*సార్ సినిమాపై ఒక రివ్యూ🙏*
ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే ఏం చేయగలడో చూపించిన సినిమా.
ఉపాధ్యాయుల గౌరవాన్ని, బాధ్యతను ఆకాశమంత ఎత్తులో చూపించిన సినిమా.
అదేవిధంగా విద్యార్థులు తలుచుకుంటే తాము అనుకున్నది సాధించవచ్చు అని చూపించిన సినిమా.
విద్యలో సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలో చూపించిన సినిమా.
తాము ఎలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చామో అదే పరిస్థితుల్లో ఉన్న విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చూపించిన సినిమా.
రాజకీయ నాయకులు స్వార్థంతో ప్రభుత్వ విద్యా సంస్థలను నాశనం చేసి విద్యను ప్రైవేటు, కార్పోరేట్ వ్యక్తులకు అప్పజెప్పి ఏ విధంగా వ్యాపారంగా మార్చారో చూపించిన సినిమా.
వసతుల కొరతతో, ఉపాధ్యాయుల కొరతతో, కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం ఎలా సన్నగిల్లుతుందో చూపించిన సినిమా.
అందరికీ నాణ్యమైన విద్య అందించాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన సినిమా.
ఎలాగోలా సంపాదించి జీవించడం కాదు గౌరవంగా జీవించాలంటే విద్య అవసరమని చాటిన సినిమా.
సమాజంలో అణిచివేతకు గురవుతున్న మహిళలకు, వెనుకబడిన వర్గాల వారికి విద్య ద్వారానే గౌరవం దొరుకుతుందని చూపించిన సినిమా.
ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి ప్రజల కష్టాలు, వారు విద్యకు ఎలా దూరమవుతున్నారో చూపించిన సినిమా.
సామాజిక కట్టుబాట్లను అధిగమించి అందరూ కలిసిమెలిసి జీవించడానికి విద్య ఎలా దోహదపడుతుందో చూపించిన సినిమా.
విద్యను దేవుడి నైవేద్యంలా అందరికీ పంచాలి కాని ఫైవ్ స్టార్ హోటల్లోని ఆహారంలా అమ్మకూడదని సందేశం ఇచ్చిన సినిమా.
నాణ్యమైన విద్యపై చర్చను ప్రారంభించిన సినిమా.
నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలని పార్టీలకు, ప్రభుత్వాలకు ప్రజల ప్రధాన డిమాండ్ గా మారాలని చూపించిన సినిమా.
పేదల జీవితాలు మారాలన్న, సామాజిక అంతరాలు అంతమై దేశం అభివృద్ధి చెందాలన్నా నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమని తెలిపిన సినిమా.
విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా!
*సార్ సినిమా.*
ఉపాధ్యాయుల మీద సెటైర్లు వేస్తూ అధ్యాపకులను అవహేళన చేస్తూ హాస్యం అని సర్ది చెప్పుకునే ఈరోజుల్లో
ఒక అధ్యాపకుడి సామర్ధ్యం ఎలా ఉంటుందో...
ఎన్ని కోణాలలో ఉంటుందో కళ్ళకు కట్టునట్టు చూపించారు...
ఉపాధ్యాయ వృత్తి అంటే జీతం తీసుకునే ఉద్యోగం కాదు... అదొక బాధ్యత...
కొన్ని జీవితాల బాధ్యత.……
No comments:
Post a Comment