*ఏది నిజమైన పూజ*
ఈశ్వరుడికి పరిశుద్ధమైన భక్తితో చేసిన పూజ మాత్రమే నిజమైన పూజ. భక్తి అనే పదం ఇక్కడ గమనించదగ్గది. ఇతరులకు ఆర్భాటం చూపటానికి గానీ, ప్రచారం పొందటానికి గానీ, పూజ చేయకూడదు. మనం చేసే పూజ వలన అందరికీ మంచి కలగాలని పూజించాలి. కొందరు పూజకన్నా సంకల్పానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. సంకల్పం కన్నా మనం చేసే పూజలో శ్రద్ధా, భక్తి ఉండాలి. ఈశ్వరుడికి తెలుసు మన మంచి,చెడు రెండూ.
కుచేలుడు శ్రీకృష్ణపరమాత్మను కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు తనకు ఏదైనా కావాలని అడగలేదు . శ్రీకృష్ణుడిని ఆనందపరచటానికి గుప్పెడు అటుకులు మాత్రమే ఇచ్చాడు. శ్రీకృష్ణుడు కూడా ప్రేమతో ఇచ్చిన అటుకులను స్వీకరించి మూడు నిమిషాలలో కుచేలుడిని కుబేరుడిని చేసాడు. కాబట్టి మనం ఈశ్వరుడిని ఏమీ అడగక్కర్లేదు అని చెప్పటానికి ఇదొక నిదర్శనం.
కాబట్టి మనం ఏ పని చేసినా ఈశ్వరకృప కలగాలని చేయాలి గానీ ప్రచారం, ఆర్భాటం కోసంకాదు. భక్తితో పది నిమిషాలు పూజించినా చాలు, గంటలకొద్దీ కూర్చుని మనస్సంతా వ్యర్ధ ఆలోచనలు పెట్టుకుని పూజించనక్కరలేదు. పూజించే సమయం తక్కువైనా అది శుద్ధమైన భక్తితో చేస్తే ఈశ్వరుని కృప, పుణ్యం లభిస్తుంది.
--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.
No comments:
Post a Comment