Wednesday, December 14, 2022

ఎలాగైనా సరే దైవాన్ని దర్శించాలనుకుంటే మార్గం ఏమిటి ? ఆధ్యాత్మిక సాధనలో పురోగతి తృప్తి కలుగటంలేదు, ఏవిధంగా సరిదిద్దుకోవాలి ?

 *"శ్రీరమణీయం"* 
     

*"ఎలాగైనా సరే దైవాన్ని దర్శించాలనుకుంటే మార్గం ఏమిటి ?"*

*"అందుకు ముందు లౌకిక జీవనంపై ధ్యాస తగ్గాలి. మనకు ఎంతో తీవ్రమైన బుద్ధి పుడితే గాని అది సాధ్యంకాదు. సాధారణంగా మనందరిలో రెండు రకాల ఇష్టాలు ఉంటాయి. ఒకటి భగవంతుడిని పొందాలనే కోరిక. సుఖ జీవనం సాధించాలనేది మరోకోరిక. దైవంపై విశ్వాసంతో ధర్మజీవనం సాగిస్తే ముక్తి వస్తుంది. మనకి బాగా ఆకలైనప్పుడు ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంది. నిద్ర వచ్చినప్పుడు పడుకో బుద్ధి అవుతుంది. ఇష్టమైన వాళ్ళు గుర్తుకు రాగానే వాళ్ళని చూడబుద్ధి అవుతుంది. మనంతట మనంగా ఏది చేయాలన్నా మనకి ఆ బుద్ధి  పుట్టాల్సిందే. మనం ఏర్పాటు చేసుకుంటే వచ్చేది కాదు నడిపించే అభివృద్ధిని శక్తి నడిపిస్తుంది. ఆ శక్తి మనకి ఆకలి అయ్యేలా, నిద్ర వచ్చేలా చేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన కలగాలన్నా చింతన సాధనగా మారాలన్నా మనం అనుకుంటే జరిగేవి కావు. ప్రేరేపించాలి అక్కడి వరకు వెళ్లి తపస్సు చేసుకునే వాళ్ళంతా అనుకుని వెళ్ళేవాళ్ళు కారు. ఆ శక్తి చేత ప్రేరేపించబడిన వారే ! వైరాగ్యం మనం తెచ్చుకొనేసి కాదు. బుద్ధి పుట్టినరోజు మనలో వైరాగ్యం అదే వస్తుంది !"*

*""ఆధ్యాత్మిక సాధనలో పురోగతి తృప్తి కలుగటంలేదు, ఏవిధంగా సరిదిద్దుకోవాలి ?""*

*"సాధనలో అనుకున్నంత లోతుగా మనసులోకి (అంతర్ముఖంగా) వెళ్ళలేక పోతున్నానని ఒక భక్తుడు ఇలాగే శ్రీరమణమహర్షిని ప్రశ్నించాడు. మనసు బాహ్య విషయాలపై బలమైన బంధంతో ఉండటమే అందుకు కారణమని మహర్షి సమాధానమిచ్చారు. ఆధ్యాత్మిక సాధనలో కోరుకున్న ఫలం రావటం లేదని మనం చింతిస్తూ ఉంటాం. కానీ అందుకు అడ్డంగా ఉన్న విషయాలను గుర్తించి వాటిని వదిలించుకోలేక పోతున్నాం. జపం, ధ్యానం వంటి సాధనలపై మనసు నిలబడటంలేదని చాలామంది అనుకుంటారు. కానీ అప్పటికే మనసు మరేదో విషయంపై నిలిచి ఉండటమే ఇందుకు కారణమని అర్థం చేసుకోరు. చేతితో పట్టుకున్న వస్తువును వదలకుండా, ఎదురుగా కనిపించే పండును అదే చేతితో అందుకోవటం సాధ్యంకాదు. మన మనసు ఒక విషయంపై లగ్నం కావటం లేదంటే అంతకన్నా ఇష్టమైన మరేదో వ్యాపకం అప్పటికి మన మనసును ఆక్రమించుకున్నదని అర్థం !"*

No comments:

Post a Comment