Wednesday, July 6, 2022

సత్కర్మలు - దుష్కర్మలు

సత్కర్మలు - దుష్కర్మలు

తన జీవితంలో ఎల్లప్పుడు మంచే జరుగుతుండాలని ప్రతి వ్యక్తీ కోరుకోవటం సహజం, న్యాయ సమ్మతం కూడాను. అందువలననే అతని ద్వారా అనేక మంచి కార్యములు కూడ జరుగుతున్నాయి. ఆ సత్కార్యముల సత్ఫలితాలను జన్మజన్మలలో అతను అనుభవిస్తూనే ఉంటాడు (జ్ఞానాన్ని పొందేవరకు). అయితే "మేము చాల సత్కర్మలనే ఆచరిస్తున్నాం, అవి సత్ఫలితాలనిస్తాయా?" అని ఈరోజుల్లో కొందరు ప్రశ్నిస్తున్నారు.

అన్ని కర్మలు తప్పక ఫలితాలనిస్తాయని శాస్త్రం చెప్తున్నది. ఉదాహరణకు సత్కర్మలు సత్ఫలితాలనిస్తాయి, దుష్కర్మలు దుప్పలితాలనిస్తాయి. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు.

మానవుని శ్రేయస్సు కోసమే శాస్త్రం ఇలా చెప్తున్నది - సత్కర్మలనే ఆచరిస్తుండండి, అప్పుడు సత్ఫలితాలు కలుగుతాయి. ఇహంలోనే కాదు పరలోకంలో కూడ.

यथा धेनुसहस्रेषु वत्सो विन्दति मातरम् |
तथा पूर्वकृतं कर्म कर्तारमनुगच्छति ||

ఒక గోవు వేయిగోవుల మధ్య తిరుగుతున్నా దాని దూడను తప్పక తల్లి గుర్తుపట్టగలదు. అలాగే మానవుడు చేసిన కర్మలు అతనిని అనుసరించి ఫలితాలనిస్తాయి. అందువలన సత్కర్మలు వృథాయనీ, దుష్కర్మల ఫలితాల ప్రభావముంటుందనీ ఎవరూ సందేహించవలసిన పనిలేదు.

कुशलान्याशु सिद्ध्यन्ति नेतराणि कृतानि यत् |

దుష్కర్మలు నెమ్మది నెమ్మదిగా దుష్ఫలితాలనిస్తూ చివరికి దుష్కర్మల నాచరించే వ్యక్తినే నాశనం చేస్తాయి. ఈ విషయాన్ని అర్ధం చేసుకొని సత్కర్మలనే ఆచరిస్తూ ఉండాలని సర్వులనూ ఆశీర్వదిస్తున్నాము.

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు

సేకరణ

No comments:

Post a Comment