శరణాగతి
భక్తియోగంలో శరణాగతి వల్ల భక్తుడికి అన్ని భయాలూ తొలగిపోతాయని నమ్ముతారు. అర్ధరాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఏదో పీడకల వచ్చి పిల్లవాడికి చాలా భయమేస్తూ ఉంటుంది. అందరూ నిద్రిస్తూ ఉంటారు. మెల్లిగా వెళ్లి నాన్న పక్కన పడుకుంటాడు వాడు. ఇక ఏ దుష్టశక్తులూ తననేమీ చేయలేవనే ధైర్యం హాయిగా నిద్ర పుచ్చుతుంది. తండ్రి ఉన్నాడన్న ఆ భావమే శరణాగతి.
భగవదనుగ్రహానికి ఆళ్వారులు శరణాగతి మార్గాన్నే ప్రబోధించారు. వేదాంత దేశికులు శరణాగతిని వివరిస్తూ తరచూ ఒక కథ చెప్పేవారు. చూడామణి అనే శ్రీకృష్ణ భక్తురాలు తన కొడుకును ఒక గురువు వద్ద చదువు కోసం కొద్ది దూరంలోని నాచికురిచి అనే ఊరికి పంపేందుకు నిర్ణయించుకుంది. మధ్యలో చిట్టడవి దాటాలి. అడవిలో భయం వేస్తుందమ్మా అన్నాడు. తల్లి ధైర్యం చెబుతూ భయం వేయగానే బిగ్గరగా కృష్ణా... మాధవా అని పలుకుతూ ముందుకు నడు. సాయంత్రం తిరిగివచ్చే ముందు అడవిలోకి రాగానే పిలువు. అందువల్ల దైవం అపాయం రాకుండా కాపాడతాడని చెప్పింది. తల్లిలోని కృష్ణభక్తి సహజంగా ఆ పిల్లవాడికి అబ్బింది. గురుకులానికి వెళ్తున్న తొలి రోజు అడవిలోకి రాగానే చూడామణి చెప్పినట్లే కృష్ణా... అంటూ ఆర్తితో పిలిచాడు. రెండడుగులు వేయగానే ఒక దారు వృక్షం పక్కనుంచి పదేళ్ళ అబ్బాయి వచ్చి, ‘భయపడుతున్నావా... గురుకులం దాకా నేను తోడు వస్తా పద!’ అంటూ దారిలో కథలు చెప్పాడు. ‘నీవు తిరిగి వెళ్ళేటప్పుడు నన్ను పిలువు. నేను మీ ఊరి దాకా వచ్చి దింపుతాను’ అని అభయం ఇచ్చాడు. గురుకులానికి ధైర్యంగా వెళ్ళి వస్తున్న కొడుకును గమనించిన చూడామణి, అడవిలో భయం వేయలేదా నాన్నా అని ప్రశ్నించింది. ఆ పిల్లవాడు బదులిస్తూ... నీవు చెప్పినట్లే భయం వేసినప్పుడు బిగ్గరగా ‘కృష్ణా’ అని పిలిచానని, వెంటనే చెట్టు వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి నన్ను గురుకులంలో దింపి తిరిగి సాయంత్రం మన ఊరి వెలుపలకు చేర్చి వెళ్తున్నాడని చెప్పాడు. చూడామణికి అర్థమైంది. తన కొడుకును సంరక్షిస్తున్నవాడు శ్రీకృష్ణుడని. ఇదే కదా శరణాగతి అంటూ వేదాంత దేశికులు భక్తులకు వివరించేవారట.
==============================

No comments:
Post a Comment