Friday, October 2, 2020

మంచి మాటలు

 

మంగళవారం --: 18-08-2020 :--

నేటి AVB మంచి మాటలు

జీవితం ఎప్పుడూ సవాళ్ళనే విసురుతుంది దానిని ఎదుర్కోని నిలిచివారే విజేత అవుతారు . జీవితంలో బోలెదన్ని సంబంధాలు అక్కరలేదు ఉన్న కొన్ని సంబంధాల్లో జీవం ఉంటే చాలు జీవం లేని ఎన్ని బంధాలున్నా ఒకటే లేకపోయినా ఒకటే నేస్తమా ! .

మనలో రోజు రోజుకీీ మనుషులంటే భయం వేస్తోంది , మోసం చేస్తారని కాదు . ఎక్కడ కరోనా తగిలిస్తారోనని . కావున అందరూ జాగ్రత్త వహించాలి , అందరూ బాగుండాలి అందులో మన మందరం మరీ బాగుండాలి ! .

నీవు గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి , ఎత్తిచూపే వేళ్ళుంటాయి , వ్యంగంగా మాట్లాడే నోళ్ళుంటాయి , బెదిరావో నీవు గమ్యం చేరలేవు , సాగిపో నిరంతరంగా పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు . నీ కష్టం ఎప్పుడూ వృధా పోదు .

కొన్ని సార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో కొన్ని సార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి ఎందుకంటే నవ్వించేవారి కంటే నవ్వులపాలు చేసేవారు ఎక్కువ ఈ లోకంలో . కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి ఎందుకంటే ఓదార్చే వారికంటే ఏ మార్చేవారే ఎక్కువ ఈ లోకంలో .

సేకరణ 🖋️AVB సుబ్బారావు 🕉️🤝💐

Source - Whatsapp Message

No comments:

Post a Comment