నేటి మంచిమాట .
ఆనందమే జీవితం ,ఆనందమే ఆరోగ్యం, ఆనందమే ఐశ్వర్యం*
మనల్ని మనం లేదా ఈ ప్రపంచంలో ఎవరిని గమనించి చూసినా ఏది చేసినా, సరే కేవలం ఆనందం కోసమే. పెళ్లి చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా వ్యాపారం చేసి డబ్బు సంపాదించినా, ఏదైనా కొన్నా, ఎవరితోనైనా స్నేహం చేసినా, అన్నిటికీ మూల కారణం ఆనందమే. ఆనందమే లేకపోతే జీవితమే లేదు .ఆనందం లేకుండా బ్రతకడం జీవితం కాదు, అనిపిస్తుంది. మనసుకి ఆనందం లేకుండా, ఎక్కువ రోజులు గడిపితే శరీరం శక్తి హీనంగా తయారై అనారోగ్యంతో ఉంటుంది.
ఎన్ని ఆస్తులున్నా, సంపదలున్న జీవితములో చిరునవ్వు లేకపోతే, ఆనందం కూడా లేకపోతే, మనకు మనమే పెద్ద ఇబ్బందిగా తయారవుతాం. ఆనందంగా లేకపోతే మన చుట్టూ ,ఎంతమంది ఉన్నా ,ఎన్ని ఉన్నా, ఏకాకి లాగా ఉంటాం.. జీవితం కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఆనందంగా ఉండడం నేర్చుకుంటే ఏ అనారోగ్యాలు దరి చేరవు... *అందుకే ఆనందంగా జీవించండి ఏ క్షణాన్ని వృధా చేయవద్దు*
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం .👏
No comments:
Post a Comment