Saturday, January 1, 2022

మంచి మాట..లు

ఆత్మీయ బంధుమిత్రులకు రవి వారపు శుభోదయ శుభాకాంక్షలు.మీకు మీ కుటుంబసభ్యులకు ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుని మరియు మా ఇంటి దైవం శ్రీ గుంటి అంహనేయస్వామి వారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ.. అందరిని నవ్వుతూ పలకరిద్దాం. పోయేదేముంది.. నవ్వుతో మన మొహం ఇంకా అందముగా కనిపిస్తుంది అంతేగా 😊
ఈ రోజు AVB మంచి మాట..లు

ఆదివారం --: 19-12-2021
నీ జీవితం
సాఫిగా నడుస్తున్నంత కాలం హాయిగానే ఉంటుంది కానీ మన జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వాటిని నీకు అనుకూలంగా మార్చుకున్నప్పుడే నువ్వేంతో అందరికీ తెలుస్తుంది .

ఒకరిని
కలవటానికి విడిపోవటానికి చూపించే తొందర ఆలోచించటానికి వాళ్ళనీ అర్థం చేసుకోవటానికి చూపిస్తే ప్రతి బంధం కూడా అనందంగానే ఉంటుంది .

ప్రేమ లేని మనిషి ఈ ప్రపంచంలో ఉండరు గాయం లేని గతంకూడా ఎవరికీ ఉండదు ఇవి రెండూ లేనిదే మన జీవితమే ఉండదు జీవితంలోజరిగిన మధురమైన సంఘటనలు మర్చిపోతే కానీ బతకలేం కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేం అలలకు అలసట ఉండదు ఆశలకు హద్దు ఉండదు ఇదే జీవితం .

మనిషి ఎలాంటి వాడంటే .
పక్కవాడు బాగుపడుతుంటే పైకి
ప్రేమ నటిస్తూ , లోపల ఈర్ష్యతో రగిలిపోతారు . అదే ఒకడు నాశనం అవుతుంటే , లోపల సంతోషిస్తూ బైట బాధగా నటిస్తాడు . ప్రపంచమే రంగస్థలం మనుషులే మహానటులు అని ఊరికే అనలేదు మహానుభావులు .

సేకరణ ✒️
మీ .ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝9985255805🙏

సేకరణ

No comments:

Post a Comment