Thursday, June 9, 2022

ప్రస్తుత పరిస్తితి - సౌదీ అరేబియా దేశంలో ఒక హిందువు,ఒక ముస్లిం మధ్య TV లో చిన్న చర్చ

 సౌదీ అరేబియా దేశంలో ఒక హిందువు,ఒక ముస్లిం మధ్య TV లో చిన్న చర్చ జరుగుతోంది.ముస్లిం వ్యక్తి హిందువుతో "మీ శ్రీరాముడు సీతాదేవిని అడవుల్లో వదిలివేసాడు కదా.ఎవడో చెప్పిన మాటను విని ఇలా భార్యను అడవుల్లో వదిలివేయడం ఏమిటి? ఇలా చేసిన రాముడు మీకు ఆదర్శ పురుషుడు ఎలా అవుతాడు?" అని ముస్లిం వ్యక్తి ప్రశ్నిస్తే అక్కడ ఉన్న హిందువుకు రామాయణం గురించి ఏమాత్రం పరిజ్ణానం ఉన్నా వివరణ ఇస్తాడు.

        అలాకాక "మా రామున్ని ఇలా అంటావా.నిన్ను హత్య చేస్తాం.దేశం నుండి బహిష్కరిస్తాం.నోటి దురుసుతో, పొగరుబోతు తనంతో ఇలా మాట్లాడి మా మతాన్ని,దేవున్ని అవమానించావు.నీ అంతు తేలుస్తాం.మీ దేశంలో మా మతం మీద దాడులు ఎక్కువయ్యాయి.నువ్వు ఇలా మాట్లాడడానికి కారణం మీ ప్రభుత్వమే.మీ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడడం లేదు.మా హిందువుల మీద దాడులు చేస్తుంది.మీ వస్తువులు మేం కొనం. బేషరతుగా మాకు క్షమాపణలు చెప్పాలి.ప్రభుత్వం ఆ ముస్లిం వ్యక్తిని అరెష్ట్ చేసి,జైల్లో పెట్టాలి."

        అంటే ఎలా ఉంటుంది..వాడికేమైనా (హిందువుకు) పిచ్చా అనిపిస్తుంది కదూ.ఇప్పుడు ముస్లిం ప్లేస్ లో నుపుర్ శర్మను, హిందువు ప్లేస్ లో సమర్థుడైన మోడీని పదవినుంచి దించడానికి గోతికాడ నక్కల్లాగ కాచుకు కూర్చున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, వారిని ఆకాశానికి ఎత్తడం కోసం ఎంతకైనా దిగజారిపోయే E-Tv,ABN,Tv-5,NTv,Tv- 9 వంటి కొన్ని టీవీ ఛానళ్లను,కొన్ని ముస్లిం సంస్థలను,కొన్ని ముస్లిం దేశాలను ఊహించుకోండి.అదే ఇప్పుడు జరుగుతున్నది.ఇంతకూ నుపుర్ శర్మ ఏమన్నదో తెలుసా?


      "మహమ్మద్ ప్రవక్త 8 సంవత్సరాల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు.అవునా,కాదా?" అంది.ఈ విషయం ఖురాన్ లోనే ఉంది.గూగుల్ లో కూడా ఉంది.అందువల్ల ఖురాన్ ను బేన్ చేస్తారా? గూగుల్ ను బహిష్కరిస్తారా?


       నుపుర్ శర్మ ఏం మాట్లాడింది అనే విషయం చాలామంది హిందువులకు,ముస్లింలకు కూడా తెలియదు.ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు,వాళ్ల మతం మీద లేనిపోని నిందలు వేస్తున్నట్టు,వాళ్ళ మతస్తులను అణిచివేస్తున్నట్టు,మోడీని దించడం కోసం గొడవలు సృష్టించి,కుట్రపన్నడం కోసం ఈ సీన్ బాగా క్రియేట్ చేసారు.బాగా అబ్జర్వ్ చేసారా...ఏ ఒక్క టీవీ ఛానల్లోనూ నుపుర్ శర్మ ఏమి మాట్లాడింది అనేది చెప్పడం లేదు.ఇక్కడే మనకు క్లియర్ గా తెలుస్తోంది ఆ వెధవలు ఫేక్ ప్రచారం చేస్తున్నారని.జరిగింది ఇదని ఎవడైనా అడిగితే చెప్పండి.కొన్ని రోజుల పాటు నుపుర్ శర్మను బాగా సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్.

       ఇక రెండో విషయం.మోడీ ఆమెను సస్పెండ్ చేయడం.రాజకీయంగా మోడీ నిర్ణయం కరెక్టే.ఈ పనిచేసి ఈ దేశంలోనూ,ఇతర దేశాలలోనూ ఉన్న హిందూజాతి శతృవులంతా ఏకమయ్యే ఛాన్స్ లేకుండా మోడీ చేసాడు.విజయనగర వైభవానికి అసూయపడి,ద్వేషం, ఈర్ష్యతో విజయనగర సామ్రాజ్య అంతం కోసం ముస్లిం రాజ్యాలు తాత్కాళికంగా ఏకమై ఆ సామ్రాజ్యాన్ని నాశనం చేసాయి.ఇలా శతృవులు ఏకమయ్యే ఏ ఛాన్స్ నూ మన శతృవులకు ఇవ్వకూడదు.మోడీ చేసింది ఇదే...ఇది అర్థం చేసుకోండి.

        పేరుకే హిందూగ్రూప్ లు.కానీ చాలా హిందూగ్రూపులు ముస్లింల మీద పోస్టులు పెట్టాలంటే ఉచ్చేసుకుంటున్నాయి. అందువల్లే నేను ఈ పోస్టును ఏ హిందూగ్రూప్ కు పంపటం లేదు.నిజం అందరికీ తెలియాలి కాబట్టి ధైర్యవంతులు ఈ పోస్టును షేర్ చేయగలరు.

No comments:

Post a Comment