Wednesday, November 30, 2022

అరుణాచలేశ్వరుని ఉత్తర గోపురం పూర్తి చేసిన కారణ జన్మురాలు"అమ్మని అమ్మాళ్/అమ్మని అమ్మన్"

 అరుణాచలేశ్వరుని ఉత్తర గోపురం పూర్తి చేసిన కారణ జన్మురాలు"అమ్మని అమ్మాళ్/అమ్మని అమ్మన్"


తల్లిదండ్రులు; గోపాల పిళ్ళై,అలు అమ్మాళ్
సోదరుడు: తాండవ పిళ్ళై
జన్మస్థలం: చెన్న సముద్రం గ్రామం,చెంగమ్ దగ్గర ,తమిళనాడు

అమ్మని జీవిత విశేషాలు
అమ్మని కి తమ తల్లిదండ్రులు పెళ్ళి చేయాలని ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో ఆమె ఇల్లు వదిలి అదేవూర్లో ఒక కొలను దగ్గర కూర్చుని ఉండి పోతుంది అప్పుడు అమ్మని స్వయంగా తన పూర్వ జన్మ వివరాలు తెలిపింది "పూర్వం తాను శివలోకంలో ఉన్న పరాశక్తి ని అని పరమేశ్వరుని పట్ల తాను చేసిన అపరాధం కారణం గా ఈ మానవ జన్మ ఎత్తినట్లు తెలిపింది ముందు జన్మలో అదే చెన్న సముద్రంలో "చెన్నమ్మ"అనే పేరుతో జన్మించి తనను కామించిన తురక రాజు నుండి  వెల్లియప్ప సిద్దార్ అను వారి సహాయంతో సప్త మాతృకలు రక్షణలో ఉన్న గుహ లోకి ప్రవేశించి జన్మ సమాప్తి గావించింది

రెండవ జన్మలో; అమ్మని అమ్మాళ్ గా జన్మించిన తాను అరుణాచలేశ్వరుని క్షేత్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన శ్రీ వల్లాల మహారాజు గారి ద్వారా ప్రారంభం చేయబడి అసంపూర్తిగా ఉన్న ఉత్తర రాజ గోపురాన్ని పూర్తి చేయడమే తన కర్తవ్యంగా భావించి అరుణాచలం వచ్చి జోలి పట్టి యాచించి ఉత్తర గోవురాన్ని పూర్తి చేసింది
గోపురం చివరి దశలో పైకం లేనప్పుడు సర్వేశ్వరుడు ఆమెకు విభూతిని మంత్రించి ఇవ్వు అదే వారికి పైకంగా మారి పని పూర్తి అవుతుంది అని స్వప్నం లో అదేశమిస్తారు అలా ఈశ్వర ప్రేరణ అనుగ్రహం తో గోవురాన్ని పూర్తి చేసింది అమ్మని ,తనకు సహాయం చేసేందుకు ముందుకు రాని వారి వద్ద ఎంత డబ్బు ఉందొ చెప్పి వారికి కళ్ళు తెరిపించేది అమ్మని 
అలా ఉత్తర రాజగోపురం ఇప్పుడు "అమ్మని అమ్మాళ్"గోపురం గా పిలువబడుతు ఉంది 
అమ్మని ఈ కార్యం పూర్తి అయ్యాక జీవ సమాధి ప్రవేశం చేసింది 
ఈ తల్లి అధిష్టాన మందిరం ఈశాన్య లింగం దగ్గర ,ఈశాన్య దేశికుల మఠం పక్కనే ఉంటుంది
అరుణాచలం వెళ్లేవారు తప్పకుండా దర్శించుకోగలరు.

అరుణాచల శివ శివ
అరుణాచల శివ 🌹

No comments:

Post a Comment