💖💖 *"282"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"మంచి గుణాలు పాటించటం కష్టంగా ఉన్నప్పుడు ఎలా ?"*
**************************
*"సుఖశాంతులతో జీవించాలంటే మనసుకు మంచి విషయాల్లో శిక్షణ ఇవ్వాలి. భగవంతుడు ప్రతి ఒక్కరికి తెల్లటి వస్త్రం లాంటి స్వచ్ఛమైన మనసును ఇచ్చి పంపాడు. దానికి ఏ రంగు అయినా అద్దుకోవచ్చు. మన మనసుకు దేన్నైనా అలవాటు చేయవచ్చు. చిన్నపిల్లలు నోట్లో వేలేసుకోవటం దగ్గర నుండి ప్రతీది వచ్చిన అలవాటేగానీ మనసు సహజ లక్షణం కాదు. విద్యార్థికి ఏ సబ్జెక్టు కష్టంగా ఉందో దాన్నే ఎక్కువసేపు చదివిస్తారు. అలాగే మనకు ఏ మంచి గుణాలు పాటించటం కష్టంగా ఉంటే దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రాత్రంతా స్నేహితులతో ముచ్చట్లు చెప్తే రాని విసుగు, నిద్ర భజనలో కూర్చుంటే వస్తాయి. మనసుకున్న గుణాలు ఏమిటో మనకు తెలిస్తే వాటిని మార్చుకోవడం సాధ్యమవుతుంది. అందుకే ముందుగా మనసును అర్థం చేసుకోకుండా ఆధ్యాత్మిక సాధన సాధ్యంకాదు. మనసుకు సద్గుణాలు అలవర్చటమే సాధన "!*
*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
🌼💖🌼💖🌼
🌼🕉🌼
No comments:
Post a Comment