✴️🕉️👘✴️🕉️👘 ✴️🕉️👘💓👘🙏🕉️🌈💓🪷🌷💐
*ఆధ్యాత్మికత అంటే చాలా మందికి కొన్ని పుస్తకాలు చదవడం, లేదా పుస్తకాల్లో ఉన్నదాన్ని చదివి అందరికీ తెలపడం, విషయ గ్రహణతో లేదా జనాలని పోగేసుకుని ఏవేవో లోకాల గురించి చర్చించు కోవడం...*
*"నిజానికి ఆధ్యాత్మికత అంటే అది కాదు." ఆధ్యాత్మికత అంటే “ఆది నుండి ఉన్న ఆత్మ కథ.” ఏ పుస్తకాలలో దొరకనిది, పదాల్లో వెతకలేనిది...*
*మరి ఎలా తెలుసుకోవాలి దాన్ని??*
*నేనేంటో, నా కథ ఏంటో, ఏమి చేయాలో, ఏది చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడ కూడదో... ఇలా చాలా తెలుస్తాయి, మౌనం ద్వారా, సమయస్ఫూర్తి ద్వారా...*
*నేను అంటే ఏదో నాకు తెలిపే నిర్విషయ యోగమే అసలైన ఆధ్యాత్మికత... అదే ధ్యానం...*
*నిరంతర ధ్యాన సాధన ద్వారా తనని తాను తెలుసుకోవడమే ఆధ్యాత్మికత!!*
*అలాగే “🕉️ఓంకార✴️🕉️ధ్యాన💓 సాధన”ద్వారా తనని తాను మార్చుకుంటూ, ఆచరణను, ఆలోచనలను సరి చేసుకుంటూ, మార్పును స్వీకరించుకుంటూ చేసే ప్రక్రియనే అసలైన ఆధ్యాత్మికత...*
🧘♂️🧬🧬 🧬🧬🧬 🧬🧬🧘♀️
*ఇంతటి జ్ఞానాన్ని, ధ్యాన సాధనను మాకందించిన "గురువులు గారికి” మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము స్నేహితులారా.*
💎💐🪢 💐🪢💐 🪢💐💎
No comments:
Post a Comment