Saturday, January 1, 2022

మంచి మాటలు

ఆత్మీయ బంధుమిత్రులకు శనివారపు మరియు దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు.. లక్ష్మి పద్మావతి సమేత శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు తిరుత్తని వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వారు మా ఇంటి దైవం వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు పూజ్య దత్తాత్రేయ స్వామి వార్ల అనుగ్రహం తో మీకు మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మీకు ఎంత ఉన్నప్పటికీ ఆనందం సంతోషం లేకపోతె ఎంత ఉన్నా ఎవరు ఉన్నా ఉపయోగం లేదు.. ఏమి లేకపోయినా ఆనందం సంతోషం తోడుంటే అన్ని ఉన్నట్లే.. అన్నిటికి మూలం తృప్తి.. తృప్తి అనేది ఒకటి ఉంటే చాలు ఆనందం వెంట వస్తుంది 🤝
శని వారం --: 18-12-2021 :--

ఎదురు పడితే పలకరించే వారు ఎందరో ఉంటారు కానీ ప్రతిరోజూ మనల్ని గుర్తు పెట్టుకొని పలకరించే వారు కొందరే ఉంటారు



ధనవంతుడు కావాలన్నా పేదజీవిగా మిగలాలన్నా నిర్ణయించేది యవ్వనమే ఈ దశలో జీవితాన్ని ఎలా , మలచుకోవలెనో అది నీచేతిలోనే ఉంది టైం పాస్ కి చేసే కొన్నివేల స్నేహాలకన్నా నీ గురించి ఆరాటపడే మంచి స్నేహం ఒక్కటి చాలు ,

జీవితం ఎలాంటి దంటే
అర్ధం కాని వయస్సులో ఆనందాన్నిస్తుంది అన్నీ అర్ధమయ్యే వయస్సులో కన్నీళ్లు తెప్పిస్తుంది దేవుడు ఆలస్యం చేసినా మంచే చేస్తాడు , ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి ఓపికతో ఎదురుచూడు ! .

కొన్నిసార్లు ఒక విషయాన్ని
నిరూపించడం కంటే మౌనం మరింత శక్తివంతమైనది మరికొన్ని సార్లు మౌనంగా ఉండటం కంటే మాట్లాడటం చాలా ప్రభావంతంగా ఉంటుంది ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలియడమే పరివక్వత నేస్తమా ! .

సేకరణ ✒️
మీ ...ఆత్మీయుడు.. AVB సుబ్బారావు 🤝🌹💐

సేకరణ

No comments:

Post a Comment