బతుకు భారం కాకముందే వినండి! ఆది శంకరాచార్యుల 20 ఆత్మజ్ఞాన సత్యాలు | శ్లోకాలతో...
Author Name:Shivatattva Vedham
Youtube Channel Url:https://www.youtube.com/@ShivatattvaVedham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-ID6o92CWT0
Title: బతుకు భారం కాకముందే వినండి! ఆది శంకరాచార్యుల 20 ఆత్మజ్ఞాన సత్యాలు | శ్లోకాలతో...
Author Name: Shivatattva Vedham
Description: బతుకు భారంగా అనిపిస్తోందా? మనసులో అశాంతి, భయం, బాధ, బంధాలపై మమకారం మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అయితే ఆది శంకరాచార్యుల అద్వైత వేదాంత బోధనల సారాన్ని తెలియజేసే ఈ 20 ఆత్మజ్ఞాన సత్యాలను శ్రద్ధగా వినండి.
ఈ వీడియోలో ఆది శంకరాచార్యుల వారికి ఆపాదించబడిన మరియు అద్వైత వేదాంత సంప్రదాయంలో ప్రసిద్ధి చెందిన శ్లోకాల ఆధారంగా, మనిషి నిజస్వరూపం ఏమిటి? మనసు, శరీరం, అహంకారం నుంచి ఆత్మను ఎలా భిన్నంగా అర్థం చేసుకోవాలి? నిజమైన శాంతి ఎక్కడ లభిస్తుంది? అనే లోతైన ఆధ్యాత్మిక ప్రశ్నలను పరిశీలిస్తాం.
🕉️ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ముఖ్యమైన విషయాలు:
• మనసు, బుద్ధి, అహంకారం కంటే అతీతమైన ఆత్మస్వరూపం
• శరీరం మరియు ఆత్మ మధ్య అద్వైత వేదాంతం వివరించే వ్యత్యాసం
• రాగద్వేషాలు, లోభం, మోహం, అహంకారం నుంచి అంతర్గత స్వేచ్ఛ
• సుఖదుఃఖాలను సాక్షిగా గమనించే ఆత్మజ్ఞాన దృష్టి
• బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా అనే అద్వైత భావన
• సంసారం, బంధాలు, ధనం, యవ్వనం యొక్క అశాశ్వతత్వం
• ఆత్మజ్ఞానం, వివేకం, మోక్షం యొక్క ప్రాముఖ్యత
• 'నేను ఎవరు?' అనే ప్రశ్న ద్వారా స్వస్వరూప విచారణ
📖 ఈ వీడియోలో ప్రస్తావించిన ఆధ్యాత్మిక గ్రంథాలు:
నిర్వాణ షట్కం, భజగోవిందం, వివేకచూడామణి మరియు అద్వైత వేదాంత సంప్రదాయంలోని ఇతర ప్రసిద్ధ బోధనలు.
ప్రతి శ్లోకానికి సరళమైన తెలుగు భావవివరణను అందిస్తూ, ప్రాచీన వేదాంత జ్ఞానాన్ని మన దైనందిన జీవితంలోని ఆలోచనలు, భయాలు, సంబంధాలు మరియు మానసిక ప్రశాంతతతో అనుసంధానించే ప్రయత్నం చేశాం.
🙏 మీకు ఈ ఆత్మజ్ఞాన బోధనలు నచ్చితే, మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. ఇలాంటి తెలుగు ఆధ్యాత్మిక, తాత్త్విక మరియు సనాతన ధర్మ సంబంధిత వీడియోల కోసం ShivaTattva Vedham ఛానల్‌ను Subscribe చేయండి.
🔔 ఆత్మజ్ఞానం, అద్వైత వేదాంతం, ఉపనిషత్తుల భావాలు మరియు భారతీయ ఆధ్యాత్మిక తత్వంపై మరిన్ని వీడియోల కోసం ఛానల్‌తో కలిసి ఉండండి.
సర్వే జనాః సుఖినో భవంతు 🙏
#ఆత్మజ్ఞానం #ఆదిశంకరాచార్యులు #అద్వైతవేదాంతం
ఆది శంకరాచార్యులు, ఆది శంకరాచార్యుల శ్లోకాలు, ఆది శంకరాచార్యుల బోధనలు, ఆత్మజ్ఞానం, ఆత్మ తత్వం, అద్వైత వేదాంతం, నిర్వాణ షట్కం, భజగోవిందం, వివేకచూడామణి, నేను ఎవరు, ఆత్మ విచారణ, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, శివోహం శివోహం, మోక్షం, ఆధ్యాత్మిక జ్ఞానం, తెలుగు ఆధ్యాత్మిక వీడియోలు, తెలుగు భక్తి వీడియోలు, వేదాంత జ్ఞానం, సనాతన ధర్మం, మనశ్శాంతి, జీవిత సత్యాలు, ఆధ్యాత్మిక ప్రేరణ, అహంకారం, మనసు నియంత్రణ, ఆత్మసాక్షాత్కారం, Self Realization Telugu, Adi Shankaracharya Teachings Telugu, Advaita Vedanta Telugu, Nirvana Shatakam Telugu, Bhaja Govindam Telugu, Vedanta Philosophy, Spiritual Wisdom Telugu, Telugu Spiritual Discourse, Hindu Philosophy, Non Duality, Self Inquiry, Shiva Tattva Vedham.
#ఆత్మజ్ఞానం #ఆదిశంకరాచార్యులు #అద్వైతవేదాంతం #నిర్వాణషట్కం #భజగోవిందం #వివేకచూడామణి #శివోహం #వేదాంతం #ఆధ్యాత్మికజ్ఞానం #సనాతనధర్మం #తెలుగుఆధ్యాత్మికం #మనశ్శాంతి #SelfRealization #AdvaitaVedanta #ShivaTattvaVedham #adi shankaracharya
Transcript:
(00:00) ఒక్క క్షణం ఆగి మిమ్మల్ని మీరు నిజాయితీగా ఒక ప్రశ్న అడగండి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు దేనికోసం పరిగెడుతున్నారు? డబ్బు కోసమా హోదా కోసమా నలుగురిలో గుర్తింపు కోసమా లేక బంధాలను నిలబెట్టుకోవడం కోసమా ఇవన్నీ సాధించిన రాత్రి పడుకునే ముందు మీ గుండెల్లో ఏదో తెలియని వెలితి అంతుచిక్కని అశాంతి ఒక రకమైన శూన్యత మిమ్మల్ని వెంటాడుతూనే ఉందా? మీరు పడుతున్న ప్రతి బాధకు మీ కళ్ళలో వచ్చే ప్రతి కన్నీటికి మీలోని ప్రతి భయానికి కారణం బయట ఉన్న ఈ ప్రపంచం కాదు.
(00:41) అసలు మీరెవరో మీకు తెలియకపోవడమే మీ అతి పెద్ద సమస్య ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ 20 కఠిన సత్యాలు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రచించిన నిర్వాణ శట్కం భజగోవిందం మరియు వివేక చూడామణి లాంటి ప్రామాణిక మహా గ్రంథాల నుంచి ఆయా మూల గ్రంథాలను స్వయంగా పరిశీలించి మన ప్రేక్షకుల కోసం స్పష్టంగా అనువదించి తీసుకోవడం జరిగింది.
(01:07) ఈరోజు మనం ఈ 20 శ్లోకాలు పూర్తయ్యేసరికి మిమ్మల్ని మీరు చూసుకునే కోణం పూర్తిగా మారిపోతుంది. మీలోని ఆత్మజ్ఞానం మేల్కొంటుంది. ప్రాపంచిక ఆలోచనలన్నింటిని పక్కన పెట్టి కొద్ది క్షణాల పాటు మీ మనసును పూర్తిగా ఈ శ్లోకాలపై లగ్నం చేసి శ్రద్ధగా వినండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్ నా తేజో న వాయుహు చిదానంద రూపః శివోహం శివోహం మనిషి ఎప్పుడూ తన మనసును తానే అని భ్రమ పడతాడు.
(01:49) కానీ శంకరాచార్యులు ఏమంటున్నారంటే నిరంతరం ఆలోచనలు పుట్టించే మనసు నువ్వు కాదు నిర్ణయాలు తీసుకునే బుద్ధి నువ్వు కాదు నాది నేను అనే అహంకారం నువ్వు కాదు బయట ప్రపంచాన్ని చూసే కళ్ళు వినే చెవులు ఇవేవి నువ్వు కాదు ఇవన్నీ కేవలం నీకు ఇవ్వబడిన పరికరాలు మాత్రమే కానీ వాటిని గమనిస్తున్న లోపలి చైతన్యం మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది.
(02:20) ఆ ప్రశాంతమైన ఆనందమయమైన చైతన్యమే నువ్వు నచ ప్రాణ సంయో నవై పంచవాయుహు నవా సప్తధాతుర్ నవా పంచకోషః నవాక్పాణిపాదం నచోపస్తపాయుహు చిదానంద రూపః శివోహం శివోహం మనం రోజూ అద్దంలో చూసుకుంటూ నా జుట్టు రాలిపోతోంది. నా చర్మం ముడతలు పడుతోంది. నేను లావుగా ఉన్నాను సన్నగా ఉన్నాను అని ఎంతగానో బాధపడిపోతుంటాం. కానీ నిజానికి ఈ భౌతిక శరీరానికి నీకు ఎలాంటి సంబంధం లేదు.
(02:58) ఈ చర్మాన్ని, మాంసాన్ని, ఎముకలను, లోపల తిరిగే ప్రాణ వాయువును నువ్వు కాదు. ఇవన్నీ ఒక అద్దె ఇండ్లు లాంటివి. నువ్వు ఆ ఇంట్లో ఉంటున్న అద్దెవాడివి మాత్రమే. ఇంటి గోడలు పగుళ్లిస్తే లోపల ఉన్న మనిషికి ఏమీ కాదు అలాగే వయసు పెరిగే కొద్దీ ఈ శరీరానికి రోగాలు వస్తాయి ముడతలు పడతాయి కానీ లోపల ఉన్న నీ ఆత్మకు ఎప్పటికీ వృద్ధాప్యం రాదు. ఆ శాశ్వతమైన అస్తిత్వమే నీ నిజ స్వరూపం నమే ద్వేష రాగౌ నమే లోభ మోహౌ మదో నైవమే నైవ మాత్సర్య భావః న ధర్మో నచ అర్థౌ న కామో నమోక్షః
(03:43) చిదానంద రూపః శివోహం శివోహం మన జీవితంలో సగం దుఃఖం ఒకరి మీద ఉన్న విపరీతమైన ప్రేమ వల్ల వల్ల వస్తుంది. మిగతా సగం మరొకరి మీద ఉన్న ద్వేషం వల్ల అత్యాశ కోపం అసూయ గర్వం ఇవన్నీ మనిషిని బానిసలను చేస్తాయి. కానీ ఆత్మస్థాయికి చేరుకున్న వ్యక్తికి ఎవరి మీద రాగ ద్వేషాలు ఉండవు. ఎందుకంటే తనకు ఎదురుగా ఉన్న వ్యక్తిలోనూ తనలోనూ ఉన్నది ఒకటే చైతన్యం అని అతనికి తెలుసు.
(04:21) నీకు నువ్వే ద్వేషించుకోలేవు కదా అలాగే ఎదుటి వ్యక్తిని కూడా ద్వేషించలేవు. ఈ ఆత్మజ్ఞానం కలిగిన క్షణాన నీ మనసులోని భారం మొత్తం దిగిపోయి నువ్వు అత్యంత స్వేచ్ఛను అనుభవిస్తావు. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదాన యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం నభోక్త చిదానంద రూపః శివోహం శివోహం సమాజం మనల్ని ఇది చేస్తే పాపం అది చేస్తే పుణ్యం అంటూ ఎప్పుడూ ఒక భయంతో బతికేలా చేస్తుంది. ఈ పాప పుణ్యాల లెక్కలు సుఖ
(05:06) దుఃఖాలు కేవలం అహంకారంతో కూడిన మనసుకే కానీ నీలోని ఆత్మకు అంటవు ఆకాశంలో నల్లటి మబ్బులు వచ్చినా తెల్లటి మబ్బులు వచ్చినా ఆకాశానికి ఏమైనా రంగు అంటుకుంటుందా లేదు అలాగే నీ జీవితంలో జరిగే మంచి చెడు అనేవి నీ శరీరానికి మనసుకే పరిమితం. నువ్వు వాటిని అనుభవించే వాడివి కాదు కేవలం గమనించే వాడివి మాత్రమే ఆ నిజాన్ని తెలుసుకున్న వాడికి ఎలాంటి మంత్రాలు యజ్ఞాలతో పనిలేదు.
(05:41) నమృత్యుర్ నశంక నమే జాతి భేదః పితా నైవమే నైవ మాతా నజన్మ న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః చిదానంద రూపః శివోహం శివోహం మనిషిని రాత్రింబవళ్ళు వెన్నంటే అతి పెద్ద భయం మరణం నేను చనిపోతానేమో నా వాళ్ళను వదిలి వెళ్ళిపోతానేమో అని ప్రతి క్షణం మదన పడతాడు. కానీ ఇక్కడ శంకరాచార్యులు బల్ల గుద్ది చెబుతున్నారు. నీకు మరణమే లేదు నువ్వు చనిపోతావు అనుకోవడం ఒక అజ్ఞానం.
(06:20) నువ్వు ధరించిన ఈ శరీరం నాశనం అవుతుంది. కానీ నువ్వు కాదు కులం, మతం బంధువులు, మిత్రులు ఇవన్నీ నువ్వు పుట్టిన తర్వాత సమాజం నీకు తగిలించిన గుర్తింపులు మాత్రమే నిద్రలేస్తే కల ఎలాగైతే చెదిరిపోతుందో ఈ శరీరపు స్పృహ దాటితే ఈ బంధాలన్నీ ఒక భ్రమ అని నీకు అర్థమవుతుంది. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియానాం నచా సంగతం నైవ ముక్తిర్ నమేయః చిదానంద రూపః శివోహం శివోహం నువ్వు అనుకుంటున్నట్లుగా
(07:05) నీ ఉనికి ఈ శరీరానికి మనసుకు మాత్రమే పరిమితం కాదు శరీరంలో మార్పులు వస్తాయి. మనసులో ఆలోచనలు మారుతుంటాయి. కానీ అద్వైత వేదాంతం ప్రకారం వీటన్నింటిని తెలుసుకునే చైతన్యమే నీ అసలైన స్వరూపం మనం మనల్ని ఒక పరిధిలో బంధించేసుకుంటాం. కానీ నీ అస్తిత్వానికి ఆకారం లేదు నువ్వు ఒక చిన్న కుండలో బంధించబడిన ఆకాశం లాంటి వాడివి కుండ పగిలిపోయిన క్షణాన లోపలి ఆకాశం బయటి ఆకాశం అంతా ఒక్కటే అని తెలుస్తుంది. అలాగే నీలోని అహంకారం అనే
(07:55) కుండ బద్దలైనప్పుడు నువ్వు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న అనంతమైన చైతన్యవానివ నీకు సాక్షాత్కారం కలుగుతుంది. దేహో దేహ బృతాం తుపుంసమ విద్వత్ కల్పితః కల్పితః విద్వాంస స్ఫురదంతహత్మని మహాతేజస్వధామాత్మని ఎవరైనా నిన్ను తిట్టినప్పుడు లేదా అవమానించినప్పుడు నీకు ఎందుకంత కోపం వస్తుంది ఎందుకు రోజులు తరబడి కుమిలిపోతావు ఎందుకంటే ఆ తిట్టబడిన శరీరం ఆ పేరు నాదే అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎవరైనా మీ వాహనాన్ని డీ కొడితే దెబ్బ తగిలింది మీ వాహనానికే కానీ
(08:40) మీకు కాదు కదా అలాగే ఒక వివేకవంతుడు తన శరీరాన్ని ఒక కారులాగా భావిస్తాడు. అవమానం జరిగినా దెబ్బ తగిలినా అది తన శరీరానికే తప్ప తనలోని ఆత్మకు జరగలేదని ప్రశాంతంగా ఉండిపోతాడు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అనేన వేద్యం సత్శాస్త్రం ఇతి వేదాంత డిమః ఈ ప్రపంచంలో ప్రతిదీ మారుతూనే ఉంటుంది. నిన్న ఉన్న పరిస్థితి ఇవాళ లేదు ఇవాళ ఉన్న మనుషులు రేపు ఉండరు.
(09:16) ఏది స్థిరంగా ఉండదో అది సత్యం ఎలా అవుతుంది? అందుకే ఈ జగత్తంతా మిత్య అని చెప్పారు శంకరులు అదొక మాయాజాలం సత్యమైనది కేవలం ఒక్కటే అది అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మ పదార్థం అందులోని ఒక చిన్న భాగం నువ్వు ఆ విశ్వ చైతన్యానికి నీలో ఉన్న ఆత్మకు ఎలాంటి తేడా లేదు. సంసారం స్వప్న తుల్యూహి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సత్య సద్భవేత్ నిద్రపోతున్నప్పుడు ఒక భయంకరమైన కల వస్తుంది.
(09:56) కలలో ఒక క్రూర మృగం నిన్ను తరుముతుంటుంది. అప్పుడు నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా చెమటలు పడతాయి భయంతో అరుస్తావు. కలలో ఉన్నంతసేపు అది 100 శాతం నిజం కానీ మెలకువ రాగానే ఏమవుతుంది ఒక్కసారిగా భయం పోయి ఇదంతా కల అని ఊపిరి పీల్చుకుంటావు. ఆత్మజ్ఞానుల దృష్టిలో నువ్వు పగలు కళ్ళు తెరచి అనుభవిస్తున్న ఈ జీవితం కూడా అలాంటి పగటి కలే జ్ఞానోదయం అని మెలకువ వచ్చిన మరుక్షణం నువ్వు పడుతున్న కష్టాలు పోరాటాలు అన్నీ అబద్ధమని తేలిపోతాయి.
(10:34) ఆత్మాతు సతతం ప్రాప్తో అప్రాప్తవద విదజ్యయ తన్నాసే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా మనిషి తనకు ప్రశాంతత కావాలని కొండలు గుట్టలు ఆశ్రమాలు ఎక్కుతుంటాడు. కానీ ఇది ఎలాంటిది అంటే మెడలోనే బంగారు గొలుసు వేసుకొని అది ఎక్కడ పడిపోయిందో అని రోజంతా ఇల్లంతా వెతికినట్లు ఆ గొలుసు ఎక్కడికి పోలేదు. నీ మెడలోనే ఉంది. అలాగే నీకు కావాల్సిన ఆనందం శాంతి ముక్తి ఇవన్నీ ఎక్కడి నుంచో తెచ్చుకునేవి కావు అవి ఎప్పుడూ నీలోనే ఉన్నాయి.
(11:10) కానీ అజ్ఞానం అనే పొర నీ కళ్ళను కప్పేయడం వల్ల శాంతి ఎక్కడో బయట ఉందని పరిగెడుతున్నావు. ఆ పొర తొలగితే ఆ ఆనందం నీలోనే దొరుకుతుంది. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాత్ మోక్షైక సాధనం పాకస్య వహనివజ్ఞానం వినా మోక్షహో నసిద్యతి నువ్వు వంట చేయాలనుకున్నావు బియ్యం తెచ్చావు కూరగాయలు కోసావు నీళ్లు పోసి పాత్రను పొయ్యి మీద పెట్టావు కానీ కింద మంట వెలిగించకపోతే అవన్నీ వంట అవుతాయా ఎన్ని జన్మలు చూసినా కావు ఆధ్యాత్మికత కూడా అంతే నువ్వు ఎన్ని దానాలు చేసినా ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఎన్ని గ్రంథాలు చదివినా లోపల జ్ఞానం అనే అగ్ని వెలగకపోతే
(11:59) నీకెప్పటికీ శాంతి దొరకదు. గృడ్డిగా ఆచారాలు పాటిస్తే లాభం లేదు. నిన్ను నువ్వు ప్రశ్నించుకొని నిజాన్ని తెలుసుకున్నప్పుడే అసలైన మోక్షం యథా దీపో నిరాలంబో దీప్యతే స్వయమేవహి తథాత్మ స్వయమే వాసౌ భాసతే సర్వతేజసా బయట గాలి విపరీతంగా వీస్తున్నప్పుడు దీపం అటు ఇటు కదులుతూ ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటుంది.
(12:34) కానీ తలుపులన్నీ మూసేసి గాలి లేని చోట పెడితే ఆ దీపం ఎవరి అండా లేకుండా నిశ్చలంగా వెలుగుతుంది. మన మనసు కూడా అంతే బయట ప్రపంచం ఇచ్చే ఒత్తిళ్లుు ఆలోచనలు అనే గాలి వల్ల మనసు ఎప్పుడూ ఆందోళనగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నీ ఆలోచనలను ఆపేసి లోపలికి ప్రయాణిస్తావో అప్పుడు నీ ఆత్మ అనే దీపం స్వయంగా అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతుంది. దానికి ఎవరి గుర్తింపు అవసరం లేదు అజ్ఞాన సర్పదష్టస్య బ్రహ్మజ్ఞాన ఔషధం విన కిము వేదైశ్చ శాస్త్రైశ్చ కిము మంత్రైస్చ కిమ ఔషధైహి ఒక మనిషిని విషనాగు కాటేసింది అతను గిలగిల
(13:22) కొట్టుకుంటున్నాడు. అప్పుడు అతని పక్కన కూర్చుని మోటివేషన్ క్లాసులు చెబితే బతుకుతాడా లేదా గొప్ప గొప్ప వేద మంత్రాలు చదివితే బతుకుతాడా బతకడు వాడికి కావాల్సింది పాము విషానికి విరుగుడు మందు మనందరిని అజ్ఞానం అనే పాము ఎప్పుడో కాటేసింది. అందుకే ఈ భయాలు ఈ కన్నీళ్లు వీటికి బయట దొరికే ఏ తాత్కాలిక సంతోషాలు మందు కాదు.
(13:53) నేనెవరు అని తెలుసుకునే ఆత్మజ్ఞానం మాత్రమే నలిని దళగత జలం అతి తరలం తద్వజీవితం అతిశయ చపలం విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం సోకహతంచ సమస్తం ఒకసారి తామర ఆకు మీద ఉన్న నీటి బుట్టును గమనించండి. చిన్న గాలి వీచిన అది క్షణంలో జారి నీళ్లల్లో కలిసిపోతుంది. మన జీవితం కూడా సరిగ్గా అలాంటిదే మనం రేపు ఇల్లు కొనాలి తర్వాత కారు కొనాలి అని పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకుంటాం.
(14:29) కానీ మరుసటి క్షణం ఏం జరుగుతుందో మన చేతిలో ఉందా? లేదు ఏ క్షణంలో ఈ ప్రాణం పోతుందో తెలియని జీవితం కోసం ఎందుకంత అహంకారంతో పగలతో బతుకుతున్నావ్? జీవితం చాలా చిన్నది ఏది శాశ్వతం కాదని నిజాన్ని ప్రతిక్షణం గుర్తుపెట్టుకుంటే ఏ కష్టము నిన్ను కృంగదీయదు కాతే కాంత కస్తే పుత్రః సంసారోయం అతీవ విచిత్రః కస్యత్వం కః కుత ఆయాత తత్వం చింతయతదిహబ్రాత నిన్నటిదాకా పరిచయం లేనివా వాళ్ళు పెళ్లి అనే పేరుతో నీ ప్రాణంగా మారిపోతారు.
(15:17) నీ కడుపున పుట్టిన పిల్లలు నీ లోకంగా మారిపోతారు. వాళ్ళకు చిన్న దెబ్బ తగిలిన నీ ప్రాణం విలవిలలాడిపోతుంది. కానీ ఆలోచించు వాళ్ళు నీకు ఎలా సొంతం నువ్వు ఒంటరిగా వచ్చావు ఒంటరిగానే పోతావు. మధ్యలో కలిసిన ఈ బంధాలన్నీ ప్రయాణంలో రైలు పెట్టలో కలిసిన సహచరుల లాంటివి స్టేషన్ రాగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే బంధాలను ప్రేమించు కానీ వాటికి బానిస అయిపోయి నీ అస్తిత్వాన్ని పోగొట్టుకోకు మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం మాయామయమిదం మఖిలం
(16:04) హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిష విధిత్వ నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసి భయపడే వాళ్ళు ఉన్నారు. నాకున్న అధికారం ముందు ఎవరైనా తలవంచాల్సిందే నా అందానికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే ఇలాంటి గర్వంతో విర్రవీగే వాళ్ళను చూసి కాలం నవ్వుకుంటుంది. ఎందుకంటే మహా మహా చక్రవర్తులు ప్రపంచాన్ని శాసించిన కోటీశ్వరులు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు.
(16:32) కాలం నీ ధనాన్ని నీ యవ్వనాన్ని ఒక్క క్షణంలో లాగేసుకోగలదు. దేన్నైతే కాలం నాశనం చేయగలదో అది ఎప్పటికీ నీది కాదు అందుకే ఈ తాత్కాలిక బ్రమల వెనుక పరిగెట్టడం ఆపేసి కాలం కూడా తాకలేని నీ ఆత్మశక్తిని చేరుకో శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అతః ప్రయత్న జ్ఞాతవ్యం తత్వజ్ఞేహి తత్వమాత్మనః ఈ రోజుల్లో మనక ఎటు చూసినా ఇన్ఫర్మేషనే వందల కొద్దీ పుస్తకాలు వేల కొద్దీ వీడియోలు ఎవరికీ తోచిన సలహాలు వాళ్ళు చెప్తూనే ఉంటారు.
(17:16) ఇదంతా ఒక శబ్దాల అడవి లాంటిది. ఇందులో దారి తప్పితే నీ మనసు మరింత గందరగోళానికి గురవుతుంది. నిజంఏంటంటే కేవలం పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం రాదు. బయట వాళ్ళు చెప్పేది వినడం ఆపేసి నీ అంతరంగాన్ని నువ్వు మౌనంగా పరిశీలించుకో నీ జీవితానికి కావలసిన అసలైన జవాబులన్నీ నీ లోపలి నిశశబ్దంలోనే దొరుకుతాయి. దేహేంద్రియ ప్రాణ మనోహం కృతిభ్యో విలక్షణం పాప పుణ్యాది శూన్యం చిదానంద రూపం శివోహం శివోహం నువ్వు ధరించే బట్టలు మాసిపోతే వాటిని ఉతికి ఆరేస్తావు అంతే తప్ప నేను
(18:02) మాసిపోయాను అని ఏడవు కదా అలాగే ఈ శరీరం ఈ మనసు ఈ అహంకారం అన్నీ నువ్వు నువ్వు వేసుకున్న దుస్తుల లాంటివి వాటికంటే నువ్వు పూర్తిగా భిన్నమైన వాడివి ఈ శరీరానికి జరిగే అవమానాలు కష్టాలు నీ చైతన్యాన్ని ఏమాత్రం తాకలేవు నల్లటి మేఘాలు సూర్యుని కాసేపు కప్పగలవు కానీ సూర్యుడు వెలుగును నాశనం చేయలేవు. అలాగే నీ జ్ఞానం ముందు నీ కష్టాలన్నీ చిన్న మేఘాలు మాత్రమే అహం సర్వసాక్షి బోధ స్వరూపః చివరిగా నువ్వు తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క సత్యం నేను సాక్షిని
(18:49) నీ జీవితంలో ప్రతిరోజు ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. నీ శరీరానికి బాల్యం వచ్చింది యవ్వనం వచ్చింది వృద్ధాప్యం వస్తుంది నువ్వు గమనిస్తున్నావు నీ మనసులో సంతోషం వస్తుంది కోపం వస్తుంది వాటిని కూడా నువ్వు గమనిస్తున్నావు ఇవన్నీ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి కానీ ఇవన్నీ గమనిస్తున్న నువ్వు మాత్రం మారలేదు ఆ మారకుండా స్థిరంగా చూస్తున్న ఆ సాక్షే నీ నిజ స్వరూపం ఆ సాక్షి స్థానంలో ఉండి జీవితాన్ని చూస్తే ఏది నిన్ను బాధ పెట్టలేదు ద్రగ్ దృశ్యౌ ద్వౌ పదార్థౌస్తః పరస్పరం విలక్షణౌ దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి సర్వ వేదాంత
(19:38) దిండిమః చూసేవాడు నువ్వు చూడబడేది ప్రపంచం ఈ రెండు పూర్తిగా వేరు వేరు నువ్వు నీ చేతిని చూస్తున్నావు కాబట్టి నువ్వు చేయి కాదు నువ్వు నీ కోపాన్ని గమనిస్తున్నావు కాబట్టి నువ్వు కోపం కాదు అలాగే నువ్వు నీ ఆలోచనలను కూడా చూస్తున్నావు అంటే నువ్వు ఆలోచనలవి కూడా కాదు మరి నువ్వుఎవరు ఆ గమనించే దృష్టివే నువ్వు నిన్ను చూస్తున్న దృశ్యం నుంచి వేరు చేసుకున్న మరుక్షణం నీ కష్టాలన్నీ ఆ దృశ్యానికి సంబంధించినవే అని అర్థమైపోయి నువ్వు నువ్వు పరిపూర్ణమైన
(20:23) విముక్తిని పొందుతావు. ఈ 20 సత్యాలు విన్న తర్వాత కూడా రేపు ఉదయం లేవగానే మళ్ళీ పాత జీవితంలోకే వెళ్ళిపోతాం. మళ్ళీ ఆఫీస టెన్షన్లు అప్పుల బాధలు పక్కన ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారు అనే భయాలు మిమ్మల్ని చుట్టూ ముడతాయి. కానీ ఈసారి ఒక చిన్న మార్పు చేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు జీవితంలో ఏదో కోల్పోయామనే విపరీతమైన భయం వేసినప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని మీకు మీరే చెప్పుకోండి.
(20:54) ఇది కేవలం నా అహంకారానికి జరుగుతోంది. ఈ నాటకాన్ని గమనిస్తున్న నాలోని ఆత్మకు ఏమీ కాలేదు. నేను కేవలం ఒక సాక్షిని మాత్రమే అని అప్పుడు చూడండి మీలో ఎంతటి నిశశబ్దం ప్రశాంతత వస్తుందో బయట ప్రపంచం మిమ్మల్ని ఎంత కదిలించాలని చూసినా మీరు సముద్రం లాగా పైకి మాత్రమే అల్లకల్లోలంగా కనిపిస్తూ లోపల మాత్రం అత్యంత ప్రశాంతంగా స్థిరంగా ఉండిపోతారు. ఆదిశంకరాచార్యులు ఎప్పుడో అందించిన ఈ ఆత్మజ్ఞానం మనందరికీ ఒక మహా ఆయుధం లాంటిది.
(21:29) మీకోసం చాలా పరిశోధన చేసి ఎన్నో శ్లోకాలను ఎంపిక చేసి వాటిలో మన జీవితానికి ఉపయోగపడే కొన్నింటిని మాత్రమే ఎంపిక చేసి మీకు అందించడం జరిగింది. మీకు ఖచ్చితంగా ఇవి మీ జీవితంలో తోడుపడతాయి అనే భావన మీకు కలిగితే ఖచ్చితంగా మీ అభిప్రాయాలను వ్యాఖ్యలో తెలియజేయండి. ఈ ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ మీ జీవితాన్ని మరింత ప్రశాంతంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
(21:55) మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ సర్వేజనా సుఖినో భవంతు

No comments:
Post a Comment