🌾నేడు బహుజన వీర వనిత,స్వాతంత్ర్య పోరాట యోధురాలు ఝల్కారీ బాయి జయంతి.🎋
✍️ఎ.ఎన్.బోధి
బుద్ధ జనహిత
🔱బ్రాహ్మణ చరిత్ర కారులు వ్రాసిందే చరిత్రగా భావించి భ్రమలో ఉంటున్నారు చాలామంది.అసలైన చరిత్రను ఖచ్చితంగా అందరూ చదవాలి.చదవకుండా రేపటి సమాజాన్ని ఎలా రూపొందిస్తారు?
🌺ఝాన్సీ కాదు వీరవనిత ఝల్కారీ బాయి కోరీ అసలు వీరవనిత. ఈమె ఆమెకు డూప్.కష్టం ఈమెది.ఫలితం ఆమెది. ఇదే కదా బ్రాహ్మణ నీతి అంటే.ఝల్కారీ బాయి కోరీ అంటరాని కోరీ కులంలో 1830 నవంబర్ 22వ తేదీన ఝాన్సీ దగ్గర గల బాలాజీ మార్గ్ లోని భోజలా గ్రామంలో జన్మించింది.ఝల్కారీ తల్లిదండ్రులు ధనియా-మాల్ చంద్ లు.వీరిది 'లడియా' గోత్రం.ఝల్కారీ ను బాల్యంలో ఝలరియా అని పిలిచేవారు. ఈ కోరీ కులంవాళ్ళెవరూ తమ పేరు చివరన బాయి అని పెట్టుకోరాదు అని బ్రాహ్మణులు నాడు ఆంక్షలు పెట్టారు. వీళ్ళు బట్టలు నేసే అంటరాని జాతి.నాడు అంటరాని వాళ్ళెవరూ మంచి బట్టలు కట్టుకోరాదు.అంటరాని వాళ్ళు మంచి బట్టలు ధరిస్తే వారిని బ్రాహ్మణ, ఠాకూర్ లు కలిసి రక్తం వచ్చేవరకూ కొట్టే వారు. కాబట్టి కోరీ జాతివాళ్ళు అంటరాని ఇతర జాతుల కోసం రంగులు లేని కోరా గుడ్డలు అంటరాని కులాలలో బన్ కర్ లు నేసేవాళ్ళు. వీళ్ళను 'కోరీ' లు అంటారు.
🌸బుందేల్ ఖండ్ " ప్రాంతం ఒకప్పుడు "బుద్ధ ఖండ్" - సామ్రాట్ అశోకుని శాసనం ద్వారా మనకు ఝూన్సీ దతియాల మధ్య ఒక పర్వతం పై 'గుజర్రా' పేరుతో శిథిలాలు ఉన్నాయి. వీటి వలన ఇవి బౌద్ధులు పాలించినవని తెలుస్తుంది. ఈ "కోరీ" కులస్తులను "కోలి" అని కూడా పిలుస్తారు. గౌతమ బుద్ధుని భార్య "కోలి" జాతికి చెందింది . అంటే కోరిలు ఒకప్పుడు రాజ్యాలనేలిన వారిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి నేపథ్యం గల కోరీలను అంటరానివారిగా ఎవరు చేశారో చెప్పనక్కర్లేదు అనుకుంటాను.
⛩️1857 తిరుగుబాటుకు ముందే లార్డ్ డల్హౌసి గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. ఇతను బ్రిటీష్ పాలనలోకి స్వదేశీ సంస్థానాలను తెచ్చే ప్రయత్నాలు చేసాడు. భారత సమాజాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకుని రావాలని అనుకున్నాడు . ఇదే గనుక జరిగితే బ్రాహ్మణులకు ,ఠాకూర్ లకు అస్తిత్వం, అధికారం దక్కదని భావించి,బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు చేసారు. బ్రాహ్మణ రాజపుత్ర రాజులకు ఈ దేశంలో ఉన్న శూద్రులు, అతి శూద్రులు తమ చెప్పు చేతులలో ఉండాలి. మెజారిటీ జనాభా బానిసత్వంలోనే శాశ్వతంగా ఉండాలంటే తమకు పూర్తి స్థాయిలో రాజ్యం అధికారం ఉండాలని భావించారు.
🌼బ్రాహ్మణులైన నానా సాహెబ్ పెషవా, ఝాన్సీ లక్ష్మీ బాబు, మొగల్ సామ్రాట్ రెండవ బహదూర్ షాజఫర్ లు బ్రిటిష్ పాలకులను ఎదిరించడానికి సిద్ధమయ్యారు.
🌻ఝాన్సీ రాజ్యాన్ని ముసలి వాడైన గంగాధర్ పెషవా పాలించాడు. ఈ ముసలి వాడికి భార్యయే ఝూన్సీ రాణి లక్ష్మీబాబు అనే యువతి. 1853 లో గంగాధర్ పెషవా మరణించడంతో బ్రిటీషు వారు ఝాన్సీ "రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటారు.ఆ సమయంలో లక్ష్మీ బాయి దత్తత తీసుకున్న కొడుకు యొక్క వయసు 13 సంవత్సరాలు. అందుకే బ్రిటిష్ వారు రాజ్యం దత్తత తీసుకున్న పుత్రునికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు.ఝాన్సీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు బ్రిటిష్ వారు. ఝాన్సీ రాణి తమ రాజ్యం తమకే ఇవ్వాలని బ్రిటిష్ వారిని వేడుకుంది.బ్రిటిష్ వారికి తాము విధేయులుగా ఉంటామని కూడా వినతిపత్రాన్ని కూడా సమర్పించింది ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి.. బ్రిటిష్ వాళ్ళు వినతిని తిరస్కరించడంతో తప్పనిసరి పరిస్థితి లో బ్రాహ్మణ పీష్వాలు ,ఝాన్సీ రాణి లక్ష్మీ బాయిలు బ్రిటిష్ వారిని ఎదిరించారు.ఇలాంటి యుద్ధ వాతావరణం లో కోరీ కులస్తురాలైన ఝల్కారీ బాయి కోరి ఝాన్సీ రాణీ సైన్యం లో ఉంది. బ్రిటిష్ వారు యుద్ధం ప్రకటించడంతో ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి ఈ యుద్ధంలో నుండి తప్పించుకుని పారిపోయింది. అయితే దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం ఝూన్సీ రాజ్యం తరపున ఝల్కారీ బాయి యుద్ధం చేసింది. దేశం కోసం పోరాటం చేసి మరణించిన వీరవనిత అంటరాని జాతికి చెందిన ఝల్కారీ బాయి కోరి.ఆశ్చర్యం గా లక్ష్మీ బాయి -ఝల్కారీ బాయి కోరీలు ఇంచుమించు ఒకే రూపంలో ఉండేవారని చరిత్ర కారుల వలన తెలుస్తోంది.
🦚లక్ష్మీ బాయి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు.బ్రిటిష్ వారికి లొంగి పోయి కాశ్మీర్ వెళ్ళి చాలాకాలం జీవించింది.పండు ముసలి వయస్సు వచ్చే వరకూ జీవించిందని చారిత్రక పరిశోధకులు తేల్చారు. ఎంత అన్యాయం చరిత్రలో జరిగింది. త్యాగం, వీరమరణం ఏమో అంటరాని ఝల్కారీ బాయిది అయితే చరిత్రలో వీరవనిత గా బ్రాహ్మణ ఝాన్సీ రాణి లక్ష్మీ బాయిది. అందుకేనేమో ఏ ఒక్క బ్రాహ్మణుడు తమ కూతుర్లకు ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి పేరు కూడా పెట్టుకోరు.శూద్రులు మాత్రం తమ పిల్లలకు ఈమె పేర్లు పెడుతుంటారు.
🌱నాడు బ్రాహ్మణులు బ్రిటిష్ వారిని ఎదురించి స్వాతంత్ర్య పోరాటం చేసింది వాళ్ళ స్వార్థం కోసం. బ్రిటిష్ వారు మనదేశంలో ఎన్నో మంచి సంస్కరణలు కూడా చేశారు.
🌹అమర్ రహే ఝల్కారీ బాయి కోరీ🪷
No comments:
Post a Comment