❤-బుడుగు గాడి .జాలి గాధ-❤
--
♦️నాకు 1956 లో ఏడేళ్ళు..మరి ఇప్పుడు.. 70 దాటాయి..
♦️నన్ను సృష్టించిన దేవుళ్లిద్దరూ.. దేవుడుదగ్గరకు వెళిపోయారు..
♦️నాకు అసలు నచ్చటం లేదు..ఇక్కడ..
ఈకాలప్పిల్లలు.. గోళీలు అడరు.. పెంకితనం చెయ్యరు..
నాలా అందరికీ హెల్ప్ మంచి మనసుతో చెయ్యరు..వీళ్ళకి స్వార్ధం పెరిగిపోయింది..వీళ్ళకి ఉన్నన్ని ప్రైవేట్లు నాకుండేవి కాదు.. నా ప్రేవేట్లు వేరు.వీళ్ళ ప్రేవేట్లు వేరు..వీళ్ళెప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడుతూఉంటారు.
♦️ఇంగ్లీష్లో మాట్లాడుతూఉంటారు..సున్నుండలు తినరు. కురుకురేలు..చిప్సూ,బర్గర్లూ.పీజ్జాలూ తింటారు.
మొబైల్ గేమ్స్.కార్టూన్లు ..ఆడుకుంటారు.వీళ్ళకి కోతి కొమ్మచ్చ్చి ఆడడం రాదు..
♦️ సీగానపెసూనాంబలు పరికిణీలు వేసుకోరు..
అసలు రెండుజెళ్ళసీతలు లేనేలేరు... మొన్నో నిన్నో కల్యాణి రెండుజెళ్ళ ఫుటో చూసాను...ఈమధ్య ఇంకెవరూ వేసుకోటల్లేదు..అసలు వొంటిజడ.వాలు
జడ కూడా కనపడట్లేదు..
♦️అమ్మలు రాధ లా ఇంట్లో ఉండట్లేదు..వుద్యోగాలకిపోతున్నారు..
ఇంకా చాల చెప్పాలి... బామ్మలు ఇంట్లో ఉండట్లేదు..
ఎక్కడో పల్లెటూళ్ళో ఉంటున్నారు..లేదా ఆశ్రమాల్లో....
♦️బాబాయ్ లు సీతలకి డైరెక్ట్ గ లౌలెటర్ లు ఇచ్చేస్తున్నారు..వాట్స్ అప్ లో మెస్సేజ్లు ఇచ్చుకుంటున్నారు.. ఫేసుబుక్కుల్లో చాట్ చేసుకుంటున్నారు.. ఇంకా పక్కింట్లో పిన్నిగార్లు ఉండట్లేదు..ఆంటీలు.. అంటున్నారు.. ఎవరికీ ఎవరన్నా బయ్యం ఉండట్లేదు..ఇది నాకు అస్సలు నచ్చట్లేదు..ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు....
♦️చాలా ఖోపం గ ఉంది..నన్నెందుకు పుట్టించి,అమాయకంగా పెంచి.ప్రేమించి ఈ లోకం లో పడేసి పోయారో???వాళ్ళిద్దరూ..మళ్ళీ నాలాటి బుడుగులు .వాళ్ళ అల్లరి .అమాయకత్వం వస్తే ఎంత బాగున్నో.. నేనూమళ్ళీ వాళ్ళతో కలిసి పోయి.. హ్యాపీగా వుండేవా...
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
No comments:
Post a Comment