Saturday, October 3, 2020

ఆచార్య సద్భోదన - బాహ్యమైన వస్తుసంపదలు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు.

ఆచార్య సద్భోదన

మనకు అనేక వస్తువులు దొరుకుతూ ఉంటాయి కానీ కోరినది దొరకదు. ఒకవేళ అనుకున్నది దొరికినా, అప్పటికి ఆ వస్తువు మీద ఉండే కోరిక మరొక వస్తువు మీదకి మరలి ఉంటుంది.

చాలామంది వారి కోరికల నిజతత్త్వాన్ని తెలుసుకోలేక ప్రాపంచిక విషయాల వెంట పరుగెడుతుంటారు. నిజానికి ఎన్నడూ మార్పుచెందనిది, శాశ్వాతమైనది మాత్రమే యథార్థమైన సంతృప్తిని ఇవ్వగలదు.

ప్రాపంచికమైన కోరికలను తీర్చుకోవడం ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలని గాని, పొందగలమని గాని భావించేవారు తమను తాము మోసగించుకుంటున్నారు.

కోరికలు తీరకపోవడం వల్ల కలిగిన లోటు వారి పరిస్థితిని మరింత దుర్భరం చేస్తుంది. బాహ్యమైన వస్తువులలోనూ, స్త్రీ-పురుషుల భౌతిక శరీరాలలోనూ సుఖసంతోషాల కోసం వెతుకుతారు.

కానీ నిజమైన ఆనందం మనలోనే ఉంది. ఆ ఆనందమే మన యధార్థ స్వరూప స్వభావమై ఉంది. బాహ్యమైన వస్తుసంపదలు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు. ఒకవేళ ఎంతోకొంత సంతోషాన్ని ఇచ్చినా అది లిప్తపాటులో మాయమౌతుంది.

శుభంభూయాత్

Source - Whatsapp Message

No comments:

Post a Comment