Tuesday, July 13, 2021

మంచి మాట..లు

శుక్రః
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ॥

సరస్వతీ శ్లోకః
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥

యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా ।
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ।
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా ।
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ।

లక్ష్మీ శ్లోకః
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం ।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ॥

దుర్గా దేవీ స్తోత్రం
సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే ।
భయేభ్యస్తాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే ॥

త్రిపురసుందరీ స్తోత్రం
ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం ।
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీం ॥

దేవీ శ్లోకః
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ॥

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. శ్రీ గాయత్రీ సరస్వతి దుర్గ అష్ట లక్ష్మి అమ్మవార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందం గా జీవించాలని కోరుకుంటూ.. మీ కష్టమే మీకు లాభం మీకు అప్పనంగా ఏదైనా రావాలంటే ఇంకొకరు పోగొట్టుకుంటేనే నీకు వస్తుంది. దానితోపాటుగా వారి పాప కర్మలు కూడా మీకు వస్తాయి అని గమనించండి

శుక్రవారం --: 09-07-2021 :--
నేటి AVB మంచి మాట..లు
పంటలు బాగా పండి రైతన్నలు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని కొరుకుంటూ రైతన్నలందరికి రైతు దినోత్సవ శుభాకాంక్షలు .

తండ్రి ఆస్తిని పంచుకోవటం కాదు . తండ్రి సంపాదించిపెడితే డబ్బును పొందటం కాదు తండ్రే ఆశయాన్ని కూడా పంచుకోవాలి .

జీవితంలో నిశబ్దం చీకటి నెర్పే పాఠం చాలా లోతైనది ఎందుకంటే నిశబ్దం ఎప్పుడు నిజాన్ని చెప్పుంది . చీకటి నీ అనుకున్న మనుషుల నిజస్వరూపాన్ని చూపుతుంది .

మనం మాత్రమే ఎదుగాలి అనుకున్నప్పుడు మనం పడిపొతే పట్టుకోవడానికి ఎవ్వరు ఉండరు మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవాలని పది చేతులు వస్తాయి .

సేకరణ *✒️మీ ఆత్మీయ బంధువు.. AVB సుబ్బారావు ... 9985255805

Source - Whatsapp Message

No comments:

Post a Comment