Friday, October 2, 2020

నిష్కామ భక్తి

🌸నిష్కామ భక్తి🌸

🍃🍂🍃🍂🍃🍂🍃

ఒకసారి ఓ గురువు గారు గ్రామాంతరం వెళ్తూ తన శిష్యునికి ఒక బొమ్మ కృష్ణుని ఇచ్చి తాను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని చెప్పారు.

సరేనన్నాడు శిష్యుడు.

మరుక్షణం నుంచి ఆ బొమ్మను ముద్దులాడుతూ ఉయ్యాలలో వేసి ఊపుతూ, ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, చాలా బాగా చూసుకున్నాడు,

పొద్దున సాయంత్రం బొమ్మ కృష్ణుడి కోసం అరిసెలు అప్పాలు సున్నుండలు మీగడ వెన్న తెచ్చే వాడు.

'తిను కన్నయ్య' అని బతిమిలాడే వాడు...

కానీ కన్నయ్య తింటేనా!!!

శిష్యుడికి ఏం చేయాలో తోచక దిగులు పడి కూర్చునేవాడు.

నివేదన చేయడం అనేది మన భక్తికి సూచనగా చేసి క్రియే గాని దేవుడు నిజంగా వచ్చే తినడు. పారవశ్యంలో ఈ చిన్న విషయం కూడా శిస్యుని బుద్ధికి తట్టలేదు.

బొమ్మని గుండెల్లో పొదుపు కుంటూ సందిట్లో దోచుకుంటూ.. "కన్నయ్య నన్ను కన్న తండ్రి! ఈ ఒక్క సున్నుండ తినరా తీయ తీయని ఈ మీగడ నీకోసమే తెచ్చాను రా" అని బ్రతిమిలాడుతున్నా ..
కృష్ణయ్య ఉలక లేదు పలకలేదు ..కనీసం ఒక్క అప్పమైనా తినలేదు.

దాంతో శిష్యునికి కోపం వచ్చింది విసవిసా లేచి వెళ్లి బెత్తం ఒకటి పట్టుకొచ్చి తింటావా నాలుగు తగిలించి ఉంటావా అని బెదిరించాడు.

బొమ్మ కృష్ణుడు భయంతో వణికిపోయాడు బుద్ధిగా వచ్చి అప్పాలు అరిసెలు అన్ని ఆరగించాడు.

ఇక శిష్యుడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

అతని కళ్ళు ఆనంద ఆశ్రువులతో నిండి పోయాయాయి.

కృష్ణయ్యను కౌగిలించుకొని సతమతమై పోయాడు.

అప్పటికి అతను అన్నము తిని మూడు రోజులైంది లేచి వెళ్లి గబగబా రెండు ముద్దలు తిన్నాడు.

తిన్నాక పొలం వైపు నడిచాడు గడిచిన మూడు రోజులుగా అతనికి కృష్ణయ్యను బ్రతిమిలాడడానికే సరిపోయే. ...

పొలం చేయడానికి వెళ్లింది ఎక్కడ. పొలం పనులు చేసుకున్నది ఎక్కడ? మనసులో పోగు పడ్డ ఆలోచనల చిక్కు తీసుకుంటూ వచ్చేసరికి పొలం గట్టు దగ్గర ఉన్నాడతను.

తన పొలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. పొలం గట్లన్నీ తీర్చినట్టు వున్నాయి. పని చేసి పొలమంతా మడులు చేసి నీరు పెట్టినట్టు ఉంది.

అది కలో లేక వైష్ణవమాయయో అర్థం కాలేదు. ఊహించడానికి శక్తి కూడా చాలలేదు.

ఆనందం తో కళ్ళు మూతలు పడ్డాయి కళ్ళ ముందు తన చేతిలో ఉన్న బెత్తాన్ని చూసి భయపడి అరిసెలు అప్పాలు అన్ని ఒకేసారి నోట్లో కుక్కుకుంటూ వున్న కృష్ణయ్య దర్శనమిచ్చాడు.

అప్రయత్నంగా చేతులు జోడించి దండం పెట్టాడు.

నిష్కామ భక్తికి నిర్మల భక్తి కి ఉన్న శక్తి అది.

" నా భక్తులు నాకు పూర్తిగా సొంతం కావాలి నాకు అంకితం కావాలి. వారి హృదయాలను స్వచ్ఛంగా పరిశుభ్రంగా చేసుకుని అందులో నన్ను మాత్రం ప్రతిష్టించుకోవాలి నన్ను మాత్రమే కొలవాలి " అని గీతలో కృష్ణుడు అర్జునుడితో అంటాడు.

శాస్త్రాలు చదవడం వల్ల, జ్ఞానం వల్ల కూడా భక్తి అలవడదు.

ఎవరైనా భక్తులు కావాలంటే వాళ్ళు వాళ్ళ సర్వస్వాన్ని విడిచిపెట్టాలి, చివరికి జ్ఞానాన్ని కూడా వదులుకోవాలి అది రహస్యం.

భగవంతుడు నుంచి వేరు చేసే అగాధాలు కొన్ని ఉన్నాయి అవి సిగ్గు, అహంకారం, బిడియం, కోపం వంటివి మనిషి మనసుని దేవుడి మీద నిలవ నీయకుండా అంధకారంలోకి నెట్టివేస్తుంది.
కాబట్టి వీటి విషయం లో చాలా జాగరూకత తో ఉండాలి..

🍃🍂🍃🍂🍃🍂🍃

Source - Whatsapp Message

No comments:

Post a Comment