Tuesday, February 28, 2023

16. ఆత్మ జ్ఞానం, మోక్షమార్గం

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 🔥 *"16"* 🔥
   🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
   🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
     💖🔥💖🔥💖🔥💖
           💖🔥🕉🔥💖
                 💖🔥💖
                       💖
*"ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు "*

*"చివరిగా మోక్షాన్ని పొందడానికి మానవుడు ఎలా ప్రయత్నించాలి అనేది చెప్పుకుందాం."*

*"ఒకడికి పట్టు వస్త్రాలు లభించలేదని ఉన్న వస్త్రాలను వదులుకోడు కదా."* 

*"పట్టు వస్త్రాలు లభించేంతవరకూ ఉన్న వస్త్రాలను కట్టుకుంటాడు."* 

*"అలాగే మోక్షం లభించేంత వరకూ మహా మహా జ్ఞానులకే శరీర భ్రమ కొద్ది కొద్దిగా అయినా నిలిచి వుంటుంది."* 

*"శరీర భ్రమ ఉన్నంతవరకు ఆహరం, గృహం, నీరు లాంటివి ఎవరికయినా కావలసిందే."* 

*"వాటికొరకు మానవుడు ప్రయత్నించాల్సిందే."* 

*"అలా కాకుండా ఏదో సుఖాన్ని పొందాలి మరేదో సాధించాలి ఇంకేదో పొందాలి  నేను అంతటి వాణ్ని కావాలి ఇంతటి వాణ్ని కావాలి గొప్ప ధనవంతుణ్ణి కావాలి అని అనుకుంటూ ధనం కొరకు ప్రయత్నించకూడదు."* 

*"అలాంటి భావనలన్నీ మనసులోంచి తొలగించి వెయ్యాలి."* 

*"మోక్ష్యం లక్ష్యంగా కలిగినవాడు ధనంలేని పేదవాడయితే కేవలం ఆహారం కొరకు మాత్రమే కర్మలు చెయ్యాలి."* 

*"శరీర లక్షణాలయిన కామం, క్రోదం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే లక్షణాలను విడచిపెట్టాలి. మోక్షం లక్ష్యంగా కలిగిన వ్యక్తికి భార్యా, పిల్లలు ఉన్నారనుకుందాం. అప్పుడు వారి ఎడల అతడు ఎలా మెలగాలి అంటే!"* 

*"వాళ్ళను రక్షించడం అతడి కర్తవ్యం కనుక ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాలి."*

*"నా భార్య, నా పిల్లలు అనుకుంటూ ప్రేమ, మోహం అధికం చేసుకోగూడదు."* 

*"గొప్పలకు పోకుండా తక్కువ ఖర్చుతో పిల్లలను చదివించడం, వారికి కూడా తనకు తెలిసిన ధర్మం, మోక్షం గురించి చిన్నతనం నుంచే తెలియచేస్తూ వారిలో కూడా ప్రపంచ మోహాన్ని తగ్గిస్తూ, ఇక వారిఎడల తన కర్తవ్యాన్ని నెరవేర్చడం కొరకు మాత్రమే ధర్మ మార్గంలో డబ్బు సంపాదించాలి."*

*"మనం సంపాదించే డబ్బుని పరులు నిందించకపోవడమే ధర్మమార్గం."* 

*"ఇక అనేక లోకులు అనేక విధాలుగా ప్రదర్శించే గొప్పలను మనమూ ప్రదర్శించాలని భావిస్తూ మనకేం అవసరమో ఎంత అవసరమో తెలీని స్థితిలోకి వెళ్ళిపోతూ ఎక్కడో ఒక అగాధంలో కూలకుండా జాగ్రత్త వహించాలి."* 

*"మనకు చలి వేస్తె అగ్ని వద్దకు వెళ్లి తగినంత దూరంలోనే నించుని చలి తీవ్రతను తగ్గించుకుంటాం."* 

*"అంతేగాని చలి వేస్తోందని అగ్నిలోకి దూకము గదా!"*

*"మనకు దాహం అనిపిస్తే నది వద్దకు వెళ్లి దాహం తీరడానికి మాత్రమే కొంచెం నీరు తాగుతాముగాని నదిలోకి దూకం గదా!"*

*"ఈ విశ్వంలో ఎంతో గాలి ఉన్నా మనకు అవసరమయినంతే పీల్చుకుంటున్నాం."* 

*"ఇన్ని విషయాల్లో మనకు ఎంతవసరమో తెలుసుకుని అంత మాత్రమే స్వీకరిస్తున్నాం."* 

*"కానీ ఈ ధనం దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనకు అది ఎంత అవసరమో తెలుసుకోలేక శరీరం యొక్క విలువయిన ఆయుష్షు అంతా డబ్బు సంపాదించే కార్యక్రమాలకే వెచ్చించి చివరి రోజుల్లో సంపాదించిందంతా చూసుకుంటూ నేను జీవితం మొత్తం కష్టించి సంపాదించిందంతా ఎవరెవరో తింటున్నారు అని లోన ఏడుస్తూ ఒక రోజు ఈ శరీరంతో పాటు పతనం అవ్వడం జరుగుతోంది."* 

*"ఇదంతా ఎంత విచారకరం."* 

*"డబ్బు లేనివారికి కొంత డబ్బవసరం."* 

*"డబ్బు ఉన్నవారికి డబ్బెందుకు?"* 

 *"కాలాన్నంతా మోక్షం కొరకు ఉపయోగించుకోవచ్చు గదా?"*

*"ఈ లోకంలోని జనులు తమ జీవితకాలమంతా చెమటోడ్చి సంపాదించిన దానిలో 99% ఇక్కడే వదిలేసి మరణంతో పర లోకాలకు వెళ్ళిపోవుచున్నారు."* 

*"విచిత్రం ఏంటంటే 99% ఇక్కడే వదిలెయ్యాల్సిన సంపదల కొరకు మానవుడు తన జీవితకాలంలోని 99% ఆయుష్షును ఖర్చు చెయ్యడమే."* 

*"ఇదెంతటి విచారకరం."*

*"మానవుడి ఈ అమాయకత్వం గమనించిన జ్ఞానులు అతడికి నచ్చ చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు."*

 *"కానీ మానవుడికేమో ఇదంతా చెవికెక్కడం లేదు."* 

*"అతడి దారి అతడిదే."*

*"అలాంటి మోహంలో వున్న వారు ధనమార్గం నుంచి “ఆత్మ” మార్గంలోకి మళ్ళాలని ఆశిద్దాం."*

*"అలానే మానవుడు కేవలం త్యాగం వల్లనే ఆత్మను చేరుకోగలడు."* 

*"స్వార్దబుద్ధి కలిగివున్నవారు ఆత్మలోకి ప్రవేశించలేరు."* 

*"త్యాగం అంటే అర్ధం ఇవ్వడం."* 

*"స్వార్ధం అంటే పొందడం."*

*"ఇచ్చేవాడు అన్ని బంధాలనుంచి విముక్తుడవుతాడు."* 

*"పొందేవాడు పొందబడేవాటితో బందింపబడతాడు."* 

*"తనలోని స్వార్ధంతో తనను తాను బంధాలలో బంధించుకునేవాడికి ఇక ముక్తి ఎక్కడిది."*

*"అలానే రాజ్య అధికారం, వృత్తి నైపుణ్యం ఉన్నవాళ్లు వాటిని ప్రజలకు సేవ చెయ్యడానికి మాత్రమే ఉపయోగించాలి."* 

*"ఆ నిస్వార్దసేవ అనే త్యాగం అతడిని ఆత్మ అనే బ్రహ్మానందం వద్దకు చేర్చి అందులో అతడికి శాశ్వతమయిన స్థానాన్ని ప్రసాదిస్తుంది."*

 *"అలా కాకుండా అనారోగ్యంతోనో లేక మరేదో కష్టంతోనో సహాయాన్ని అర్ధించి వచ్చే వారి వివశతను సొమ్ముగా మార్చుకోవడానికి ఎవరయితే ప్రయత్నిస్తారో అలాంటివారు ఈ శరీరాన్ని కోల్పోయాక నీచమయిన శరీరాలను పొంది ఎంతో దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుందని అందరూ గ్రహించాలి."* 

*"ఎందుకంటే ఎవరి కర్మలకు వారే భాద్యులు."*

*"కర్మలు సత్కర్మలు కానివ్వండి లేదా దుష్కర్మలు కానివ్వండి"*

*"ఆయా కర్మల ఫలం మాత్రం తప్పక ఆ కర్మలు చేసినవాడు అనుభవించాల్సిందే."* 

*"ఉదాహరణకు ఒక అనారోగ్యంతో వచ్చిన రోగి వివశతను ఒక వైద్యుడు ధనం సంపాదించడానికి అవకాశంగా మార్చుకుని ఆ రోగినుంచి అధిక మొత్తాన్ని పొంది ఆ డబ్బుతో ఈ లోకంలో ఏవేవో కొన్ని సుఖాలను అతడు అతడి సంబంధీకులు తాత్కాలికంగా ఇప్పటికి మాత్రం అనుభవించవచ్చేమో!"* 

*"కానీ రోగబాధతో వచ్చిన రోగికి సేవ చేసి ఆ సేవకు తగ్గ ధనం మాత్రమే తీసికోవాల్సిన వైద్యుడు అలా చెయ్యకుండా రోగి యొక్క రోగ బాధ అనే అతడి వివశతను అతడినుంచి అధిక ధనం గుంజుకోవడానికి ఒక అవకాశంగా మార్చుకుని అధిక ధనాన్ని రోగినుంచి పొందడం అనేది పరమ పాప కర్మ అవుతుంది."* 

*"ఆ పాపకర్మ యొక్క సంస్కారం అతడి చిత్తంలోకి వెళ్లి చేరిపోతుంది."*

*"ఈ లోకంలో కనిపించే పశు, పక్షి, కీటకం లాంటి అనేక ఆకారాలతో కూడిన శరీరాలు, జన్మలు అనేవన్నీ ఏర్పడింది గతజన్మలలోని ప్రాణుల కర్మలనుంచి ఏర్పడిన చిత్తంలోని సంస్కారాల వల్లే."*

*"మితిమీరిన స్వార్ధం, లాభం కోసం మానవుడు చేసే చెడ్డ కర్మలవల్ల చెడ్డ సంస్కారాలు అతడి చిత్తంలో చేరి పశు, పక్షి, కీటకం లాంటి జన్మలకు కారణమవుతూ ఉంటాయి."* 

*"మానవుడు తన కపట తెలివితేటలతో అసత్యాన్ని సత్యంగా మార్చి ఈ లోకం మొత్తాన్ని అయినా నమ్మించగలడేమో గాని అతడి ఆత్మను అతడు మభ్యపెట్టలేడు."* 

*"మానవుడు చేసే ప్రతి కర్మ యొక్క సంస్కారం నేరుగా అతడి చిత్తంలోకి వెళ్ళిపోతుంది."*

*"అతడు తన చెడ్డ కర్మలను కపట తెలివితో మంచివిగా మార్చి లోకాన్ని నమ్మించినట్లుగా అతడియొక్క ఆత్మను నమ్మించి ఆ పాపకర్మను పుణ్యకర్మగా మార్చి తన చిత్తంలోకి పంపించలేడు."* 

*"కాబట్టి ఒక డాక్టర్ అయినా ఒక లాయర్ అయినా ఒక అధికారి అయినా లేక రాజ్యాన్ని పాలించే ఒక చక్రవర్తి అయినా ఒక్క నిష్కామకర్మతోనే ముక్తిని పొందగలరు."* 

*"ఏదో భరించలేని తీవ్ర కష్టంతోనో లేక తీవ్ర అనారోగ్యంతోనో వచ్చే ప్రాణులను ఎవరయితే “నేను మిమ్ములను రక్షించగలను అధైర్యపడకండి” అని ధైర్యం చెప్పి వారికి జీవితం మీద తిరిగి నమ్మకం కలిగించి వారి రోగానికి వైద్యం చేసి వారియొక్క రోగబాధను తొలగించి ధర్మ మార్గంలో వారినుంచి వృత్తి సేవకు తగిన ధనాన్ని మాత్రమే స్వీకరిస్తారో అలాంటివారు నేరుగా మోక్షాన్ని పొందుతారు."*

 *"అలాంటి మహా పవిత్రులకు సకల దేవతల ఆశీర్వాదాలు అన్ని సమయాలలోను ఉంటాయి."* 

*"అలాంటి వారు చేసే పవిత్ర సేవ వారికి చెందిన పది జన్మల పూర్వీకులకు మరియు వర్తమానంలోని అతడి రక్త సంబందీకులకు ఇంకా వారినుంచి రాబోవు పది జన్మల వారికి గూడా స్వర్గలోకాలకు చేరే సౌభాగ్యం ప్రసాదిస్తుంది."*

*"పవిత్ర సేవకు అంతటి శక్తి ఉంది."*

*"ఇక పది పైసల వృత్తి సేవకు తొంబై పైసలు వసూలు చేసే నీచుల యొక్క జన్మల గురించి చెప్పాల్సి వస్తే అలాంటివారి రాబోవు నీచ జన్మలకు అంతు అనేదే ఉండదని మాత్రం చెప్పగలము."* 

*"అలాంటి వారు ఇప్పటి ఈ శరీరం ఒకరోజు కోల్పోయాక ఆ తర్వాత జరుగబోవు తీవ్ర దుఃఖ పరిణామాలను ఇప్పటికయినా గ్రహించి ముక్తిని ప్రసాదించే త్యాగ మార్గంలోకి వెంటనే రావలసిందని జ్ఞానులు ఆహ్వానం పలుకుతున్నారు."*
            💖🔥💖🔥💖
                  💖🕉️💖

No comments:

Post a Comment