*🌿🌼🙏అరుణాచలం వెళ్ళే భక్తులందరికీ ఒక మనవి ... పౌర్ణమికి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవారు లక్షల్లో ఉంటారు, మన తెలుగు వారు కూడా వేలల్లో వస్తుంటారు అని అందరికీ తెలిసిన సంగతే ... మీలోనూ చాలా మంది చేసే ఉండచ్చు ... అయితే మనందరం కొన్ని విషయాలు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ... అసలు మనం అరుణాచల గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నట్లు ? అరుణాచల పర్వతం అంటే ఏమిటి ? అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే విధానం ఏమిటి ? *🕉️🚩🕉️
ఈ ప్రశ్నలకు సమాధానం మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది, అయినా కాస్త ఓపికగా పూర్తిగా చదివమని మనవి చేసుకుంటున్నాము.
అరుణాచలం సాక్షాత్తూ శివుడే ఒక పర్వత రూపంలో ⛰️దర్శనమిచ్చే మహా క్షేత్రం, అటువంటి క్షేత్రంలో అడుగు పెట్టడం అంటే తండ్రి ఒడిలోకి చేరిన అనుభూతి కలగాలి ... మన నాన్న ఏదైనా పనిలో నిమగ్నమై ఉంటే, ఆయనకు మన వల్ల ఏ ఇబ్బంది కలుగకుండా ఎంత జాగ్రత్తగా నడుచుకుంటామో, అలానే ధ్యానంలో నిమగ్నమై ఉన్న పరమేశ్వరునికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అంత కంటే ఎక్కువ జాగ్రత్తగా నడుచుకోవాలి కదా ... గిరి ప్రదక్షిణ చేసే సాటి భక్తులకు కూడా ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలి .
⛰️ అరుణాచల గిరి ప్రదక్షిణలో మేము గమనించిన కొన్ని విషయాలు మా హృదయాన్ని కలచి వేశాయి ... ముఖ్యంగా మన తెలుగు వారు చేస్తున్న గిరి ప్రదక్షిణలో అనుకోకుండా నా చెవిన పడిన కొన్ని విషయాలు, నేనుగా కొంతమందిని అడిగి తెలుసుకున్న విషయాలు చాలా బాధను కలిగించాయి ... మన వాళ్ళు చేసే కొన్ని పనులు ఇంకా ఎక్కువ బాధ కలిగించాయి ... వాటిని మీ ముందు ఉంచుతున్నాము .
షుమారు 55 సంవత్సరాల వ్యక్తిని పలకరించాను, ఆయన చెప్పిన విషయాలు ... మాది ఫలానా ఊరు, నేను ఒక బ్యాంక్ లో పని చేస్తున్నాను, ఎక్కువ సేపు కూర్చుని చేసే పని కనుక కాస్త పొట్ట పెరిగింది, రోజు ఎంత వాకింగ్ చేసినా, ఇలా అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కొంచెము ఎక్కువ సేపు వాక్ చేయొచ్చని అని ఇలా వస్తుంటాను .
ఇద్దరు తెలుగు👭 ఆడవారు నిదానంగా నడుస్తూ ఇలా మాట్లాడుకుంటున్నారు ( ఒక రెండు నిమాషాలలో వారి సంభాషణ ఇలా సాగింది ) ... మొన్న మా ఆడపడుచు కూతురి పెళ్ళికి వెళ్లినప్పుడు నేను కట్టుకున్న చీరే హైలైట్ అయ్యింది ... మా ఆడపడుచు నా చీర చూసి తెగ కుళ్ళుకుంది ... తన చెల్లెలి చేత ఎక్కడ కొన్నానని అడిగించింది .
షుమారు 25 సంవత్సరాల వయసు గల నలుగురు 👬👬కుర్రవాళ్ళు ఉడికించిన వేరు శెనగ తింటూ, ఆ పొట్టును దారంతా వేసుకుంటూ వెళుతున్నారు . " ఆ పబ్లిక్ టాయిలెట్స్ అంత శుభ్రంగా ఉండవు, బయట కానిచ్చేస్తే హాయిగా ఉంటుంది రా ...", అని స్నేహితునికి ఒకరి ఉచిత సలహా .
" ఊ ... త్వరగా నడువు అప్పుడే బాగా చెమట పట్టి కొవ్వు కరుగుతుంది, అని ఒకరు తన భార్యతో అంటున్నారు.
ఇక్కడ అరటి పువ్వుతో వేడి వేడి వడలు🧆 వేస్తుంటారు అవి తింటే, ఎక్కడ ఉన్నా ప్రతి పౌర్ణమికీ వెతుక్కుంటూ అరుణాచలం వచ్చేస్తావ్ అని ఒకరు .
🎋చెరకు గడలు తింటూ ఆ పిప్పిని రోడ్ మీదే ఊసేసే వాళ్ళు కొందరు ..., ఉడికించిన మొక్క జొన్న కంకులు తిని వాటిని రోడ్ మీద వేసే వారు కొందరు... , పుచ్చకాయ తిని ఆ తొక్కలను రోడ్ మీదే వేసేవారు కొందరు, కాళీ నీళ్ళ బాటిళ్ళు,🧂 కూల్ డ్రింక్ టెట్రా పాక్ బాటిళ్ళు రోడ్ పైనే,
ఇలాంటివి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి ... అరుణాచల పర్వతం అంటేనే సాక్షాత్తూ శివ స్వరూపమని, దేవతలు సైతం అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తుంటారని, కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే గానీ కనీసం అరుణాచలం గురించి వినలేమనీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వంటి గురువులు తమ ప్రవచనాల ద్వారా చెప్పారు ... అటువంటి క్షేత్రానికి వెళ్లినప్పుడు మనం భక్తి శ్రద్ధలతో పాటుగా, ఆ క్షేత్ర పవిత్రతను, శుభ్రతను కాపాడాలా వద్దా చెప్పండి !
🤫మౌనంగానో, 👏నామ స్మరణ చేస్తూనో చేయాలి గానీ ఎప్పుడూ ఉండే ముచ్చట్లు మాట్లాడుకోవడానికి అరుణాచలం ఎందుకు వెళ్ళడం .
మార్గ మధ్యలో ఏదైనా తినడం తాగడం సహజమే కానీ కేవలం తినిన తరువాత, తాగిన తరువాత ఆ వ్యర్ధాలను చెత్త కుండీలో వేయడం మన కనీస బాధ్యత కాదా !
వాకింగ్ కోసమనో, కాసేపు సరదాగా స్నేహితులతోనో, బంధువులతోనో కలిసి నాలుగు రోజులు గడిపి రావడానికో, అరుణాచలం రావడం ఎందుకు ... అటువంటి వాటి కోసం ఎన్నో విహార యాత్రలు ఉన్నాయి కదా
పబ్లిక్ టాయిలెట్స్ అంటే అవి శుభ్రంగా ఉండకపోవచ్చు, అవి అలా ఉండడానికి మనం కూడా కొంతవరకూ బాధ్యులమే, కొందరు అక్కడి టాప్ లను కనీసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు, ఎవరైనా వాడుతుంటే వాటిలో నీళ్ళు తీసుకుని కనీసం మళ్ళీ కట్టేయకుండా వెళ్ళిపోతుంటారు .. ప్రసాదంగా ఇచ్చినవి జాగ్రత్తగా కింద పడకుండా తినడానికి ప్రయత్నించాలి, పొరపాటున కింద పడినా, లేదా అది మనకు సహించకపోయినా ఎవరూ తొక్కకుండా, వాటిని తీసేసి చెత్త కుండీలలో వేయాలి కదా ... రోడ్ మీద ఎన్నో చోట్ల ప్రసాదాలు కింద పడి ఉంటాయి
పువ్వులు 🌸💐🪷🌹అమ్మవారి స్వరూపం అవి ఎక్కడైనా నెల మీద పడి ఉంటే వాటిని తీసి ఎవరూ తొక్కని చోట వేయాలి .
క్షేత్ర పవిత్రతను మనమే కాపాడాలి, 🏘️మన ఇల్లు ఎంత శుభ్రంగా అందంగా ఉండాలని కోరుకుంటామో అంతకంటే అందంగా మన ఆలయం🛕 ఉండాలని కోరుకోవాలి, అందుకు మన వంతు కృషి చేయాలి .
🙏ఎవరి మనసైనా కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించండి, మార్పు మనలోనే , మనతోనే మొదలవ్వాలి, మీరు కూడా స్వచ్ఛమైన, పరిశుభ్రమైన అరుణాచలాన్ని చూడాలని ఆశిస్తుంటే ఇది అందరికీ షేర్ చేయండి, అందరికీ దీని ప్రాముఖ్యతను వివరించి చెప్పండి, మీవంతుగా అరుణాచలం స్వచ్ఛతను కాపాడేందుకు ప్రయత్నించండి, అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తున్నాము.
ఇది మన నినాదంగా పెట్టుకుందాం
" అరుణాచలం విహార యాత్ర కాదు
మనల్ని పరమేశ్వరునిలో లయం చేసే తీర్థ యాత్ర 🕉️🚩🕉️
No comments:
Post a Comment