💖💖💖
💖💖 *"390"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"కానున్నది కాక మానదు.. కానిది ఏనాటికీ కాదు... దీని సమన్వయం ఏమిటి ?"*
*"మనం కావాలనుకోవటం, వద్దనుకోవటం మానుకుంటే ఇది అర్ధం అవుతుంది. జరిగేదాన్ని స్వీకరించటం మినహా మన ప్రమేయంతో సృష్టి విధానానికి నిమిత్తమే లేదు. దాన్నే భగవాన్ శ్రీరమణమహర్షి "కానున్నది కాక మానదు.. కానిది ఏనాటికీ కాదు..." అని చెప్పేవారు. కొందరు ధర్మ కార్యానికి రూపాయి కూడా ఇవ్వరు. అలాంటి వారితోనే ఏదోక వ్యాధి చికిత్స కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టించటం విధిచేసే విచిత్రం. ప్రయత్నం చేస్తే క్రింద పడకుండా ఉండగలమా అని మనం ఆలోచిస్తాం. కానీ అలా నిలదొక్కుకోవమే కాదు మనం కావాలని క్రింద పడాలన్నా పడలేం. బాహ్య క్రియల విషయంలో అంతటి అస్వతంత్రులుగా ఉన్నాం. మనంతట మనంగా పడలేం కాబట్టి వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళే మోటారుసైకిల్ నుండి క్రింద పడేలా ప్రకృతి ప్రేరేపిస్తుంది. అలా పడటాన్నే మనం ప్రమాదం అంటున్నాం. సృష్టివిధానంలో జరిగే క్రియాల్లో మంచి-చెడు అని వేర్వేగా లేవు. మనం ఒకటి కావాలని, మరొకటి వద్దని అనుకోవటంలోనే మంచి-చెడు కనిపిస్తోంది. కానీ విధానంలో ఉన్న వాటిని ఎవరైనా అంగీకరించక తప్పదు..!"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment