Tuesday, November 29, 2022

బకదాల్భ్య మహర్షి గురించి తెలుసుకుందాము..

 Shobha Rani:
Shobha Rani:
🎻🌹🙏మన మహర్షుల చరిత్రలు..

🌹🙏ఈ రోజు 50,వ బకదాల్భ్య మహర్షి గురించి తెలుసుకుందాము..🙏🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఇపుడు మనం తెలుసుకోబోయేది ఒక అతి అద్భుతమైన మహర్షి గురించి . నిజంగా ఏం గొప్పతనం ! ఎంత ఆయుషు ! ఎంత వినయం ! మహాద్భుతం . 

🌸చాలా చాలా యుగాలకి పూర్వం దాల్బ్యుడనే మహర్షి ఉండేవాడు . ఆయన విష్ణుమూర్తిని ప్రార్థించి ఎన్నికల్పాలయిపోయినా సరే మరణం లేకుండా ఉండే కొడుకు కావాలని వరం పొంది ఒక కొడుకుని పొందాడు .

🌿ఆహా ! ఎంత అదృష్టం . ఆయన ఎంత పుణ్యాత్ముడో ! అంత గొప్ప కొడుకుని కన్న తండ్రి తక్కువ వాడు కాదు కదా ... ! 

🌸ఆ పిల్లవాడు బక పుష్పం ఉన్నంత అందంగా చక్కటి సువాసనతో ఉన్నాడని బకుడని పేరు పెట్టారు .

🌿 తండ్రి పేరు కూడా కలిసి బకదాల్బ్యుడు అని , ఇతడ్ని పెంచిన తల్లిదండ్రులవల్ల ద్వ్యాముష్యాయణుడు , గ్లావుడు , గ్లావమైత్రేయుడు అని కూడ పేర్లున్నాయి .

🌸బకదాల్ఫ్యుడు చిన్నతనంలోనే ముఖ్య ప్రాణోపాసనం చేసిన మహాతపశ్శాలి , మహాత్ముడు అయ్యాడు .

🌿ఒకసారి ఒక తెల్లకుక్క కొన్ని చిన్న కుక్కలను ఒకదానితోక ఒకటి నోటితో పట్టుకుని వలయాకారంలో తిరిగి కూర్చుంటే చూసి ఋత్విజుల విధుల్ని నిర్ణయి బకదాల్బ్యుడు
ద్వైతవనంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు . 

🌸గొప్ప తపస్సు చేసి మరణాన్నే జయించి , అపర శివుడిలా తేజస్సుతో వెలిగిపోతున్నాడు . కొంతకాలం తర్వాత పాండవులు ద్వైతవనంలో ఉండడానకి వచ్చారు . వాళ్ళని పెద్ద పెద్ద మునులందరూ వెళ్ళి పలకరించి వస్తున్నారు .

🌿బకదాల్భ్య మహర్షి ఒకసారి పాండవులని చూడ్డానికి వెళ్ళి ధర్మరాజు దగ్గర అతిథి సత్కారం తీసుకుని,

🌸నాయనా ! ఉత్తములైన బ్రాహ్మణులు మీ దగ్గరికి వచ్చి పోతూ వుంటే అగ్నికి , వాయువు తోడైతే అరణ్యాన్ని ఎలా దహిస్తాయో ,మా బ్రాహ్మణులు , మీ క్షత్రియులు కలిసినప్పుడు శత్రువులు కూడా అలాగే నశిస్తారు అన్నాడు .

🌿యుద్ధంలో ఏనుగుకి దారి చూపించడానికి అంకుశం ఎలా ఉపయోగపడుందో , రాజుని ధర్మమార్గంలో త్రిప్పడానికి బ్రాహ్మణుడు అలాగే ఉపయోగపడతాడన్నాడు .

🌸తర్వాత బకదాల్యుడు చిరంజీవుల్లో ఒకడై బ్రహ్మచారై ఎన్నో యుగాలు బ్రతికి సముద్రం మధ్యన ఒక దీవిలో తపస్సు చేసుకుంటున్నాడు .

🌿ఒకసారి ధర్మరాజు అశ్వమేథయాగం చెయ్యడానికి యజ్ఞాశ్వాన్ని విడిచి పెట్టినప్పుడు కృష్ణార్జునులు గుఱ్ఱంతో తిరుగుతూ మహర్షి ఉన్న చోటుకి వచ్చారు .

🌸అక్కడ కొన్ని యుగాలుగా పెరిగిన శరీరం , జడలు , గడ్డంతో , కోటి సూర్యుల తేజస్సుతో ఉన్న బకదాల్ఫ్యుణ్ణి చూసి కృష్ణార్జునులు రథం దిగి నడిచి వెళ్ళి నమస్కారం చేశారు .

🌿అర్జనుడు మహర్షిని చూసి ఆశ్చర్యపోయాడు .శరీరం చుట్టూ పుట్టలు ,.మోకాళ్ళు మోచేతులు నించీ చెట్లు , పుట్టల్లో ఎన్నో రకాల పాములు ఆ చెట్లమీద ఎన్నో రకాల పక్షులు చూసి అర్జనుడు మహర్షికి నమస్కారం పెట్టి ఈ మీ వింతకి పరమార్థం ఏమిటని అడిగాడు . 

🌸అర్జునా ! క్షణంలో పోయే ఈ శరీరానికి తూగుటుయ్యాలాలు , పూలపాన్పులు ఎందుకు ? ఈ మట్టి ఆకులు చాలవా ? అన్నాడు బకదాల్బ్యడు .అర్జునుడు స్వామీ ! మీ వయస్సెంత ? అన్నాడు .

🌿బక దాల్ఫ్యుడు నేను పుట్టాక ఇరవై మంది బ్రహ్మలు వెళ్ళారు .ఎంతో మంది మార్కండేయులు వెళ్ళిపోయారు .నీకొక చిత్రమైన విషయం చెప్తాను విను . 

🌸ప్రళయ కాలంలో ఏడు సముద్రాలు , ముల్లోకాలు కొట్టుకొచ్చి ఇక్కడికి చేరాయి .అప్పుడిక్కడ ఒక మట్టి చెట్టుండేది .దాని కొమ్మలు వెయ్యి పైగానే ఉన్నాయి .ఒక్కొక్క కొమ్మకి వెయ్యేసి బ్రహ్మాండాలు వ్రేలాడుతున్నాయి .

🌿ఆ మట్టి చెట్టుకి చిటారుకొమ్మ మీద ఒక చిగురాకు మీద పడుక్కుని కుడి కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని ఒకసారి నవ్వుతూ ఒకసారి ఏడుస్తూ నన్ను ప్రేమతో చూసి భయం లేదని అభయమిచ్చాడు ఒక బాలుడు .

🌸రమ్మనేవాళ్ళు లేక పొమ్మనే వాళ్ళు లేక అంతటికి తానే నాయకుడయ్యి హాయిగా పడుకుంటే అతని నాభిలోంచి ఒక కమలం దాంట్లోంచి ఒక బ్రహ్మ వచ్చి ఈ సృష్టినంతా చేశాడు . 

🌿అతడే శ్రీకృష్ణుడుగా పుట్టి నీకు బావై ఈ బాధలన్నీ పడుతున్నాడని చెప్పి కృష్ణుడ్ని కౌగిలించుకుని ఎలావున్నావయ్యా మూడులోకాల కుటుంబీ ! అన్నాడు బకదాల్భ్య మహర్షి శ్రీకృష్ణుణ్ణి .

🌸కృష్ణుడు బకదాల్బ్యుణ్ణి పొగుడుతుంటే , పొగడ్త ఎంతటి గొప్పవాడ్నయినా నాశనం చేస్తుంది , ఒక కథ చెప్తాను వినమన్నాడు మహర్షి .

🌿అర్జనుడికి కథలంటే ఇష్టం వెంటనే చెప్పండి చెప్పండి అన్నాడు .నేను ఒక మట్టి చెట్టు దగ్గర తపస్సు చేసుకుంటుంటే నాలుగు ముఖాల బ్రహ్మ వచ్చి నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడు .

🌸నీలాంటి వాళ్ళని ఇరవైమందిని చూశాను .నువ్వు నాకేమిస్తావన్నాను . నేను , బ్రహ్మకి కోపం వచ్చి వెట్టివాడ్ననుకుంటున్నావా ? అన్నాడు .

🌿నేను నవ్వుతున్నాను .ఈలోగా మా ఇద్దరి మధ్యా భూమి చీలి పెద్దగాలి వచ్చి మమ్మల్ని వేరే బ్రహ్మాండంలో పడేసింది . అక్కడ ఎనిమిది తలల బ్రహ్మ మీరెవరో నాకనవసరం నాసేవ చెయ్యండన్నాడు .

🌸మళ్ళీ అలాగే జరిగి పదహారు తలల బ్రహ్మ తన సేవ చెయ్యమన్నాడు . బ్రహ్మాండాలు దాటుతూ బ్రహ్మల్ని చూస్తూ అలా వెడుతూనే వున్నాం .

No comments:

Post a Comment