🙏🕉🙏 ...... *"శ్రీ"*
🔥 *"3"* 🔥
🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
💖🔥💖🔥💖🔥💖
💖🔥🕉🔥💖
💖🔥💖
💖
*"ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹*
*"ఇంకా ఇక్కడి విశేషాలను మరికొంత పరిశీలించి చూద్దాం!"*
*"ఇక్కడ ప్రతిరోజూ తెల్లవారుతోంది. పగలు వెళ్ళిపోతోంది. రాత్రి మొదలవుతోంది. రాత్రి తర్వాత మళ్ళీ తిరిగి పగలు ఏర్పడుతోంది. పగలు తిరగడం, రాత్రుళ్ళు పొడుకోవడం. ఎన్నాళ్ళిలా?"*
*ప్రతిరోజూ తిన్నదే తింటున్నాం.*
*"తాగిందే తాగుతున్నాం."*
*"తిరిగిన వీధుల్లోనే తిరుగుతున్నాం."*
*"అదే మంచం ఎక్కి దుప్పటి కప్పుకుని పొడుకుంటున్నాం. రోజూ అదే తిండి. అదే నీరు. అదే మంచం. అదే నిద్ర. అయినా ఎందుకో వీటి మీద ఆశ చావడం లేదు."*
*"దుఃఖం తొలగడమూ లేదు."*
*"ఏమాత్రం అర్దంకాని ఈ పగలు, రాత్రి అనే ప్రయాణం చివరికి ఎక్కడికి?"*
*"ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం ఒకరోజు చావడం దగ్గరకు తప్ప మరొక చోటుకు కానే కాదని మాత్రం తెలుస్తోంది."*
*"ఇందులో అంత ఆశ్చర్యపడాల్సింది మాత్రం ఏముంది."*
*"ఇక్కడ పుట్టే ప్రతిదీ ఒకనాటికి తప్పక నశిస్తుంది."*
*"నిత్యం కొందరు జన్మించడం మరికొందరు మరణించడం అనేది లోకంలో కనిపిస్తున్నదే..!"*
*"మరి ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే అయినప్పుడు ఈ దుఃఖం దేనికి?"*
*ఈ ఆరాటం దేనికి?*
*"నాలో ఏర్పడి ఉన్న ఈ “నాది - నావి - నావాళ్ళు” అనే భ్రమంతా నాకు ఎక్కడినుంచి వచ్చింది?"*
*"ఈ జీవితమే మూన్నాళ్ళ ముచ్చటని ఒక ప్రక్క తెలుస్తూనే ఉన్నప్పటికీ మరి నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను."*
*"చాలా డబ్బు సంపాదించాలి.. దాన్ని భద్రంగా దాచుకోవాలి.. అందరికంటే పెద్దవాణ్ణి అయిపోవాలి అని. ఇదంతా పిచ్చి కాకపోతే ఇంకేంటి.!"*
*"నా దుష్ట తెలివితేటలతో జీవితమంతా శ్రమించి ఎంత సంపాదించినా మరణంతో అదంతా ఇక్కడ వదిలెయ్యాల్సిందే గదా.!"*
*"ఇక్కడ వదిలెయ్యాల్సిన దానికోసం నేనెందుకు ఇంత ఆరాటపడుతూ, ఆయాసపడుతూ సంపాదిస్తున్నాను?"*
*"అలా అని ఎందుకనుకోవాలి ఇదంతా నా వారి కోసం గదా అనుకుందామనుకుంటే!"*
*"నా వారు అనేదానికి ముందే నేను ఉండి ఉండాలి కదా!"*
*"నేను లేకుండా నా వారు అనేవారు ఎక్కడనుంచి వస్తారు."*
*"ఆ “నేను” అంటే ఎవరు?"*
*"అసలు “నేను” అనేది నాలో దేనిని?"*
*"ఇలా నేనెవరో నాకే అర్ధం కానప్పుడు ఇక నావారు అనేదంతా ఏంటి?"*
*"పిచ్చి మోహం కాకపోతే! నావారు సంగతి సరే! అసలు నేనెవరివాడిని?"*
*"నన్ను మా వాడు అనుకున్నవాళ్ళు ఇప్పుడెక్కడ ఉన్నారు?"*
*వారు లేరు.*
*"కొన్నాళ్ళ తర్వాత నేను ఉండను."*
*"ఇక నా వాళ్ళు అనుకునేవాళ్ళు మాత్రం ఇక్కడెన్నాళ్ళు ఉంటారు."*
*"ఈ నేను నాది అనుకునేదంతా ఒక నాటికి కాలం చేతిలో మింగబడబోయేదే గదా.!"*
*"నిన్నటి వరకు పెద్ద వీరుడు, శూరుడు, ధనవంతుడు అనిపించుకున్నవాడు నేడు విగత జీవుడై పాడెమీద నిస్తేజంగా వెల్లికిలా పొడుకుని మౌనంగా స్మశానానికి పయనమయిపోతున్నాడు."*
*"అక్కడ గుప్పెడు బూడిదగా మారి మట్టిలో కలిసిపోవుచున్నాడు."*
*"ఈ శరీరాల యొక్క అంతిమ సత్యం గుప్పెడు బూడిదే కదా!"*
*"ఈ మాత్రం దానికి ఇక్కడ ఇంతటి మోహం, ఇంతటి స్వార్ధం, ఇంతటి దుఃఖమా?"*
*"ఇదంతా ఎంతటి బాధాకరం."*
*"ఇది బహు విచిత్రంగానూ, అయోమయంగానూ ఉంది. కాసేపు ఇదంతా ప్రక్కన పెడితే!"*
*"మరి ఇక్కడ జీవించి ఉన్న కాలంలో దేన్ని పొందితే ఈ జీవితం ముగిశాక కూడా అది నాతోపాటే వస్తుంది?"*
*"అలాంటిదేదయినా అసలు ఇక్కడ ఉందా?"*
*"అలాంటిది ఏదో ఒకటి ఇక్కడ తప్పక ఉండే ఉండవచ్చు."*
*"అలా కాకపోతేగనక ఈ జన్మించడం అనే శ్రమ నాకు ఎందుకు ఉంటుంది."*
*"ఏదో ఒక ప్రయోజనం ఇక్కడ ఉండి ఉన్నందునే బహుశ నేను ఇక్కడ జన్మించి ఉంటాను."*
*"అయితే అది ఏదో సంపాదన పిచ్చిలో పడి పొర్లాడుతున్న ఇప్పటి నా దుష్ట బుద్ధికి తెలియడంలేదు."*
*"కానీ అది నేను తప్పక తెలుసుకోవాలి."*
*"ఎలా తెలుసుకోవాలి?"*
*"బహుశ అది తెలిసిన మహాత్ములను నేను తెలుసుకోగలిగితే అప్పుడు ఆ సత్యాన్ని వారిద్వారా నేను తెలుసుకోవచ్చు."*
*"సర్వం ఎరిగినవారు ఈ లోకాలలో ఎక్కడో ఒకచోట తప్పక ఉండే ఉంటారు."*
*"ఎలాగయినా సరే అది ఎంతటి శ్రమ అయినా సరే నా ఈ జీవితం మొత్తం కరిగిపోయినా సరే ఈ శరీరం కూలిపోయేలోపల ఆ మహాత్ములను నేను తప్పక చేరుకుంటాను."*
*"కాబట్టి ఇప్పటినుంచి ఇక నా పని వారిని గుర్తించడమే."*
*"వారిని గుర్తించి వారిని ప్రార్ధించి వారినుంచి తెలుసుకోవాల్సిన ఆ సత్యాన్ని తెలుసుకుంటాను."*
*"ఆ తర్వాత మిగిలిన జీవితమంతా అది పొందే ప్రయత్నం చేస్తాను."*
*"ఒకవేళ ఈ జన్మలోనే గనక ఇది జరక్కపోతే నేను మళ్ళీ మళ్ళీ ఈ లోకాలలోకి శరీరాలతో రావలసి ఉంటుంది."*
*"అయితే ఇప్పటిలా ఈ మానవదేహాన్ని తర్వాత రాబోవు జన్మలలో కూడా నేను పొందగలను అనే నమ్మకం ఏముంది?"*
*"ఏ పశు, పక్షి, కీటకం లాంటి దేహాలు గనక నేను పొందితే ఇక అప్పుడు నా పరిస్థితి ఏంటి?"*
*"ఆ దేహాలు లోకంలో అందరికీ తిరస్కారమైనవే కదా!"*
*"ఆ దేహాలతో నన్నెవరు దగ్గరకు రానిస్తారు?"*
*"అప్పుడు ఇక ఆ దేహాలతో నాకు ముక్తి ఎలా లభిస్తుంది."*
*"కాబట్టి ఇప్పటివరకూ వృధా అయిన కాలం ఏదో వృధా అయింది."*
*"ఇక ఇప్పటినుంచి ఒక్క క్షణం కూడా ఆలస్యంగాని, వృధాగాని కానివ్వకుండా జ్ఞానులకొరకు తీవ్ర ప్రయత్నం చేస్తాను అనుకుంటూ తనలో ఒక దృడ సంకల్పాన్ని ఏర్పరచుకుని మహాత్ముల కొరకు లోకాన్ని జల్లెడ పడుతున్నాడు."*
*"శాశ్వతమయిన ఆత్మ శాంతి కొరకు లోకం అంతా అలా మాసిన బట్టలతోనే మహాత్ముల కొరకు గాలిస్తూ తిరుగుతూనే ఉన్నాడు."*
*"ఎక్కడయినా ఎవరయినా పెడితే అంత తింటున్నాడు."*
*"లేకుంటే మార్గమధ్యంలోని పంట కాలువలలోకి దిగి గుక్కెడు నీళ్ళు గొంతులో పోసుకుని శక్తిని కూడదీసుకుంటూ మళ్ళీ మహాత్ముల కొరకు అన్వేషిస్తూ తిరుగుతున్నాడు."*
*"మానవుడు దేనికొరకు తీవ్రమయిన ప్రయత్నం చేస్తే అతడు దాన్ని తప్పక పొందుతాడు అనేది సృష్టి ప్రారంభంలో సృష్టికర్త ఏర్పరచిన ఒక నియతి."*
*"అందువల్ల అతడి మహాప్రయత్నం అనే తీవ్ర అన్వేషణ ఫలించి అతడి ప్రశ్నలకు సమాదానం చెప్పగలిగే గురువు ఒకనాటికి అతడికి లభిస్తున్నాడు."*
*"అలా అతడికి లభించిన గురువు అతడి దుఃఖం మొత్తం తొలగించడానికి చెప్పే జ్ఞానమే ఆత్మ జ్ఞానం."*
*"అంతటి మహత్తరమయిన విలువగలిగిన ఆత్మజ్ఞానాన్ని ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం."*
*"ఆత్మ స్వరూపులయిన తామందరూ ఈ చెప్పబోవు ఆత్మ జ్ఞానం మీదే మనస్సు పూర్తిగా పెట్టి రెండు చెవులతో వినే ప్రయత్నం చెయ్యమని ప్రార్దన."*
No comments:
Post a Comment