🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"469"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"అనుభవం మరొక అనుభవంకోసం ఎందుకు దారితీస్తుంది ? అది మనోదౌర్భల్యమేనా !?"*
*"మనం వస్తువులు, అనుభవాలు మనతో పాటు నిలిచిపోతాయన్న భ్రమలో ఉంటాం. తనతో రానిదేది తనది కాదు. ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఈ సృష్టిలో ఏ వస్తువు కూడా ఎవరిదీ కాదు. ఎవరిదీ కాని వస్తువుని మనదిగా భావించవచ్చు. కనుక ఈ సృష్టిలో మనది కానిదిగాని, మన సొంతం అయినది కానీ లేదు ! సముద్రంలో చేపకు ఎల్లలు లేని స్వేచ్ఛ ఉంటుంది. సముద్రమంతా తనదే. దానికి సముద్రమంతా సంచరించే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఒక్క నీటి బొట్టు కూడా అది తనతో తీసుకు వెళ్ళే హక్కు లేదు. ఇక అనుభవం విషయంలోనూ అదే జరుగుతుంది. శరీరంపై ఒక చొక్కా ఉండగా మరొక చొక్కాతో అవసరంలేదు. కానీ ఇష్టమైన స్వీట్ రుచి చూసిన కొద్దిసేపటికే మరొక స్వీట్ తినాలనిపిస్తుంది. మొదట తిన్న స్వీట్ తాలూకా తీయదనం వేసుకున్న చొక్కా లాగా నిలిచి ఉంటే రెండో స్వీట్ తో పనిలేదు. కాబట్టి ఆ అనుభవం మనలో నిలిచిఉండదని అర్థమవుతుంది. అందుకే మనం అన్నింటినీ మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటున్నాం. తీపి తిన్న అనుభూతి మన గ్రహింపులో ఉందికానీ, గ్రహింపే తీపిగా మారటంలేదు. ఆ గ్రహింపు అన్ని అనుభవాలను తనపై నిలుపుకుంటుందేగాని ఏది తనలో కలుపుకోదు. ఈ అవగాహన ఏర్పడితే అనుభవాన్ని మళ్ళీమళ్ళీ కోరుకునే వెంపర్లాట తగ్గుతుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment