🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి* సమాధానం:
💥"ప్ర.: నాకు ఆత్మపై ఏకాగ్రతని సాధించటం కొన్నిసార్లు తేలికగా మరియు ఇతర సమయాల్లో అమిత కష్టంగా ఉంటుంది?
💥భగవాన్ : అది సంస్కారాల (వాసనల) వలన.
కానీ నిజంగా ఇది (ఏకాగ్రత) చాలా సులభం, ఎందుకంటే మనం ఆత్మే.
మనం చేయాల్సిందల్లా ఈ విషయం గుర్తుంచుకోవడమే.
మనం దానిని మరచిపోతూనే ఉంటాము, తద్వారా మనం ఈ శరీరం లేదా ఈ అహం మనం అని అనుకుంటాము.
తనను తాను గుర్తుంచుకోవాలనే సంకల్పం మరియు కోరిక తగినంత బలంగా ఉంటే, వారు చివరికి వాసనలను అధిగమిస్తారు.
ఆత్మ సాక్షాత్కరించేంత వరకు అంతరంగంలో ఎప్పుడూ ఒక గొప్ప యుద్ధం జరుగుతూనే ఉండాలి.
ఈ యుద్ధం దేవతలకు మరియు రాక్షసులకం మధ్య జరిగిన పోరాటంగా ఇతిహానరచనలలో ప్రతీకాత్మకంగా చెప్పబడింది.
🙏🌷🙏 *శుభం భూయాత్* 🙏🌷🙏
No comments:
Post a Comment