ఈరోజు మంచి మాట.
రెండు పదాలు *నీ జీవితాన్నే* మార్చేయగలవు *ఒకటి* చేయగలననే ఆత్మవిశ్వాసం, *రెండు* చేయలేననే *అపనమ్మకం* వీటిలో ఏది ఎంపిక చేసుకుని *నడుస్తామో* దానిపైనే మన జీవితం *ఆధారపడి* ఉంటుంది .
*నమ్మి* బ్రతకడం వేరు *నమ్మిస్తూ* బ్రతకడం వేరు *నమ్మి* బ్రతకటంలో *ప్రేమ* ఉంటుంది, *నమ్మిస్తూ* బ్రతకడంలో *స్వార్థం* మాత్రమే ఉంటుంది , నువ్వు *నిజాయితీగా* ఉంటే చాలా మంది *నీతో* పాటు ఉండక పోవచ్చు, *కానీ* కచ్చితంగా సరైన *వ్యక్తులే* నీకు *మిత్రులుగా* మిగులుతారు ,
ఆపదకి *సంపద* నచ్చదు,సంపదకు *బంధం* నచ్చదు,బంధానికి *బాధ* నచ్చదు,బాధకు *బ్రతుకు* నచ్చదు,బ్రతుకుకి *చావు* నచ్చదు,చావుకి *పుట్టుక* నచ్చదు *కానీ* వీటిని మనం *అనుభవించక* తప్పదు .
*అదుపు* తప్పి *కింద* పడితే ఆదుకోదు *ఈ లోకం*.అలిసిపోయి కన్నుమూస్తే *బ్రతికించ* లేదు *ఏ బంధం*.
దారిలోన *చీకటైతే* తోడు రాదు *నీ నిడ* కూడ,. జారిపోయి *దూరమైతే* చేరుకోదు *నీ ప్రేమ* గమ్యం, . అందుకే నిన్నే *నమ్ముకో*, నీకు నువ్వు గానే *సాగిపో* *జీవితం* నీదే.నువ్వే *నడవాలి* నీకు *బదులుగా* ఎవ్వరు *నడవలేరు* .
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment