రాత్రి కథ
ప్రత్యేక వ్యక్తి యొక్క సుందరత
ఒక రాజ్యం లో ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కాలు ,ఒక కన్ను మాత్రమే వున్నాయి . రాజు చాలా తెలివైనవాడు మరియు ధైర్య వంతుడు కాబట్టి ఆ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు.ఒకసారి రాజు తన బొమ్మను గియించాలని ఎందుకో ఆలోచన వచ్చింది.అప్పుడు రాజు దేశ విదేశాల నుండి చిత్రకారులను పిలిపించాడు .ఒకరికి మించిన ఒకరు చిత్ర కారులు రాజ్య సభ ముందు హాజరు అయ్యారు .రాజు అందరకి నమస్కరించి వారందరికి తన అందమైన బొమ్మను గియాలని కోరాడు దానిని రాజ్య దర్బార్లో ఏర్పాటు చేయాలనుకున్నట్లు చెప్పాడు .
చిత్రకారులందరూ ఆలోచించడం మొదలు పెట్టారు ,రాజు మొదటి నుంచి వికలాంగుడు కదా , అప్పుడు అతని చిత్రాన్ని ఎలా అందంగా గీయడం ? ఇది సాధ్యం కాదు మరియు చిత్రం అందంగా లేకపోతే రాజుకు కోపం వచ్చి శిక్షిస్తారు అని అలోచించి రాజు బొమ్మను గీయడానికి నిరాకరించారు.
అప్పుడు ఒక చిత్రకారుడు వెనుక నుండి చేయి పైకెత్తి, నేను మీ బొమ్మను చాలా అందంగా నేను గీయగలను మీకు చాలా నచ్చుతుంది అన్నాడు . అప్పుడు చిత్రకారుడు రాజు ఆదేశాలతో చిత్రాన్ని గీయడం లో నిమగ్నమయ్యాడు . కొంత సేపటి తరువాత ఒక చిత్రాన్ని గీశాడు . రాజు ఆ చిత్రాన్ని చూసి చాలా
సంతోషపడ్డాడు.కానీ చిత్రకారులందరూ వారి వేలిని వారి దంతాల క్రింద నొక్కి పెట్టి ఉంచారు .చిత్రకారుడు రాజు గుర్రంపై ఒక కాలు పూర్తిగా కనిపించే విధంగా కూర్చున్నాడు, మరియు జుట్టు గాలికి కంటిపైన కప్పబడినట్లు ఉంది! రాజు తన తెలివికి చాలా సంతోషించాడు.ఆ చిత్రకారుడు రాజు యొక్క వికలాంగాన్ని ఎంత తెలివిగా ఒక అందమైన చిత్రంగా గీశాడు .రాజా మెచ్చుకుని అతనికి చాలా బహుమతులు మరియు ధనాన్ని ఇచ్చాడు.
కాబట్టి మనం కూడా ఎదుటి వారి లోపాలను చూడకుండా ,వారి యొక్క విశేషతల పైన, మంచితనం పైన దృష్టి పెట్టాలి . ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు ఒకరి లోపాలను చాలా త్వరగా వెతుకుతారు , మనలో ఎన్ని లోపాలు వున్నా ఇతరుల లోపాలువెతగడం లో ఎప్పుడూ శ్రద్ధ చూపుతారు .వాళ్ళు ఇలాంటి వారు , అలాంటివారు అని .
ప్రతికూల పరిస్థితులలో కూడా మనం సానుకూలంగా ఆలోచించాలి
మరియు మన సానుకూల ఆలోచన విధానం మన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది
🔹🔸🔹 ♦️ 🟠 ♦️
No comments:
Post a Comment