Sunday, July 17, 2022

మానవశరీరం -చక్రాలు

 🙏🌷మానవశరీరం -చక్రాలు🌷🙏


మానవ శరీరంలో ఆరు చక్రాలు మరియు సహస్రారం (కుండలిని) తో కలుపుకొని ఏడు.
ఇలా ఆరు చక్రాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి గుండ్రంగా చలిస్తూ ఉంటాయి.ఈ ఆరు చక్రాలలో ఒక్క చక్రం చలించటం నిలిచిపోయిన మానవ శరీరం నుండి జీవుడు వెళ్లిపోతాడని శాస్త్ర వివరణ.ఆ చక్రాలు ఈ క్రింది విధంగా మానవ శరీరమందు లీనమై ఉంటాయి.
1.మూలాధారం(Root chakra)
2.స్వాధిష్ఠానం(Spleen chakra)
3.మణిపూరక(Solar chakra)
4.అనాహత(Heart chakra)
5.విశుధ్ధ(Throat chakra)
6.ఆజ్ఞా(Brow chakra)
7.సహస్రారం(Crown chakra) ఇక ఈ చక్రాల స్థానాలు మరియు వాటి స్థానాలలో గల దేవతలను గురించి చూద్దాం.

పంచ భూతాలు అనగా 1.భూమి 2.ఆకాశం 3.నీరు 4.నిప్పు 5.గాలి ఇలా పంచ భూతాలు మానవ శరిరంలో లీనం అయి ఉంటాయి.

1.మూలాధారం: ఇది మానవ శరీరానికి నడి భాగంలో ఉంటుంది.ఇది పృద్వి భూత స్ధానం (భూమి) ఈ చక్రానికి అధిపతి గణపతి.

2.స్వాధిష్ఠానం:ఇది మూలాధారానికి దాదాపుగా రెండు అంగులాలపైన అనగా పొత్తి కడుపులో ఉంటుంది.ఇది జల భూత స్థానం (నీరు) ఈ చక్రానికి అధిపతి బ్రహ్మ.

3.మణిపూరక: ఇది మానవ శరీరానికి బోడ్డు స్థానంలో ఉంటుంది.ఇది అగ్ని భూత స్థానం (నిప్పు) దీనికి అధిపతి విష్ణువు.

4.అనాహత:ఇది మానవ హృధయ స్థానంలో ఉంటుంది.ఇది వాయు భూత స్థానం(గాలి).దీనికి అధిపతి రుద్రుడు

5.విశుద్ధ: ఇది మానవ శరీరంలో గొంతు స్థానంలో ఉంటుంది.ఇది దివి భూత స్థానం (ఆకాశం)దీనికీ అధిపతి జీవుడు.

6.ఆజ్ఞా: ఇది మానవ శరీరంలో నీదుటి స్థానంలో ఉంటుంది. ఇది జీవాత్మ స్థానం.దీనికీ అధిపతి జీవుడు.

7.సహస్రారం:ఇది తల పై భాగాన (నడి నెత్తిన) ఉంటుంది.ఇది చక్రం కాదు రంద్రం దీనినే బ్రహ్మ రంద్రం అని కూడా చెపుతారు.దీనికి అధిపతి ఈశ్వరుడు.

మరియు మన హైందవ సాంప్రదాయ పెళ్ళిల్లలో సైతం తలపై జీలకర్ర మరియు బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టిన తరువాత వధూ వరులను ఒకరికొకరిని చూసుకొమని చెబుతారు.కారణం అలా జీల కర్రా మరియు బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టగానే బ్రహ్మ రంద్రం తెరుచుకుంటుంది.అలా తెరుచుకున్న తరువాత మొదటగా చూసిన వారే జీవిత భాగ స్వామిగా బ్రహ్మ స్థలిలో నిర్ణీతం అవుతుంది.

ఇలా అనేక అంగాల కలయికే చక్రం అని పిలవబడుతుంది. ఇలా ఒక్కో చక్రం శరీరంలో ఒక్కో స్థానంలొ లినమై ఉంటుంది.
అనాపానసతి వలన కుండలినీ జాగృతమై,షట్ చక్రాలలో శుద్ది జరుగుతుంది.
కుండలినీ ఎప్పుడైతే సహస్రాణంతో స్తితమవుతుందో అపుడు మనిషి నిర్వాణ స్తితిని పొందుతాడు.

No comments:

Post a Comment