Thursday, December 1, 2022

భృగు మహర్షి గురించి తెలుసుకుందాము..

 [12/1, 05:58] +91 73963 92086: Shobha Rani:
[30/11, 22:06] Shobha Rani: 🎻🌹🙏మన మహర్షుల చరిత్రలు..

🌹🙏ఈరోజు 52. భృగు మహర్షి గురించి తెలుసుకుందాము..🙏🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿భృగు మహర్షి ఈయన ప్రస్తావన ఆది పర్వము ప్రథమాశ్వాసములో వస్తుంది.

🌸బ్రహ్మదేవుని హృదయమునుంచి జన్మించినవాడు భృగువు. ఈయన నవ బ్రహ్మలలో ఒకడుగా పేరు పొందాడు. 

🌿విష్ణుమూర్తి అవతారం పరశురాముడు కూడ ఈ వంశమే . భృగుమహర్షి ఖ్యాతిని పెళ్ళి చేసుకుని ధాత విధాతల్నీ శ్రీ అనే కూతుర్నీ , ఉశన వల్ల యశనుడనే కొడుకునీ , పులోమ వల్ల చ్యవనుడినీ పొందాడు . యశనుడంటే ఎవరోకాదు రాక్షస గురువు శుక్రాచార్యుడే .

🌸భృగుమహర్షి భార్య పులోమని ఒక రాక్షసుడు ఎత్తుకు పోవాలని ఆమె ఎక్కడ వుందని అగ్నిదేవుణ్ణి అడిగాడు . అగ్ని భృగుమహర్షి ఆశ్రమంలో వున్న ఈమే పులోమ అని చెప్పాడు . 

🌿రాక్షసుడు పులోమని ఎత్తుకుపోతుంటే ఆమె గర్భంలో వున్న పిల్లాడు కిందపడిపోయాడు . భృగుమహర్షి అగ్ని దేవుణ్ణి ఇదంతా జరగడానికి కారణం నువ్వే కాబట్టి ఏది కనిపిస్తే దాన్ని తింటూ సర్వభక్షకుడిగా వుండమని శపించాడు .

🌸 అగ్నిదేవుడు బ్రతిమాలుకుంటే సర్వభక్షకుడివైనా అందరితో గౌరవించబడతావు వన్నాడు .
పూర్వం దేవతలు రాక్షసుల్ని స్వర్గలోకంలో లేకుండా గెంటేవారు .

🌿 రాక్షస గురువు శుక్రాచార్యుడు శివుణ్ణి మెప్పించి సంజీవిని తెస్తానని వెళ్ళాడు . ఇదే సమయంలో దేవతలు రాక్షసుల్ని చంపెయ్యడం మొదలు పెట్టారు .

🌸 భృగుమహర్షి భార్య ఉశన దగ్గరకు వెళ్ళి తమను కాపాడమని శరణు కోరారు రాక్షసులు . ఇంద్రుడితో సహా దేవతలందర్ని స్తంభించిపోయేలా శపించింది ఉశన . 

🌿కొంతమంది దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు . స్త్రీని చంపడం పాపం కదా భయపెడదామనుకున్నాడు విష్ణుమూర్తి . ఈ లోపునే ఉశన విష్ణుమూర్తినే శపించాలని అక్షరం అనబోయేలోగా విష్ణుమూర్తి ఆవిడ కంఠంలో బాణం వేశాడు . 

🌸వెంటనే ఆమె చనిపోయింది . భృగు మహర్షి వచ్చి ఇదంతా చూసి ఒక స్త్రీని చంపావు , నీకు ఇంత అహంకారమా ? అని భూలోకంలో మనిషివై పుడుతూ మరణిస్తూ సుఖదుఃఖాలనుభవిస్తావని విష్ణుమూర్తిని శపించాడు .

🌿 మంత్రజలంతో ఉశనని బ్రతికించాడు . నేనిచ్చిన వరాలో నన్నే శపిస్తావా ? అన్నాడు విష్ణుమూర్తి . నిన్ను శపించడం ఎవరితరం ? దుష్టుల్ని శిక్షించడానికి , శిష్టుల్ని రక్షించడానికి అవతారం ఎత్తడానికి నన్ను ఉపయోగించుకున్నావు . 

🌸నీ అవతారం వల్ల దర్మసంస్థాపన అవుతుందిలే అన్నాడు భృగు మహర్షి . భృగు మహర్షి శక్తిని చూసి మిగిలిన ఋషులు ఆశ్చర్యపోతూ ముక్కు మీద వేలేసుకున్నారు . 

🌿సరస్వతీ నదీ తీరంలో మహర్షులందరూ కలిసి ఒక యాగం చేస్తుండగా వాళ్ళల్లో ఒకళ్ళకి ఒక సందేహం వచ్చేసింది . వెంటనే త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవాళ్ళు అని భృగు మహర్షిని తేల్చి చెప్పమన్నారు .
        
🌸ఒకసారి మునులందరి మధ్య త్రిమూర్తులలో అధికుడెవరు అనే చర్చ వచ్చింది. ఆ విషయం తెలుసుకురమ్మని అందరూ భృగుమహర్షిని పంపారు.
          
🌸భృగువు ముందు బ్రహ్మ దగ్గరకి వెళ్లాడు. ఆయన సృష్టి క్రార్యక్రమంలో ఉండి చూచి చూడనట్లు ఉపేక్షించాడు. భృగువు కోపంలో పూజకి అనర్హుడివి అని బ్రహ్మను శపించి అక్కడ నుండి కైలాసంకు వెళ్లాడు. 

🌿అక్కడ శివపార్వతులు నృత్యంచేస్తూ భృగువును చూచీ చూడనట్ల ఉన్నారు. శివుని కేవలం నీ లింగమునకు మాత్రమే అభిషేకం జరుగును అని శపించి వైకుంఠంకు వెళ్లడు. 

🌸అక్కడ కూడా విష్ణువు కళ్లు మూసుకొని తనను గౌరవించలేదని  గుండెలమీద తన్నాడు భృగుడు 
వెంటనే విష్ణుమూర్తి లేచివచ్చి నువ్వు రావడం చూడలేదు క్షమించమన్నాడు . నీపాదాలకున్న నీళ్ళు తగిలి నా పొట్టలో వున్న లోకాలు పవిత్రమయ్యాయి . 

🌸నీ పాదం నా భుజాలకి అలంకారమైంది . నువ్వు రావడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అన్నాడు - విష్ణుమూర్తి . 

🌿 అప్పుడు విష్ణువు వినయంతో భృగువుకు అతిధి మర్యాదలు చేసి కాళ్లు నొక్కుతూ ఆయన పాదంలో ఉన్న కన్నును నొక్కివేశాడు. ఆయన అహంకారం పోయి విష్ణువుని స్తుతించాడు.

🌸అందరిలోకి విష్ణువే గొప్ప అని నిర్ణయించి మునులకు తెలియచేశాడు. అందరూ విష్ణువుని పూజించటం మొదలుపెట్టారు.
    
🌿యవనాశ్వడనే రాజు పిల్లలు లేక బాధపడి భృగుమహర్షి ఆశ్రమంకు వచ్చాడు. భృగుమహర్షి ఆ రాజుతో పుత్రకామేష్టి యజ్ఞం చేయించాడు.

🌸మంత్రజలం జాగ్రత్త పెట్టమని బ్రాహ్మణులకిచ్చాడు .
అందరూ నిద్రపోతున్న సమయంలో రాజుకి దాహం వేసి ఆ నీళ్ళు తాగేశాడు . భృగు మహర్షికి ఆ విషయం తెలిసి నీ భార్య తాగాల్సిన మంత్రజలం నువ్వే తాగావు , కొడుకుని కూడా నువ్వేకంటావు అన్నాడు .

🌿 తర్వాత వంద సంవత్సరాలకి రాజు ఎడమభాగం చీల్చుకుని గొప్ప తేజస్సుతో ఏడుగురు చక్రవర్తుల్లో ఒకడైన మాంధాత పుట్టాడు .

🌸ఒకసారి వింధ్యపర్వత ప్రాంతంలో బాగా కరువొచ్చింది . పితృదేవతలకి ఏమీ పెట్టలేని స్థితిలో భృగు మహర్షి కైలాస పర్వత ప్రాంతానికి వచ్చి ఆశ్రమం కట్టుకుని వున్నాడు .

🌿 పులి మొహంతో భార్యను తీసుకుని ఒక విధ్యాధరుడొచ్చి నాకు ఈ ముఖం ఎలా వచ్చిందో తెలియదు , ఇది పోయే మార్గం చెప్పమని బ్రతిమాలుకున్నాడు .
[12/1, 05:58] +91 73963 92086: 🌸నువ్వు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు తలస్నానం చేశావు ,  ఆ కీడు ఇలా చేసిందన్నాడు భృగు మహర్షి .
[30/11, 22:06] Shobha Rani: 🌿మాఘమాసంలో స్నానం చేశాక నువ్వు మళ్ళీ మామూలుగా అవుతావని చెప్పాడు . 
ఆతను మాఘస్నానం చేసి మామూలు ముఖం పొంది భృగువుకు నమస్కరించి వెళ్లాడు.

🌸భృగువు చెప్పినట్లు శివుని గురించి తపస్సు చేసి పరశురాముడు భార్గవాస్త్రం‍ను సంపాదించుకున్నాడు. భృగుమహర్షి  జ్యోతిశాస్త్రమును రచించాడు. 

🌿ఆ గ్రంథమే భృగు సూత్రములనే పేర ప్రసిద్ధికెక్కింది. ఈయన స్మృతి ఒకటి ఉంది. ఈయన ధర్మ ప్రవక్తగా విలసిల్లాడు. తపశ్శక్తిచే బ్రహ్మత్వాన్ని పొందాడు.

🌸భృగు మహర్షి ధర్మశాస్త్ర ప్రవక్తగా పేరు పొందాడు . ఈయన జ్యోతిష శాస్త్రం రాశాడు . దాంట్లో ఎనిమిది అధ్యాయాలున్నాయి . సృష్టికోసం బ్రహ్మతో సృష్టించబడి చివరకి బ్రహ్మలోనే అయిపోయాడు భృగు మహర్షి .

🌿ఇదండీ మనము తెలుసుకున్న భృగు మహర్షి చరిత్ర రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment