Wednesday, July 13, 2022

1950లలో డాక్టర్ల దగ్గర నమోదైన కేసుల గణాంకాలను ఓ స్టడీలో పరిశీలించాను....

 1950లలో డాక్టర్ల దగ్గర నమోదైన కేసుల గణాంకాలను ఓ స్టడీలో పరిశీలించాను. 90 శాతం కేసులు కేవలం పనిచేసేటప్పుడు తగిలే గాయాలకు సంబంధించినవి, అంటు వ్యాధులకి సంబంధించినవీ మాత్రమే ఉండేవి.  పది శాతం కంటే తక్కువ మాత్రమే రోగ నిరోధక శక్తికి సంబంధించిన డిజార్డర్లు ఉండేవి. 


అదే ఇప్పుడు చూస్తే 90 శాతం కేసులు ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు, ఇమ్యూనిటీకి సంబంధించిన ఆర్థరైటిస్ వంటివి, మెటబాలిజంకి సంబంధించిన సమస్యలూ నమోదు అవుతున్నాయి. 


అంటే అప్పట్లో చిన్న పుండ్లు పడినా వాటంతట అవి తగ్గిపోయేవి, ఇమ్యూనిటీ మెరుగ్గా ఉండేది. జలుబు లాంటివి వచ్చినా ఏ టాబ్లెట్ వాడకుండా తగ్గిపోయేవి. కానీ విపరీతమైన యాంటీబయాటిక్స్ వాడడం మొదలయ్యాక, సహజసిద్ధమైన ఇమ్యూనిటీ లోపించి.. చిన్న చిన్న జలుబు లాంటివే ఏ టాబ్లెట్ వాడకపోతే న్యూమోనియా వంటి సమస్యలుగా మారే పరిస్థితి ఏర్పడింది.


అంటే మనిషి సురక్షితమైన నీరు, సురక్షితమైన ఫుడ్, శుభ్రత వంటి అలవాట్లు ఉన్నా అవేమీ కాపాడలేని, ఇమ్యూనిటీ శక్తి లేని దారుణమైన స్థితికి దిగజారాడు.


ఇమ్యూనిటీ కాంప్రమైజ్ కావడానికి అనేక కారణాలు.. ఒకటి మనం ప్రకృతికి దూరం కావడం! ఉదా.కి.. చెప్పులు, షూస్ వచ్చాక నేలపై నడవడం తగ్గిపోయాక మనిషి శరీరంలోని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ  పేరుకుపోయి, అది భూమి ద్వారా డిశ్చార్జ్ చేయబడే అవకాశం లేక ఎలక్ట్రికల్ ఇమ్యూనిటీ తగ్గిపోతూ వచ్చింది.


అలాగే స్వచ్ఛమైన గాలిని వదిలిపెట్టి నాలుగు గోడల మధ్య కిటికీలు వేసుకుని AC చల్లదనంతో గడపడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి.


విషపూరితమైన నెగిటివ్ ఆలోచనలు, డబ్బు గురించి, కెరీర్ గురించి విపరీతమైన మానసిక వత్తిడి వల్ల అలా అణిచిపెట్టబడే వత్తిడి స్ట్రెస్ హార్మోన్‌ని నిరంతరం విడుదల చేస్తూ శరీరంలో రోగ నిరోధక శక్తిని నాశనం చేస్తోంది.


ఇన్ని సమస్యలు పెట్టుకుని రోజూ బాదం పప్పులు తింటేనో... ఆర్గానిక్ ఫుడ్ తింటేనో, చికెన్, ఫిష్ తింటేనో మంచిది అని వాటిని తింటే ఏమొస్తుంది... ఏం ఫలితం ఉంటుంది?


*ఈ  వ్యాసం రాసిన వారు శ్రీధర్ నల్లమోతు*


సేకరణ. మానస సరోవరం

No comments:

Post a Comment