"నేనెవరు" ...?
నువ్వెవరు. ?
ఈ రెండూ బోధపడితే మనిషి తన జన్మకు ఆనవా
ళ్ళు,తన అస్తిత్వానికి మూలాలుతెలుసుకున్నట్లే.!
ఆధ్యాత్మిక గురుబోధవల్ల మాత్రమే ఈ రెండు తెలుస్తాయి.భగవాన్ రమణ మహర్షి కంటే ...
ఈ జీవిత సత్యాన్ని ఇంత లోతుగా ఇంకెవరు
చెప్పగలరు?
ఈ మర్మం తెలుసుకున్న రోజున మానవుడి ఆనం
దానికి అవధులుండవు.అనంతమైనఈ జగత్తులో
తాను పూసుకున్న లౌకిక భవబంధాలరంగువెలిసి
పోతుంది కళ్ళకు కప్పిన మాయపొర తొలిగి….
సత్యం తెలిసి పోతుంది.అప్పుడు విశ్వం ఓఊయ
లవుతుంది.మనం అందులో పరుండే పసి పాపగా మారిపోతాం..!
ఇన్నాళ్ళు లోకంలో పెంచుకున్న స్వార్థపురేఖలు
చెరిగిపోతాయి.భవబంధాల చిక్కుముడులు విడి
పోతాయి.మనం అనుభవించిన బాధలు,మాన
సికక్షోభ దూదిపింజలై ఎగిరిపోతాయి.మన.....
ముందుభూమ్యాకాశాలు కూడా పిల్లాడి చేతిలో ఆటవస్తువులుగా మారిపోతాయి...!!
భగవాన్ రమణుల వారు గొప్ప ఆధ్యాత్మిక గురు
వు.ఆయన బోధనలు నేటికీ ఆధ్యాత్మిక వీచికలై పరిమళాల్ని వెదజల్లు తున్నాయి..
ఈ నూతన సంవత్సర వేళ..భగవాన్ ను తలుచు
కోవడంకంటే మించిన ఆనందమింకేముంటుంది?
No comments:
Post a Comment