరికంటే ఎక్కువ రెస్పెక్ట్ పొందుతుంది.
(06:32) జనాలు ఆమె ముందు చాలా చూసి తూచి మాట్లాడతారు. ఎందుకంటే ఈమె చాలా వినయంగా ఉంటుంది కానీ బలహీనురాలు కాదు. ప్రశాంతంగా ఉంటుంది కానీ ఎవరికీ వంగేది కాదు అని వాళ్ళకు అర్థమైపోతుంది. గుర్తుపెట్టుకోండి మీ గౌరవాన్ని మీరే కాపాడుకోకపోతే ప్రపంచం మీ విలువను తన ఇష్టం వచ్చినట్టు నిర్ణయిస్తుంది. తన విలువను తానే నిర్ణయించుకునే మహిళని ఎవ్వరూ తక్కువగా అంచనా వేయలేరు.
(06:56) అందుకే అవతలి వాళ్ళకు వాళ్ళ ప్లేస్ ఏంటో చూపించే ఆర్ట్ ఈ ఫస్ట్ రూల్ తోనే స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని ఎవ్వరూ కంట్రోల్ చేయకుండా చూసుకోండి. ఒక సాధారణ స్త్రీని ఒక పవర్ఫుల్ పర్సనాలిటీగా మార్చే మొదటి స్టెప్ ఇదే. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి మీ సపోర్ట్ ఇవ్వండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.
(07:16) మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రెండో రూల్ ఎవరికీ మీ బలహీనతను చూపించకండి. మనం చిన్నప్పుడు అనుకున్నంత అమాయకమైనది కాదు ఈ ప్రపంచం. ముఖ్యంగా ఒక మహిళ విషయంలో ఈ ప్రపంచం ఆమె ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడం కంటే వాటిని టెస్ట్ చేసి వాడుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తుంది. మీరు కూడా గమనించే ఉంటారు. ఒక స్త్రీ ఎక్కడైనా మానసికంగా కుంగిపోతున్నట్టు కనిపించిన మరుక్షణమే జనాలు ఆమె కన్నీళ్లలో సానుభూతిని తక్కువగా చూస్తారు. అవకాశాలను ఎక్కువగా వెతుకుతారు.
(07:44) అసలైన కంట్రోలింగ్ గేమ్ మొదలయ్యేదే అక్కడి నుంచి. చాణక్యుడు ఒక చాలా స్పష్టమైన మెసేజ్ ఇస్తాడు. మీ బలహీనతలను ప్రతి ఒక్కరికి తెలియజేయడం అంటే మీ కోట తలుపులను కాపలా లేకుండా తెరిచి పెట్టేయడమే. మీరు మీ భయాలను అభద్రతలను రిలేషన్షిప్ సమస్యలను లేదా మీకు ఏమీ చేయలేని పరిస్థితిని ఎవరితోనైనా షేర్ చేసుకున్నప్పుడు ఆ క్షణంలో ఎదుటి వ్యక్తి చాలా సానుభూతితో మీ మాటలన్నీ శ్రద్ధగా వింటూ మిమ్మల్ని ఓదారుస్తున్నట్టు అనిపించవచ్చు.
(08:14) కానీ ఒకవేళ వాళ్ళ క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే మీరు చెప్పిన అవే విషయాలను ఏదో ఒక రోజు మీకు వ్యతిరేకంగా వాడుకోవడానికి వాళ్ళు అప్పుడే విత్తనం నాటేసి ఉంటారు. ఇది ఆడవాళ్ళ విషయంలో ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే సమాజం ఆడవాళ్ళను చాలా ఎమోషనల్ చాలా మెత్తటి మనసు ఉన్నవాళ్ళు అని ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరైనా వెళ్లి నాకు ఒంటరిగా ఉండటానికి భయం అనో ఎక్కడ ఈ రిలేషన్షిప్ పోతుందేమో అని భయం వేస్తుందనో లేదంటే నాకు ఫైనాన్షియల్ గా అస్సలు సెక్యూరిటీ లేదు అనో అన్నారనుకోండి తప్పు మనిషి చేతిలో పడితే ఆ మనిషి ఆ భయాన్నే పట్టుకొని మిమ్మల్ని పూర్తిగా
(08:50) కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు మిమ్మల్ని నేరుగా వచ్చి కొట్టరు బాధించరు కానీ మిమ్మల్ని అణచివేయడానికి మీలోని ఆ బలహీనతనే వాడుకుంటారు. కొన్నిసార్లు చులకన చేసే మాటలతో కొన్నిసార్లు బెదిరింపులతో కొన్నిసార్లు కావాలని వహించే మౌనంతో క్రమంగా మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు.
(09:11) బహుశా ఇది నా తప్పేమో నేనే మరీ ఓవర్ గా రియాక్ట్ అవుతున్నానేమో అని అనుకోవడం మొదలు పెడతారు. సరిగ్గా ఇక్కడే మీ మానసిక బానిసత్వం మొదలవుతుంది. చాణక్య నీతి నేర్పే అసలైన పాయింట్ ఏంటంటే మీ బలహీనతను. ఆ బలహీనత నుంచి మిమ్మల్ని బయట పడేసే కెపాసిటీ ఉన్న ఒక వ్యక్తి ముందే బయట పెట్టండి. ఎవరైతే మీకు సరైన సొల్యూషన్ ఇవ్వగలరో సరైన దారి చూపించి మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ గా మార్చగలరో వాళ్ళ ముందు మాత్రమే.
(09:38) మిగతా ప్రపంచం ముందు మాత్రం మీ క్యారెక్టర్ చాలా బ్యాలెన్స్డ్ గా కంట్రోల్డ్ గా ఎలాంటి పరిస్థితుల్లోనూ తడబడని వ్యక్తిలా కనిపించాలి. దీని అర్థం మీరు రాయిలా మారిపోవాలని కాదు మీ ఎమోషన్స్ ని అణచేసుకోవాలని అసలే కాదు. ఒక పవర్ఫుల్ మహిళ తన ఎమోషన్స్ ని తను క్లియర్ గా అర్థం చేసుకుంటుంది. కానీ అందరి ముందు వాటిని తెరిచిపెట్టదు. తన లోపలి పోరాటాలు తన పర్సనల్ స్ట్రెంత్ అని అవి అందరికీ ప్రదర్శించే వస్తువులు కావని ఆమెకు బాగా తెలుసు.
(10:07) ఎందుకంటే మీ మాటలు వినేవాళ్ళంతా మీ శ్రేయోభిలాషులు కాదు. గుర్తుపెట్టుకోండి జనాలు ఒక స్ట్రాంగ్ ఉమెన్ ముందు ఏ మాట మాట్లాడాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు. కానీ ఎవరినైతే బలహీనులు అని అనుకుంటారో వాళ్ళతో హద్దులు దాటి ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారు. అందుకే మీ సున్నితత్వమే మీ పవర్ అవ్వాలి గానీ మీకు సంకెళ్లు కాకూడదని ఈరోజే డిసైడ్ అవ్వండి.
(10:28) మీ కళ్ళలో కన్నీళ్లు రావచ్చు కానీ ఈ ప్రపంచం వాటిని మీ నిస్సహాయత అనుకునే తప్పు మాత్రం అస్సలు చేయకూడదు. ఒక స్త్రీ తన బలహీనతలను తన కంట్రోల్ లో ఉంచుకోవడం నేర్చుకున్న రోజే అవతలి వాళ్ళకు వాళ్ళ సరిహద్దులు గుర్తుచేసే కళలో సగం విజయం సాధించినట్లే ఎందుకంటే తమ బలహీనతలకు కాపలా పెట్టుకోగలిగిన వాళ్ళను ఈ ప్రపంచంలో ఎవ్వరూ మానసికంగా బానిసలుగా చేసుకోలేరు.
(10:50) ఇదే చాణక్యుడు రెండో అత్యంత పవర్ఫుల్ రూల్. ఫీలింగ్స్ కు మీరే యజమానురాలుగా ఉండండి. వాటిపై వేరొకరు ఆధిపత్యం చలాయించడానికి అస్సలు పర్మిషన్ ఇవ్వకండి. మూడో రూల్ అన్నిటికంటే ప్రమాదకరమైన రూల్ ఎవరికీ మళ్ళీ మళ్ళీ ఛాన్సులు ఇవ్వకండి. ఇప్పుడు ఒక చేదు నిజం వినడానికి రెడీగా ఉండండి. మీరు ఏ మనిషినైతే పదే పదే క్షమిస్తూ ఉంటారో ఆ మనిషే ఒక రోజు మిమ్మల్ని చాలా తేలిగ్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు.
(11:16) మొదటిసారి తప్పు చేస్తాడు మీరు సరేలే పాపం మనిషే కదా పొరపాటున జరిగిందిలే అనుకుంటారు. రెండోసారి కూడా అదే తప్పు రిపీట్ చేస్తాడు. మీరు బంధాన్ని కాపాడుకోవాలి కదా అని మీకు మీరే నచ్చ చెప్పుకుంటారు. కానీ మూడోసారి కూడా అదే ప్రవర్తన రిపీట్ అయిందంటే అది ఇక అతని పొరపాటు కాదు మీ బలహీనత. అతను మీ ఓర్పును సహనాన్ని ఒక అలవాటుగా పొరబడతాడు.
(11:40) సరిగ్గా ఇక్కడి నుంచే మీ లైఫ్ లో మీ విలువ పడిపోవడం మొదలవుతుంది. చాణక్యుడి ప్రిన్సిపుల్ చాలా క్లియర్ గా ఉంటుంది. ఎవరినైతే నువ్వు పదే పదే క్షమిస్తూ పోతావో వాడు నీ హద్దులను ఒక జోక్ అనుకోవడం స్టార్ట్ చేస్తాడు. ముఖ్యంగా ఆడవాళ్ళతో ఈ గేమ్ ఎక్కువగా ఆడతారు. ఎందుకంటే ఆడవాళ్ళు సర్దుకు పోవాలని ఇంటిని కాపాడుకోవాలని రిలేషన్ ని నిలబెట్టుకోవాలని సమాజం ఆశిస్తుంది.
(12:04) కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి బంధాన్ని నిలబెట్టుకోవడం వేరు మిమ్మల్ని మీరు తాకట్టు పెట్టుకోవడం వేరు. ఎవరైనా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీ ఎమోషన్స్ ని తొక్కి పడేస్తే పదే పదే మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే అప్పుడు మీరు వాళ్ళతో గొడవపడి వివరణలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. సింపుల్ గా వాళ్ళకు దూరం జరగాలి.
(12:26) ఈ దూరం అనేది అరుపులతో గొడవలతో రాకూడదు ప్రశాంతమైన మౌనంతో రావాలి. ఎలాంటి డ్రామా లేకుండా వాదనలు లేకుండా కోపం చూపించకుండా కేవలం ఒక్క అడుగు వెనక్కి వేయండి. వాళ్ళ మాటలకు మీరు ఇచ్చే రియాక్షన్స్ తగ్గించేయండి. ఎప్పుడూ వాళ్ళకు అందుబాటులో ఉండటం ఆపేయండి. ఎప్పుడూ ఈజీగా దొరికే మీరు ఇకపై వాళ్ళకు అంత తేలికగా దొరకకూడదు. మీలోని ఈ ప్రశాంతమైన మార్పు అవతలివాడి బుర్రలో అతి పెద్ద ప్రమాద గంటలను మోగిస్తుంది.
(12:54) ఇప్పటివరకు తనకున్న యక్సెస్ ఇప్పుడు పరిమితమైపోయిందని అతనికి మొదటిసారి అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి మన అందుబాటు పరిమితమైనప్పుడే ఎదుటివాడిలో గౌరవం మొదలవుతుంది. చాణక్య నీతి నేర్పేది ఒక్కటే మీ విలువ ఏంటో మీరే డిసైడ్ చేసుకోండి. మీరు అందరి మాటకి సరే అంటూ అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటే ఈ ప్రపంచం మిమ్మల్ని ఒక ఆప్షన్ అనుకుంటుంది కానీ ప్రయారిటీ అని అస్సలు అనుకోదు.
(13:20) అందుకే ఈ రోజు నుంచి మీ టైం ని ఖరీదైనదిగా చేయండి. మీ ఫీలింగ్స్ ని ఖరీదైనదిగా చేయండి. మీ ఉనికిని ఖరీదైనదిగా మార్చండి. మిమ్మల్ని కోల్పోతానని భయపడేవాడే మిమ్మల్ని పొందడానికి అసలైన అర్హుడు. దీంతో పాటు ఇంకో లోతైన పాయింట్ అర్థం చేసుకోండి. ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఒక పెద్ద ట్రాప్ అంచనాలు ఎంత ఎక్కువగా ఉంటే బాధ కూడా అంతే లోతుగా ఉంటుంది.
(13:45) ముఖ్యంగా బంధువులు స్నేహితుల విషయంలో మీరు ఎదుటి వాళ్ళ మీద అనవసరమైన ఆశలు వదిలేసిన రోజే నిజమైన ఫ్రీడమ్ సాధిస్తారు. మీరు వాళ్ళపై ఆశలు వదిలేసుకున్నాక వాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేసినా మీరు నవ్వేసి ఊరుకుంటారు. మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ దారిలో మీరు సైలెంట్ గా వెళ్ళిపోతారు. క్రమంగా ఆ వ్యక్తులు మీతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారు.
(14:08) ఎందుకంటే మీరు ఇకపై వాళ్ళ ఎమోషనల్ కంట్రోల్ లో లేరు అని వాళ్ళకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇదే రూల్ మీ ఆఫీస్ లో వర్క్ స్పేస్ లో కూడా అప్లై అవుతుంది. అందరికీ భజన చేసే మహిళకు ఎప్పుడూ నిజమైన గౌరవం దక్కదు. కానీ సైలెంట్ గా ఉండి తన పనితో సమాధానం చెప్పే వాళ్ళను రిజల్ట్స్ తో మాట్లాడే వాళ్ళను ఈ ప్రపంచం గుర్తించకుండా ఉండలేదు.
(14:30) తక్కువ మాట్లాడండి ప్రాపర్ గా వర్క్ చేసి చూపించండి. ఈ కామ్ గా ఉండే కాన్ఫిడెన్సే ఎదుటి వాళ్ళ మీద అతి పెద్ద ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. భార్యా భర్తల మధ్య గాని ఏ రిలేషన్ లో అయినా గుర్తుపెట్టుకోండి. సమానత్వం చాలా ముఖ్యం. ఒకరు తప్పులు చేస్తూ ఇంకొకరు పదే పదే భరిస్తూ ఉంటే అక్కడ ప్రేమ ఉండదు. అసమతుల్యత పుడుతుంది.
(14:52) ఆ బ్యాలెన్స్ తప్పడం అనేది ఎప్పుడూ ఎవరో ఒకరిని మానసికంగా కొంగదీస్తుంది. అందుకే మీ దగ్గర ఉండాల్సిన అత్యంత ప్రమాదకరమైన ఆయుధం లిమిటెడ్ ఛాన్సెస్ అందరికీ లెక్కలేనన్ని ఛాన్సులు ఇస్తూ పోకండి. మొదటి తప్పుకు క్లియర్ వార్నింగ్ రెండో తప్పుకు శాశ్వత దూరం అంతే మీ హద్దులను గౌరవించేవాడే మీతో ఉంటాడు. అర్థం చేసుకొని వాడు మీ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోవడమే మీ ఆరోగ్యానికి మంచిది.
(15:17) గుర్తుపెట్టుకోండి మీరు ఎంత అణగి ఉండడానికి సిద్ధంగా ఉంటారో ఈ ప్రపంచం మిమ్మల్ని అంతే అణచివేయడానికి చూస్తుంది. మీ హద్దులు ఏంటో స్పష్టం చేసిన రోజు మీరు అందుబాటులో ఉండే అవకాశాన్ని పరిమితం చేసిన రోజు ఎదుటి వాళ్ళ మీద ఆశలను కంట్రోల్ చేసుకున్న రోజు నుంచి జనాల అసలు రేంజ్ ఏంటో మీ ముందు తేటతెల్లమవుతుంది. ఇదే ఒక పవర్ఫుల్ ఉమెన్ అసలైన లక్షణం.
(15:41) ఆమె ప్రేమిస్తుంది కానీ తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి కాదు క్షమిస్తుంది కానీ తనను తాను తాకట్టు పెట్టుకుని కాదు అవకాశాలు ఇస్తుంది కానీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని వదులుకొని మాత్రం ఎప్పటికీ కాదు ఇదే చాణక్యుడి మూడో అన్నిటికంటే పవర్ఫుల్ ఎత్తు పరిమిత అవకాశాలు పరిమిత యాక్సెస్ అపరిమిత ఆత్మగౌరవం. నాలుగవ మరియు అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఎదురుదాడి ఇది ప్రతి స్త్రీ తప్పకుండా నేర్చుకోవాల్సిన ఒక గొప్ప కళ ఎందుకంటే ఈ ప్రపంచం తరచుగా చేతులతో కాదు మాటలతోనే గాయపరుస్తుంది.
(16:13) ఎవరైనా మీ సామర్థ్యాలను ప్రశ్నించినప్పుడు మిమ్మల్ని ఎగతాళి చేసినప్పుడు మీ సక్సెస్ ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు లేదా నీ వల్ల ఏమవుతుందిలే అని చిన్నచూపు చూసినప్పుడు అసలైన పరీక్ష మొదలవుతుంది. సాధారణంగా జనాలు వెంటనే కోపంలో రియాక్ట్ అవుతారు, పెద్ద పెద్ద వివరణలు ఇస్తారు, తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ఆరాటపడతారు. సరిగ్గా అక్కడే ఓడిపోతారు.
(16:35) కానీ చాణక్యుడి సూత్రం ఏం చెప్తుందో తెలుసా? నేరుగా దాడి చేయకు. ప్రశాంతంగా ఉంటూ ఎదురుడి చేయండి. ఎదురుదాడి అంటే ఏమిటి? గొంతు పెంచకుండా ఇచ్చే జవాబు. కానీ ఎదుటివాడి మైండ్సెట్ ని లోపల నుంచి కదిలించే దెబ్బ. ఉదాహరణకు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నీ వల్ల ఇది కాదులే అన్నారనుకోండి మీరు వాళ్ళతో వాదిస్తే వాళ్ళకు మీతో కొట్లాడే ఒక అవకాశం దొరుకుతుంది.
(16:59) కానీ మీరు చాలా ప్రశాంతంగా నవ్వుతూ మంచిదేలే అయితే నేను అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అని ఒక్క మాట చెప్తే ఆట అక్కడ రివర్స్ అయిపోతుంది. మీరు వాదించలేదు ఏ వివరణ ఇవ్వలేదు కానీ అతని పొగరును ఒక్క మాటతో అక్కడే చల్లార్చేశారు. ఒక పవర్ ఫుల్ ఆడదాని అతి పెద్ద ఆయుధం ఆమెలోని ప్రశాంతత. కోపాన్ని ప్రదర్శించడం చాలా ఈజీ. కానీ ప్రశాంతతను కాపాడుకోవడం చాలా కష్టం.
(17:25) ఏది కష్టమో అదే అత్యంత పవర్ఫుల్. చాణక్య నీతి నేర్పేది ఒక్కటే. ప్రశాంతమైన దెబ్బ అన్నిటికంటే లోతుగా తగులుతుంది. మీరు ప్రశాంతంగా ఉండి ఒక సీరియస్ జవాబు చెప్పినప్పుడు ఎదుటివాడు పైకి నవ్వొచ్చు. కానీ లోపల మీ రియాక్షన్ గురించి రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటాడు. ఈ మైండ్ ప్రెజరే మీ అసలైన విజయం గుర్తుపెట్టుకోండి వాళ్ళ మాటలు మిమ్మల్ని బాధ పెట్టాయని ఎవ్వరికీ అస్సలు తెలియనివ్వకండి కోపాన్ని బయట పెడితే ఎదుటివాడి మాటలు మీ మైండ్ లోకి వెళ్ళాయి అని వాడికి క్లూ ఇచ్చినట్టే అందుకే కోపంతో కాకుండా యాక్షన్ తో రెస్పాండ్ అవ్వండి.
(17:58) నిన్నటివరకు ప్రతిరోజు మీతో మాట్లాడే వ్యక్తికి ఇప్పుడు ప్రాధాన్యత తగ్గించేయండి. మీ అందుబాటును తేలిగ్గా తీసుకున్న వ్యక్తికి మీరు లేని ఆ లోటు స్పష్టంగా తెలిసేలా చేయండి. ఎలాంటి అనౌన్స్మెంట్లు లేకుండా ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ఈ నిశశబ్దమైన మార్పే ఎదుటివాడికి పడే అంతిమ ఎదురుదాడి ఇప్పుడు ఇంకో లోతైన పాయింట్ అర్థం చేసుకోండి.
(18:21) మీ రేంజ్ ని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళాలంటే జనాలు మిమ్మల్ని కింద నుంచి చూసేలా ఉండాలి. మీరు ప్రతి చిన్న విషయానికి జనాలతో పోట్లాడుతూ ఉంటే మీరు కూడా అదే లో క్లాస్ లెవెల్ లో ఇరుక్కుపోతారు. కానీ మీ ఫోకస్ మొత్తాన్ని మీ ఎదుగుదల మీద మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద మీ ఆత్మవిశ్వాసం మీద మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడం మీద పెట్టిన రోజు నుంచి అవతలి వాళ్ళకు వాళ్ళ స్థానం ఏంటో మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
(18:49) వాళ్లే తమ రేంజ్ ఏంటో తెలుసుకొని సర్దుకుంటారు. చాణక్యుడు ఒక మాట చెప్తాడు. అన్నిటికంటే గొప్ప గౌరవం భయం నుంచి పుడుతుంది. ఈమె చాలా సామర్థ్యం ఉన్నది. ఎవరి మీద ఆధారపడదు. చాలా ప్రశాంతంగా ఉంటూనే ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు అనే ఒక పాజిటివ్ భయం ఎదుటివాడికి ఉండాలి. తన కాళ్ళ మీద తాను నిలబడి కాన్ఫిడెంట్ గా ఉండే ఆడదాన్ని ఏ శక్తి ఎక్కువ కాలం అణచివేయలేదు.
(19:12) ఎందుకంటే జనాలు ఎవరితో ఆడుకుంటారో తెలుసా తమ సపోర్ట్ లేకపోతే ఏమి చేయలేరు అనుకునే వాళ్ళతోనే అదే తన కాళ్ళ మీద తాను సొంతంగా నిలబడే ఆడదానితో జనాలు చాలా జాగ్రత్తగా చూసి తూచి నడుస్తారు. అందుకే ఈరోజు ఒక గట్టి సంకల్పం తీసుకోండి. ఇకపై కోపంతో ఏదీ చేయరు. పక్కా ప్లానింగ్ తోనే సమాధానం చెప్తారు. ఎదుటివారు మిమ్మల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడినా అరిచి గెలవరు.
(19:36) ప్రశాంతమైన మౌనంతోనే వాళ్ళ నోళ్ళు మూయిస్తారు. ప్రతి అవమానాన్ని ఒక వాదనగా కాదు మీ ఎదుగుదలకు ఒక మెట్టుగా మార్చుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని మీరు ఎంత వాల్యుబుల్ గా మార్చుకుంటారంటే మిమ్మల్ని కోల్పోయే రిస్క్ తీసుకోవడానికి ఎవ్వరూ సాహసించకూడదు. ఇదే అసలైన ఉల్టా దెబ్బ. చెయి ఎత్తకుండా గొంతు పెంచకుండా ఎదుటివాడికి అతని హద్దు గుర్తు చేయడం.
(19:58) ఐదవ రూల్ మీ భావోద్వేగాలను మీ రహస్యంగా ఉంచండి. ఇప్పుడు ఈ పాఠంలో అన్నిటికంటే లోతైన అన్నిటికంటే పవర్ఫుల్ రూల్ అర్థం చేసుకోండి. సిస్టర్స్ ఎవరికీ నాకు నీ మీద చాలా కోపంగా ఉంది అని చెప్పకండి. అలాగే ఎవరికీ నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పకండి. వినడానికి ఇది కొంచెం కఠినంగా అనిపించవచ్చు.
(20:23) కానీ ఈ ఎమోషనల్ కంట్రోలే ఒక ఆడదాన్ని మానసికంగా ఎవ్వరూ జయించలేనంత పవర్ ఫుల్ గా మారుస్తుంది. వాళ్ళ మాటలు మిమ్మల్ని బాధించాయని మీరు బయటపడిన రోజే వాళ్ళు మిమ్మల్ని ఈజీగా కంట్రోల్ చేయగలరు అనే ఒక వీక్ పాయింట్ వాళ్ళకి దొరికిపోతుంది. అలాగే వాళ్ళు లేకుండా మీరు బతకలేరు అని ఏ రోజు చూపించేస్తారో ఆ రోజే మీ పవర్ మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నట్టు.
(20:45) చాణక్యుడి ప్రిన్సిపుల్ చాలా క్లియర్. మీ ఎమోషన్స్ ఎంత లోతైనవో గ్రహించిన మనిషే వాటిని పట్టుకుని మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. మీకు కోపం రావచ్చు ప్రేమ కలగొచ్చు ఆప్యాయత రావచ్చు కానీ వాటిని ఎప్పుడూ ఎంతవరకు బయట పెట్టాలనే డెసిషన్ మీదే అయి ఉండాలి కానీ ఎదుటివాడి ప్రవర్తన మీద ఆధారపడి ఉండకూడదు. మీరు ప్రతిసారి మీ కోపాన్ని బయట పెడితే ఏ మాటలు మిమ్మల్ని బాగా బాధ పెడతాయో ఎదుటివాడికి అర్థంయపోతుంది.
(21:14) అలాగే మీ ప్రేమను హద్దులు లేకుండా కురిపించేస్తే ఎదుటివాడు మీ అందుబాటును చాలా తేలిగ్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అందుకే మీ ఎమోషన్స్ ని చంపేసుకోమని చాణక్య నీతి చెప్పదు. వాటిని మీ లోపలే సేఫ్ గా ఒక ఆయుధంలా దాచుకోమని చెప్తుంది. పైకి మీ క్యారెక్టర్ చాలా ప్రశాంతంగా బ్యాలెన్స్డ్ గా ఒక మిస్టరీ లాగా ఉండాలి. ఎవరి మనసునైతే ఈజీగా చదివేయొచ్చో వాళ్ళను కంట్రోల్ చేయడం చాలా ఈజీ కానీ ఎవరి మనసైతే ఒక రహస్యంగా మారుతుందో ఎవరి ఫేస్ లో ప్రశాంతత ఉంటుందో ఎవరి కళ్ళలో ఎమోషన్ ఉంటుంది కానీ అశాంతి ఉండదో వాళ్ళని ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోలేని వాళ్ళను ఈ
(21:52) ప్రపంచంలో ఎవ్వరు ఓడించలేరు కూడా ఒక తెలివైన స్త్రీ తన ప్రేమను బలహీనతలా కాకుండా గౌరవంతో పంచుకుంటుంది. తన కోపాన్ని అరుపులుగా కాకుండా కాస్త దూరంగా ఉండి చూపిస్తుంది. ఆమె బాధపడితే రాద్దాంతం చేయదు తన బిహేవియర్ ని మార్చుకుంటుంది. ఆమె ప్రేమలో ఉంటే పిచ్చిదానిలా మారిపోదు తన సరిహద్దులను కాపాడుకుంటుంది. గుర్తుపెట్టుకోండి మీలోని ఆ చిన్న రహస్యమే ఒక అట్రాక్షన్ ని ఒక రెస్పెక్ట్ ని క్రియేట్ చేస్తుంది.
(22:20) పూర్తిగా దొరకని వాళ్ళ వెనుకే ఈ ప్రపంచం పరిగెడుతుంది. అందుకే ఈ రోజు నుండి మీ ఎమోషన్స్ కి మీరే బాస్ అవ్వండి. అది కోపమైన ప్రేమ అయినా వాటిని మీ బలాలుగా మార్చుకోండి గాని ప్రదర్శన వస్తువులుగా మార్చకండి. మీ మనసు ఒక సీక్రెట్ గా మారిన రోజు. మిమ్మల్ని తేలికగా తీసుకోవడానికి జనాలు భయపడతారు. ఆరవ రూల్. మీ లేకపోవడమే మీ అసలైన శక్తి. ఇప్పుడు వచ్చేది మరో పవర్ ఫుల్ ఆయుధం.
(22:45) అది శబ్దం లేకుండా నేరుగా ఎదుటివాడి మైండ్ మీద దెబ్బ కొడుతుంది. అదే మీరు అందుబాటులో లేకపోవడం ఎవరైనా మిమ్మల్ని తేలిగ్గా తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు మీరు అవైలబుల్ గా ఉండటాన్ని వాళ్ళ హక్కుగా భావించడం మొదలు పెట్టినప్పుడు మీకు ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వనప్పుడు అది వాళ్ళతో వాదించాల్సిన సమయం కాదు సైలెంట్ గా వెనక్కి తగ్గాల్సిన సమయం.
(23:06) ప్రతి యుద్ధాన్ని మాటలతో గెలవలేము. కొన్ని యుద్ధాలను దూరంతో మాత్రమే గెలవగలము. ఎవరైనా మీ ఇంపార్టెన్స్ ని మర్చిపోతుంటే నాకు వాల్యూ ఇవ్వు అని అడగకండి ఆ లోట ఏంటో వాళ్ళంతట వాళ్లే ఫీల్ అయ్యేలా చేయండి. వెంటనే ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం ఆపేయండి. ప్రతి మెసేజ్ కి మరుక్షణమే రిప్లై ఇవ్వడం తగ్గించండి. అన్ని చోట్ల అందరికీ ఫ్రీగా దొరకడం ఆపేయండి.
(23:29) మొదట్లో అతనికి ఏమి తేడా లేదులే అనిపించవచ్చు. కానీ కొద్ది రోజులకు లోపల చిన్న అశాంతి మొదలవుతుంది. ఆ తర్వాత ప్రశ్నలు వస్తాయి. అంతా బాగానే ఉందా ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నావు? ఇక్కడి నుంచే గేమ్ రివర్స్ అవుతుంది. మీరు పక్కన లేనప్పుడు ఎదుటివాడికి ఆ ఖాళీతనం అనిపించడం స్టార్ట్ అయిన రోజే అతనికి మీ అసలైన విలువ ఏంటో అర్థమవుతుంది. వాళ్ళు మీతో మాట్లాడటానికి వచ్చినప్పుడు ఫిర్యాదుల వర్షం కురిపించకండి ప్రశాంతమైన చిరునవ్వుతో ఏమీ లేదు అంతా బాగానే ఉంది.
(23:57) కొంచెం బిజీగా ఉన్నాను అంతే అని చెప్పేయండి. మీ ప్రపంచం వాళ్ళ చుట్టూ మాత్రమే తిరగడం లేదని ఈ ఒక్క మాట వాళ్ళకు స్పష్టంగా తెలియజేస్తుంది. చాణక్య నీతి నేర్పేది ఏంటంటే మీరు పక్కన లేకపోతే అసౌకర్యంగా ఫీల్ అయ్యే వ్యక్తి మీ ముందు ఎప్పుడూ పొగరుతో నిలబడలేడు. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మహిళ యొక్క అతి పెద్ద బలం ఇదే.
(24:19) ఆమె ఉనికి ఒక గిఫ్ట్ లా ఉండాలి గానీ ఒక అలవాటులా మారకూడదు. మీరు ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారని అనుకున్నంత కాలం మీ విలువ పడిపోతూనే ఉంటుంది. అదే మీరు అంత ఈజీగా దొరకరని మీ టైం చాలా విలువైనదని వాళ్ళకి అర్థమైనప్పుడు మీ గౌరవం ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఏడవ రూల్ ప్రజలతో వాళ్ళ లాంగ్వేజ్ లోనే మాట్లాడండి. ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేస్తే ఆ క్షణంలో కోపంతో రియాక్ట్ అవ్వకండి.
(24:44) ప్రశాంతంగా మౌనంగా ఉండండి. టైం ని మీ బెస్ట్ ఫ్రెండ్ గా మార్చుకోండి. ఉదాహరణకు నీ వల్ల ఆ పని కాదులే అని ఎవరైనా అన్నారనుకోండి ఆ క్షణంలో నవ్వి సైలెంట్ గా ముందుకు సాగండి. కానీ అదే వ్యక్తి ఒకరోజు హెల్ప్ కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఇలా చెప్పండి. బహుశా ఈ వర్క్ చేయడానికి మీరు వేరొకరిని పిలిస్తే బెటరేమో ఎందుకంటే నా వల్ల కాదు అని మీరే అన్నారు కదా ఈ ఆన్సర్ ఏదో గొడవ పడటానికి ఇచ్చింది కాదు వాళ్ళకు వాళ్ళ నిజరూపం చూపించే ఒక అద్దం.
(25:11) ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను అని రూడ్ గా మాట్లాడితే నవ్వి ఇలా చెప్పండి అందుకేగా నన్ను చూడగానే వెంటనే గుర్తుపట్టేశారు ఇది వ్యంగ్్యం కాదు మీలోని కాన్ఫిడెన్స్ ఆ తేడాను అర్థం చేసుకోండి. ఒక పవర్ఫుల్ ఉమెన్ ఎప్పుడూ రియాక్ట్ అవ్వదు. ప్రాపర్ స్ట్రాటజీతో రెస్పాండ్ అవుతుంది. చాణక్యుడు ఒక మాట చెప్తాడు మాటల కంటే ముందే కాలం, మౌనం దెబ్బ తీస్తాయి.
(25:36) కాబట్టి కోపంతో కాకుండా రెస్పెక్ట్ గా జవాబు చెప్పండి. మీ దూరం మీ లిమిటెడ్ అవైలబిలిటీ మీ ప్రశాంతమైన మాటలతో మీరు ఒక వాల్యూబుల్ పర్సన్ అని కేవలం ఒక ఆప్షన్ కాదని ప్రూవ్ చేయండి. నాలుగో ఆయుధం వారి అతి పెద్ద బలహీనతను వారి బలంగా మారనియకండి. వినండి ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా చదవగలిగే స్త్రీయే బలమైనది. ప్రతి వ్యక్తిలోనూ ఒక దాగి ఉన్న ఆకలి ఉంటుంది.
(26:00) కొందరికి ప్రశంసలు కావాలి కొందరికి మనీ కొందరికి ఈగో మరి కొందరికి మీ టైం అండ్ అటెన్షన్ కావాలి. తరచుగా ఆడవాళ్ళు తమకున్న సాఫ్ట్ హార్ట్ వల్ల హెల్పింగ్ నేచర్ వల్ల ఎదుటివాడి ఈ వీక్నెస్ ని నింపడం స్టార్ట్ చేస్తారు. పొగడతలిస్తే హెల్ప్ చేస్తే అన్ని వేళలా అవైలబుల్ గా ఉంటే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుందని పొరబడతారు.
(26:21) కానీ ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ వాళ్ళు దేనికైతే అలవాటు పడ్డారో అదే క్రమంగా వాళ్ళ స్ట్రెంత్ గా మారుతుంది. మీ వాల్యూ పడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడూ అందరి దగ్గర మంచిగా ఉండటం తెలివైన పని కాదని ఒక పవర్ఫుల్ ఉమెన్ అర్థం చేసుకోవాలి. ఒక మగవాడు లేదా వేరొకరు రెస్పెక్ట్ కోసం ఆరాటపడుతూ తమను తాము గ్రేట్ గా ఫీల్ అవుతుంటే వాళ్ళకు ఫేక్ కాంప్లిమెంట్స్ ఇవ్వకండి.
(26:43) ఎవరైనా డబ్బు కోసం అత్యాశ పడితే వాళ్ళ అవసరాలకు మీరు సపోర్ట్ గా నిలబడకండి. ఒకవేళ ఎవరైనా మీ అటెన్షన్ కోరుకుంటూ కంటిన్యూస్ గా కాల్స్ మెసేజ్లు చేస్తూ ఉంటే మీ టైం ని వాళ్ళకు ఈజీగా అలవాటు చేయకండి. గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళ వీక్నెస్సెస్ ని తీర్చడం ఆపేసిన రోజే వాళ్ళ కంట్రోల్ పోతుంది. వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయలేక ఫ్రస్ట్రేట్ అవుతారు.
(27:06) ఇదే నిజమైన పవర్ గొడవలు చేసి కాదు మీ లిమిట్స్ ని సెట్ చేసుకోవడం ద్వారా ఎదుటి వాళ్ళకు వాళ్ళ స్థాయి ఏంటో చూపించడం. ఒక తెలివైన స్త్రీ ఎదుటి వాళ్ళ వీక్నెస్సెస్ మీద అటాక్ చేయదు. ఆమె వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంది. ఈ కేర్లెస్ ఆటిట్యూడే ఎదుటి వ్యక్తిని లోపల నుంచి కదిలిస్తుంది. వారి ఎత్తుగడలు వారి దురాశ వాళ్ళ ఇగో మీ దగ్గర వర్కవుట్ అవ్వడం లేదని అర్థమైనప్పుడు వాళ్లే సైలెంట్ అయిపోతారు.
(27:30) చాణక్యుని సూత్రం చెబుతుంది. ఇతరుల బలహీనతలను రెచ్చగొట్టవద్దు. వాటిని మీకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని కూడా చూడవద్దు. వాటిని అలాగే వదిలేయండి. ఎందుకంటే వాళ్ళ బలహీనతే ఏదో ఒక రోజు వాళ్ళను వెనక్కి తగ్గేలా చేస్తుంది. కోపానికి లోను కాకుండా భావోద్వేగాలకు లొంగకుండా తన చుట్టూ ఉన్న పరిస్థితులను జ్ఞానం ఆత్మగౌరవం సరైన ఆలోచనతో ఎదుర్కునే స్త్రీకి ఇదే నిజమైన బలం మీరు ఈ ఆట్లో పర్ఫెక్ట్ అయ్యాక ఎవరితోనూ ఫైట్ చేయాల్సిన అవసరమే ఉండదు.
(28:00) మీ ప్రవర్తనను బట్టే జనాలు మీతో ఎలా ఉండాలో నేర్చుకుంటారు. ఐదో ఆయుధం అసంపూర్ణంగా ఇవ్వడం ఇప్పుడు ఐదో మరియు అత్యంత పవర్ఫుల్ ఆయుధం వస్తుంది. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఈ స్ట్రాటజీయే ఒక నార్మల్ ఉమెన్ ని మోస్ట్ ఇన్ఫ్లయెన్షియల్ గా మారుస్తుంది. రూల్ చాలా సింపుల్. జనాలు మీ నుంచి ఎక్కువగా ఏది కోరుకుంటున్నారో అది వాళ్ళకి ఇవ్వండి.
(28:23) కానీ వాళ్ళు ఫుల్ గా సాటిస్ఫై అయ్యేంతగా ఎప్పుడూ ఇవ్వకండి. ఎవరైనా మీ నుంచి చాలా లవ్ కోరుకుంటే లవ్ ఇవ్వండి కానీ మీరు వాళ్ళు లేకుండా బతకలేరు అని ఫిక్స్ అయ్యేంతగా కాదు ఎవరైనా మీ నుంచి రెస్పెక్ట్ కోరుకుంటే రెస్పెక్ట్ ఇవ్వండి కానీ వాళ్ళ ఈగో మిమ్మల్ని డామినేట్ చేసేంతగా కాదు ఎవరైనా మీ టైం కోరితే ఇవ్వండి కానీ ప్రతి సెకండ్ వాళ్ళకి అవైలబుల్ గా ఉండేలా కాదు గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా ఫుల్ గా దొరికే దేనికైనా వాల్యూ పోతుంది.
(28:50) కానీ కొంచెం కొంచెంగా లిమిటెడ్ గా దొరికే దాని మీదే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ప్రపంచంలోని చేదు నిజం ఇది. మనిషి ఎప్పుడూ తన చేతికి పూర్తిగా దొరకని దాని వెనుకే పరిగెడతాడు. మీరు మిమ్మల్ని పూర్తిగా ఎవరికైనా అప్పగించేసిన రోజే మీ ఇంపార్టెన్స్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఒక తెలివైన స్త్రీ తనను తాను ఎప్పుడూ పూర్తిగా అందుబాటులో ఉంచుకోదు.
(29:12) తన లైఫ్ లో తన డ్రీమ్స్ లో తన టైం అండ్ ఎనర్జీలో కొంత పార్ట్ ని కచ్చితంగా తన కోసమే దాచుకుంటుంది. ఈ చిన్న డిస్టెన్సే ఎదుటి వ్యక్తిని మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఇదే సీక్రెట్ ఇదే రియల్ అట్రాక్షన్ ఈ రూల్ కేవలం బయట వాళ్ళకే కాదు సొంత ఇంట్లో కూడా అంతే ముఖ్యం. ఒక స్త్రీ తన సొంత ఇంట్లో తనకంటూ కొన్ని సరిహద్దులు పెట్టుకోకపోతే క్రమంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆమెను లైట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు.
(29:36) మీ పేరెంట్స్ ని రెస్పెక్ట్ చేయండి కానీ మీ లైఫ్ డెసిషన్స్ మీరే తీసుకోండి. మీ పిల్లల్ని ప్రేమించండి కానీ వాళ్ళు మీ మాట విలువ మర్చిపోయేంతగా గారాభం చేయకండి. మీ హస్బెండ్ ని గౌరవించండి. కానీ ప్రతిదానికి ఎస్ చెప్తూ మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. ఒక స్ట్రాంగ్ ఉమెన్ ప్రేమిస్తుంది. కానీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని పణంగా పెట్టి కాదు.
(29:58) చాణక్యుడు సూత్రం ప్రకారం ఎవరినైతే మీరు పూర్తిగా సాటిస్ఫై చేయరో వాళ్లే ఎప్పుడూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. కానీ దీని అర్థం ఏదో మైండ్ గేమ్స్ ఆడటం కాదు ప్రాపర్ బాలెన్స్ మెయింటైన్ చేయడం ఎవరినో తహతహలాడించడానికి కాదు మీ ఐడెంటిటీ కేవలం ఎప్పుడూ అందుబాటులో ఉండే మనిషిలా మిగిలిపోకుండా ఉండటానికి ఇలా చేయాలి. మీకు మీకంటూ ఒక ప్రపంచం ఉండాలి.
(30:21) మీకంటూ కొన్ని ప్రయారిటీస్ మీకంటూ కొన్ని రూల్స్ ఉండాలి. ఒక్క నిమిషం ఆలోచించండి రేపు పొద్దున లేవగానే ఇక ఎవరు నన్ను తేలిగ్గా తీసుకోరు అని మీరు నిర్ణయించుకుంటే మీ నడక ఎలా ఉంటుంది మీ గొంతు ఎలా ఉంటుంది మీ కళ్ళలో ఎలాంటి మెరుపు ఉంటుంది నిజం ఇదే జనాలను వాళ్ళ స్థాయిలో ఉంచడం అంటే అహంకారం కాదు మీ గౌరవాన్ని కాపాడుకోవడం నవ్వుతూ ఎంత ప్రశాంతంగా మీ శక్తిని చూపించాలంటే ఎదుటివాడు మిమ్మల్ని పరీక్షించే ముందే జాగ్రత్త పడిపోవాలి.
(30:50) శక్తివంతమైన స్త్రీ అరిచి గెలవదు. తన వ్యక్తిత్వంతో ఎదుటివారికి తాను చిన్నవాడినన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ రోజు నుండి మీరు ఎమోషన్స్ పేరుతో జనాలు వాడుకునే సాధారణ స్త్రీ కాదు. ఈ రోజు నుండి మీ టైం కి లవ్ కి అటెన్షన్ కి చాలా వాల్యూ ఉంటుంది. మీ భుజాలను నిటారుగా ఉంచండి. చూపు నిటారుగా ఉంచండి. ఈ మాట మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి.
(31:14) నా హోదా, నా విలువ ఇకపై నా చేతుల్లోనే ఉన్నాయి. ఇతరుల మాటల్లో కాదు. ఇప్పటి వరకు మీరు మూడు ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకున్నారు. మీకంటూ ఒక హద్దు గీయడం దాన్ని దాటిన వారికి మౌనంగా వాళ్ళ స్థానాన్ని గుర్తు చేయడం మాట్లాడకుండానే జనాలకు మీ వాల్యూ ఏంటో తెలిసేలా చేయడం కానీ ఇప్పుడు ఒక సాధారణ ఆడదాన్ని ఒక తెలివైన శక్తిగా మార్చే అసలైన విషయం వస్తుంది.
(31:35) చాణక్యుడు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు. నిజమైన శక్తి బయటకు కనిపించదు. దాన్ని అనుభవించాలి అంతే అందుకే మొదటి నియమం మీ విజయం గురించి మీరే డప్పు కొట్టుకోకండి. దాని గాలి చుట్టూ ఉన్న వాళ్ళకు తగిలేలా చేయండి. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే సోషల్ మీడియాలో పెద్ద కథలు రాయకండి. మీ నడకలో ఆత్మవిశ్వాసం పెంచండి అంతే కొత్త కారు కొంటే ఊరంతా ప్రచారం చేయకండి ప్రశాంతంగా దానిలో బయటకు వెళ్ళండి.
(32:01) జనాలే అర్థం చేసుకుంటారు. మీరు అరిచి చెప్పనప్పుడు మీ విజయం ఒక రహస్యంగా మారుతుంది. ఆ రహస్యమే ఎదుటివారికి మీపై గౌరవాన్ని పెంచుతుంది. గుర్తుపెట్టుకోండి విజయాన్ని అరిచి చెప్పకండి దాని దెబ్బ జనాలకు తగిలేలా చేయండి. రెండో నియమం తక్కువ మాట్లాడండి కానీ ఎదుటివాడు ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకునేలా మాట్లాడండి ఒక విలువైన స్త్రీ ప్రతి చిన్న విషయానికి వివరణలు ఇస్తూ కూర్చోదు ఎవరైనా వచ్చి ఏం జరుగుతోంది అని అడిగితే ఒక చిన్న చిరునవ్వుతో అంతా మంచిగానే జరుగుతోంది అని చెప్పండి అంతే చాలు మీ మనసులోని మాటలను బయట పెట్టనప్పుడు మిమ్మల్ని ఎలా సరిగ్గా అంచనా వేయాలో తెలియక జనాలు భయపడతారు.
(32:39) ఎక్కువగా వాగే వాళ్ళకు విలువ ఉండదు ఆలోచించి తక్కువగా మాట్లాడే వాళ్ళే విలువైన వారు అవుతారు. మూడో నియమం జనాలకు వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకునేలా చేయడం ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే వెంటనే ఏడవడం లేక గొడవ పడటం చేసి మీ శక్తిని దండగ చేసుకోకండి. తర్వాత సారి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం అడిగినప్పుడు చాలా ప్రశాంతంగా గతంలో జరిగిన సంఘటన గుర్తుందా అని అడగండి.
(33:05) ఆ తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండండి. ఈ నిశ్శబ్దమే వాళ్ళను లోపల నుంచి కుదిపేస్తుంది. తమ తప్పులు తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ అలాంటి తప్పు చేసే ముందు 100 సార్లు ఆలోచిస్తారు. ఆరో నియమం మిమ్మల్ని ఎవరితోనూ పోల్చుకోకండి మీకంటూ ఒక సొంత గుర్తింపు తయారు చేసుకోండి. సిస్టర్స్ మిమ్మల్ని కిందకి లాగడానికి ఈ ప్రపంచం వాడే అతి పెద్ద ఆయుధం ఏంటో తెలుసా పోలిక.
(33:27) ఆమె నీకంటే అందంగా ఉంది. ఆమె ఎక్కువ సంపాదిస్తోంది. చూడు పెళ్లయ్యాక కూడా ఆమె ఎంత బాగా ఎదుగుతోందో ఈ మాటలు కేవలం మాటలు కావు మీ ఆత్మవిశ్వాసం పై చేసే దాడి మీరు వాటిని నిజమని నమ్మితే మీ కళ్ళల్లో మీరే తక్కువైపోతారు. గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు వేరే వాళ్ళ త్రాసులో తోచడం మొదలు పెట్టిన రోజే మీ ప్రత్యేకతను మీరు పోగొట్టుకున్నట్లే పోలిక అనేది మీలో తక్కువతనాన్నైనా తెస్తుంది లేదా తప్పుడు అహంకారాన్నైనా ఇస్తుంది.
(33:57) ఈ రెండు మీ మనశశాంతిని పాడు చేస్తాయి. తమ సొంత బలాన్ని గుర్తించిన వారు ఎప్పటికీ ఇతరుల నీడగా మారడానికి ప్రయత్నించరని చాణక్యుడు చెప్పాడు. ఒక శక్తివంతమైన స్త్రీ ఎవరికీ కాపీ కాదు. ఆమె ఒక ఒరిజినల్ ఎవరైనా మిమ్మల్ని వేరొకరితో పోల్చి తక్కువ చేయాలని చూస్తే గొడవ పడకండి. ప్రశాంతంగా ఇలా చెప్పండి. నేను వారిలా ఉండాలనుకోవడం లేదు నేను నాలాగే ఉంటే సరిపోతుంది అని చెప్పేయండి.
(34:23) ఈ ఒక్క మాటతో మీ గుర్తింపు ఎవరి దగ్గరో అప్పు తెచ్చుకున్నది కాదని ఎదుటివాడికి అర్థమైపోతుంది. మీ నడకను మీ గొంతును మీ ఆలోచనను మీరు గౌరవించినప్పుడు ఈ ప్రపంచం చెప్పే అభిప్రాయాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. గుర్తుపెట్టుకోండి ఇతరులతో పోల్చుకునే స్త్రీ భయపడుతూ బతుకుతుంది. కానీ తన సొంత గుర్తింపును ఏర్పరుచుకునే స్త్రీ ఈ ప్రపంచాన్నే నడిపిస్తుంది.
(34:44) ఏడో నియమం మీ మౌనాన్ని ఒక శిక్షగా మార్చడం నేర్చుకోండి. ప్రతి యుద్ధాన్ని కత్తితో గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని యుద్ధాలను ప్రశాంతంగా కూడా గెలవవచ్చు. ఎవరైనా మిమ్మల్ని పదే పదే రెచ్చగొడుతూ, ఎగతాళి చేస్తూ, మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తే మీ నుంచి కోపాన్ని రాబట్టడమే వాళ్ళ అసలు లక్ష్యం. ఎందుకంటే మీ కోపమే వాళ్ళకు బలం. మీరు ప్రతి మాటకు సమాధానం ఇస్తూ, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని చూస్తే వాళ్ళకు అనవసరమైన విలువ ఇస్తున్నట్లే కానీ మీరు దేనికి రియాక్ట్ అవ్వకూడదని నిర్ణయించుకున్న రోజు ఆట పూర్తిగా మారిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి
(35:19) చేస్తే మౌనంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే మెల్లగా నవ్వి ఊరుకోండి. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొడితే ఆ విషయాన్నే మార్చేయండి. మొదట్లో మీరు బలహీనురాలని వాళ్ళు అనుకుంటారు కానీ క్రమంగా వాళ్ళ మాటలు మీపై ఏమాత్రం పని చేయడం లేదని అర్థంవుతుంది. మిమ్మల్ని బాధ పెట్టడం తమ వల్ల కాదని తెలుసుకున్న రోజే వాళ్ళ ఆగడం ఆగిపోతుంది.
(35:43) గుర్తుంచుకోండి మీ మౌనం భయం కాదు అది మీ తెలివి తేటలు ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసిన ఆడదే అసలైన తెలివైనది. ఎందుకంటే ప్రతిదానికి రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎదుటివారి చేతుల్లో కీలు బొమ్మలుగా మారుతారు. తమ కోపాన్ని ఆపుకోగలిగే వాళ్లే తమ జీవితాన్ని తమ కంట్రోల్ లో ఉంచుకుంటారు. ఈ కళ మీరు నేర్చుకున్నాక ఎదుటివారిని వాళ్ళ పరిధిలో ఉంచడానికి మీరు గొంతు పెంచి అరిచే అవసరమే రాదు.
(36:09) మీ మౌనమే వాళ్ళకు వాళ్ళ స్థానాన్ని గుర్తుచేస్తుంది. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ ఆలోచనా విధానాన్ని కొద్దిగానైనా మార్చి ఒక మహిళ నిజమైన బలం ఆమె ఆత్మగౌరవం కాదు అని చెప్పడంలో ఆమె మౌనంలోనే ఉందని మీరు గ్రహించినట్లయితే ఈ ప్రయాణాన్ని ఇక్కడితో ఆపకండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడే ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.
(36:32) వీడియోను లైక్ చేయండి. అలాగే కామెంట్స్ లో నా విలువను నేనే నిర్ణయించుకుంటాను అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కేవలం మాటలు కాదు అది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం. ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటివరకు గుర్తుంచుకోండి మీరు బలహీనులు కారు మీరు చాలా శక్తివంతులు జై హింద్.

No comments:
Post a Comment