Sunday, June 5, 2022

ఓ మానవాళి.....నేను అనే స్పృహ వద్దు

🌷🌷🌷🎯🎯🎯
ఓ మానవాళి.....నేను అనే స్పృహ వద్దు

ఈ లోకంలో నీ వేంతా.....

మనమందరం ఎక్కడో ఒక దగ్గర
మనకు తెలియకుండానే
పతనమవుచున్నాంమనకు మనమే ఏదో
తెలియని ఊహల్లో పొదుగుచున్నాము
నేను అనే లోకంలో ఒదుగుచున్నాము

అందుకే అహం అనే ఓ బలమైన
కంచె చుట్టూ పాతుకున్నాం
మన వ్యక్తిత్వాన్ని కొలమానంతో కొలుచుకుంటున్నాంమన మస్తిష్కంలో బలంగా పాతేసుకున్నాం
నేను అనే ఓ పరిణామ సిద్ధాంతమనే ఓ పరిపుష్టిని నింపుకున్నాం

అంతా నాకే తెలుసు అనే
ఓ అపరిచిత భావాన్ని చుట్టేసుకున్నాం
ఈ రెండు మనల్ని
పట్టేసి కట్టేసుకున్నాయి
వీటికి లొంగిపోయి నిత్యం
వాద వివాదాలమధ్య
కొట్టుమిట్టాడుచున్నాం

ఎంత సామాజిక జ్ఞానంతో తలపండినా
మానవలోకాన్ని మరిచిపోవద్దు
కొందరికి చిరాకు చికాకు తెప్పిస్తుంది
అందుకే ఈ బానిసత్వాన్ని వదిలించుకోవాలి
లేకపోతే మన స్థితిగతులు
గతి తప్పుతాయి

ఓ అద్భుత ఆత్మీయ
ప్రపంచాన్ని కోల్పోతాం
సంక్షోభాల మధ్య సమిసి పోతాం
నిజమైన మానవీయతకు దూరమవుతాం

గుప్పెడు మనసులో
గంపెడు అహం ను నింపుకున్నాం
అవార్డులు అధికారాలు కాదు
వ్యక్తిత్వాన్ని నిలబెట్టేవి
మానవ సంబంధాలు
ఆత్మీయ అనుబంధాల కలయికనే
మన ఉన్నత విలువలకు నిజమైన విలువ

అందుకే నిన్నటి తరంలో
నేర్చుకున్న విలువలను
నేటితరానికి అందించి
ఆదర్శంగా నిలవాలి
అప్పుడే మన నడవడిని పెంచుతుంది

ఇప్పుడిప్పుడే విచ్చుకొంటున్న
స్నేహ పరిమళాల్ని ఆస్వాదించాలి
మనమందరం సంఘ జీవులం
అందరితో జతకట్టి
ఆత్మీయతను పెంచుకోవడం
నేను అనే దారిని వదిలితే
సర్వమానవలోకానికి
సౌమ్యంగా దగ్గరకావచ్చు

వీక్షించే కళ్ళు విభజించే మనసు
స్పర్శించే హృదయం
మన ఆధీనంలో ఉంటే
తృప్తినిపరిచే మానవసౌందర్యాన్ని
దర్శించ వచ్చు...
నేను అనే స్పృహ వదిలితే
అహం అనే తత్వాన్ని విడిచితే
ఓ ఉజ్వల భవిష్యత్తుకు దారి ఉంది
అందరూ మనచుట్టూ
ఆత్మీయంగా అల్లుకుపోతారు
🙏🙏🙏🙏

సేకరణ

No comments:

Post a Comment