🔺 పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు🔺
మొదటి పిరమిడ్ జ్ఞాన నవరత్నం ,, ఆత్మ యే
భగవంతుడు .
శరీరములో ఉన్న ఆత్మ యే భగవంతుడు, విగ్రహాలు, ఫోటోలు, భగవంతుడు కాదు. .దేవుడు ఎక్కడో ఉన్నాడు.... నేను ప్రార్థించాలి... వాడు వేరే ఆత్మ వేరే...అని భావించడం అజ్ఞానం. ఆత్మ యే భగవంతుడు అని నమ్మాలి. విగ్రహం కేవలం విగ్రహమే అన్న అవగాహన ఉండాలి. శరీరంలో కనబడని ఆత్మని ఆరాధించడానికి బదులు విగ్రహాల
సంప్రదాయం వచ్చింది. సత్యం ఏమిటంటే ప్రతి జీవిలో ఉన్న ఆత్మయే దేవుడు.విగ్రహం దేవుడు కాదు. అవసరాలకోసం ,కోరికలు తీర్చుకోవడం కోసం , అభద్రతా ఉన్న మనిషి ఆధ్యాత్మికత రూపంలో విగ్రహాలను సృష్టించాడు. తనలో ఉన్న ఆత్మను మరిచాడు.శిలలను చూసి
శివుడని
భావింతురు,శిలలు శిలలే కానీ శివుడు కాదు. తన లోని ఆత్మ ఆరాధనే,.
భగవదారాధన....,.అర్ధం అయినా కాకపోయినా ఇదే సత్యం. ......ఆత్మ ఆరాధించడం
అంటే, వెంకటేశ్వర స్వామి లాగా, గౌతమ బుద్ధుడు లాగా, సాయిబాబా లాగా , రమణ మహర్షి లాగా ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఆ విగ్రహాలను ,ఫోటోలను, దేవుడు అనుకుంటున్నావు అంటే ఇంకా సత్యం తెలుసుకో లేదు అని అర్థం. ఏం పర్వాలేదు...... ఈ జన్మ కాకపోతే...... ఎన్ని జన్మలకైనా తెలుసుకోక తప్పదు. తిరుమలలో కొండలలో, వందలసంవత్సరాలుగా ,ధ్యానం చేస్తున్న ,మహా యోగి వెంకటేశ్వర స్వామి.అంతే గాని... విగ్రహం వెంకటేశ్వరస్వామి కాదు. వెంకటేశ్వర స్వామి ఏమి చేస్తున్నారో మనం కూడా అది చేస్తేనే ఆ స్వామికి కి ఇష్టం . అన్నమయ్య ,వెంకటేశ్వర స్వామి భక్తులు, ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అన్నారుగా ,ఇది మానవులు తెలుసుకోవాలి ఆత్మఆరాధన, భగవంతుని ఆరాధన. ఆత్మ సాక్షాత్కారము భగవత్సాక్షాత్కారం. భగవంతుని సేవించడానికి , బాహ్యంగా ఏమీ చేయనవసరం లేదు.. కానీ కానీ సత్యం తెలియనివాళ్లు బాహ్య పూజలకు ప్రాముఖ్యత ఇస్తారు .ఇది పిరమిడ్ మొదటి జ్ఞాన నవరత్నం . ఆత్మయే భగవంతుడు .👏👏👏
Saturday, June 11, 2022
మొదటి పిరమిడ్ జ్ఞాన నవరత్నం ,, ఆత్మ యే భగవంతుడు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment