🙏🕉🙏 ...... *"శ్రీ"*
🔥 *"12"* 🔥
🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
💖🔥💖🔥💖🔥💖
💖🔥🕉🔥💖
💖🔥💖
💖
*"ఆత్మ జ్ఞానం / మోక్ష మార్గం / సృష్టి రహస్యం / ఏడు జన్మలు ఏమిటి ? / నేను అంటే ఎవరు ? / దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు"*
*"అయిదు వందల మంది జనాభా గలిగిన ఒక గ్రామంలోని గుడిలో ఒక ఉపన్యాసకుడు దైవం గురించి ఉపన్యసిస్తున్నాడు."*
*"ఆ గుడిలోకి కొద్ది మంది గ్రామస్థులు వచ్చి కూర్చుని అతను చెప్పేది శ్రద్దగా వింటున్నారు."*
*"ఉపన్యాసకుడు ముందు వరుసలో కూర్చుని వున్న ఒక స్త్రీని ఉద్దేశించి"*
*"అమ్మా నీవెవరు? అని అడిగాడు."*
*"ఆమె తన పేరు చెప్పింది."*
*"నీవు ఇక్కడికి ఎలా వచ్చావు? అని అడిగాడు."*
*"తాను తన ఇంటి నుంచి నడచి వచ్చినట్లుగా ఆమె చెప్పింది.*
*"ఇంటి నుంచి ఇక్కడి వరకు నడచింది “ఎవరు” అని మళ్ళీ అడిగాడు.*
*“నేను” అని ఆమె బదులిచ్చింది.*
*నేను అంటున్నావు గదా!*
*"నేను అంటున్నది నీలో “దేనిని” అని మళ్ళీ అడిగాడు."*
*"ఆమె తన శరీరం వైపు చూసుకుని “నేను” అంటే ఈ “శరీరమే” గదా అని అమాయకంగా బదులిచ్చింది."*
*"ఆమెను కూర్చోమని ఆ ఉపన్యాసకుడు ఇలా చెబుతున్నాడు."*
*"కేవలం శరీరమే తనంతట తాను ఇక్కడికి వచ్చినట్లయితే ప్రక్క వీధిలో మరణించి వున్న శవం కూడా ఇక్కడికి రాగలగాలి."*
*"ఎందుకంటే శవం కూడా శరీరాన్ని కలిగి ఉంది గదా."*
*"అలా కాదు శవంలో ప్రాణం లేదు కాబట్టి రాలేదు మేమంతా శరీరంతో పాటు ప్రాణం కలిగి వున్నాం కాబట్టి వచ్చాం అని అంటారా?"*
*"అదే నిజమయితే ఇదే గ్రామంలో ప్రాణం, శరీరం కలిగి వున్న జనులు అనేక మంది ఉన్నారు."*
*వారంతా ఇక్కడికెందుకు రాలేదు?*
*"ఇక్కడికి రావడానికి శరీరం, ప్రాణం కారణమయితే మొత్తం గ్రామస్తులంతా ఇక్కడే వుండి వుండాలి."*
*కానీ అలా జరగలేదు.*
*"అంటే దీనర్దం ఇక్కడికి వచ్చింది శరీరాలూ కాదు."*
*"ప్రాణమూ కాదు. మరింకేంటి? మనస్సు."*
*"ఈ మనస్సు అనేది అన్ని శరీరాలలో ఉంటూ ఈ శరీరాలను తన ఇష్టానికి తగ్గట్లుగా కదిలిస్తోంది."*
*"గుడిలోకి వెళ్లి ఉపన్యాసం వినాలి అని మీరు భావించడం వల్ల మీ మీ శరీరాలు ఇక్కడకు వచ్చాయి."*
*"వెళ్లి నాటకం చూడాలి అని కొందరు భావించడం వల్ల వారి శరీరాలు నాటకం ప్రదర్శించే చోట ఉన్నాయి."*
*"రోజంతా పొలంలో పనిచేసి బాగా అలసిపోయిన వాళ్ళు పొడుకుని నిద్ర పోవాలి అని భావించడం వల్ల వారి శరీరాలు మంచాల మీదో నేల మీదో పడిపోయి నిద్రలో ఉన్నాయి."*
*"ఈ భావన చేసే దాన్నే మనస్సు అంటున్నాం."*
*"కాబట్టి ఈ అన్ని శరీరాలలో కేవలం శరీరం, ప్రాణం మాత్రమే కాకుండా మనస్సనేది ఒకటి ఉంది."*
*అది అత్యంత శక్తివంతమయింది.*
*"ఎందుకంటే అది “ఆత్మ” లోంచి ఏర్పడింది కాబట్టి."*
*"దాని యొక్క ఆజ్ఞతోనే ఈ శరీరాలన్నీ చలనం కలిగి ఉంటున్నాయి. అది ఏమి భావిస్తే ఈ శరీరాలు అది చెయ్యడానికి ముందుకు కదులుతాయి.*
*ప్రతి మనిషి “నేను” “నేను” అనేది ఆ మనస్సునే.*
*"అంటే ఈ శరీరం, ప్రాణం కాకుండా ఈ రెండింటినీ తన ఆజ్ఞతో కదిలించేది ఏదయితే ఒకటి ఉందో దాన్నే అందరూ “నేను” అంటున్నారు తప్ప ఈ జడ శరీరాన్ని కాదని గ్రహించాలి."*
*"కాబట్టి “నేను” అంటే ఈ శరీరమో ఈ శరీరంలో వున్న ప్రాణమో కాదని అర్దమయినట్లేగదా."*
*"నేను అంటే ఈ శరీరాలను కదిలించే మనస్సనే చైతన్యాన్నేగాని కదిలే ఈ శరీరాన్ని నేనుకాదు."*
*"నాయొక్క రూపం నిరాకారం."*
*"నా ఎదురుగా నాకంటే వేరుగా ఉన్నట్లుగా కనిపించే అన్ని దేహాలు కూడా “చైతన్యం” అనే నిరాకారం స్వరూపంగా కలిగినవే."*
*"మరి అన్ని దేహాలలో వున్న ఏకైక ఆకారం లేని “చైతన్యానికి” నేనువేరు వాళ్ళువేరు అనే భేదం ఎక్కడుంటుంది. ఆకారం లేనిదంతా ఒక్కటే అని గ్రహించడమే ముక్తి. అలా కాకుండా ఈ శరీరం ‘నేను’ తదితర శరీరాలు ‘ఇతరులు’ అని భావించేదంతా అజ్ఞానం చేత మానవుని మనసులో ఏర్పడిందే తప్ప అది సత్యం కాదని గ్రహించాలి."*
*"ఒక గ్రామంలోని గృహాలను చూసినప్పుడు ఇది పుల్లయ్య గృహం, ఇది ఎల్లయ్య గృహం, ఇది బలరాముడి గృహం అని చెప్పుకుంటాం."*
*"అంతేగాని ఆ గృహాల పైన ఉన్న ఆకాశాన్ని చూపించి ఇది పుల్లయ్య ఆకాశం, ఇది ఎల్లయ్య ఆకాశం, ఇది బలరాముని ఆకాశం అని చెప్పలేం కదా!*
*ఎందుకంటే గృహాలకు ఆకారం ఉంది.*
**ఆకారాల మధ్య భేదం ఉంది."*
*"భేద దృష్టిని అనుసరించి ఆకారాలను చూసినప్పుడు ఇది ఎల్లయ్యది, ఇది పుల్లయ్యది అని భావిస్తున్నాం."*
*ఆకాశానికి ఆకారం లేదు.*
*"ఆకారం లేనిదానికి భేదం ఎక్కడుంటుంది?"*
*"భేదం లేనప్పుడు ఇక ఇది అతడిది అది ఇతడిది అనే విభజన ఎలా చెయ్యగలం."*
*"భేదం లేనిదంతా ఒక్కటే అని గ్రహించడమే జ్ఞానం."*
*"మరి మనిషి అంటే ఆకారం లేని ‘ఆత్మచైతన్యం’ అయినప్పుడు మనిషికి మనిషికి మధ్య భేదం ఎక్కడుంది?"*
*"అజ్ఞానదృష్టిచే అనేకంగా కనిపించేదంతా వాస్తవానికి అనేకం కాదు అంతా ఒక్కటే అని గ్రహించడమే జ్ఞానం.*
*అట్టి దృష్టి పరమ పవిత్రం.*
*మంగళకరం.*
*"కాబట్టి ఈ ప్రపంచమంతా అజ్ఞాన దృష్టికి అనేక శరీరాలుగాను ఆకారాలుగాను కనిపించవచ్చుగాని వాస్తవానికి అన్నింటిలో వున్నది ఏకైక నిరాకర “చైతన్యమే” అని గ్రహించడమే సత్య దృష్టి."*
*అదే అజ్ఞాన విముక్తి.*
*ఆత్మకు ముక్తి.*
*"అట్టి చైతన్య స్థితిలో స్థిరంగా నిలిచి వున్నప్పుడు కలిగేదే శాశ్వతమయిన అకృర్తిమమయిన “ఆనందం”."*
*"దాన్నే “బ్రహ్మానందం” అనీ “ఆత్మ సాక్షాత్కార” స్థితి అనీ శాస్త్రాలు చెబుతున్నాయి."*
*"అజ్ఞాన దృష్టి చేత ఈ కంటికి కనిపించే భౌతిక శరీరం తల్లిదండ్రుల నుంచి లభిస్తోంది. "*
*"తల్లి నుంచి శరీరం. తండ్రి నుంచి ప్రాణం లభిస్తున్నాయి."*
*"తల్లిదండ్రులు తిన్న ఆహరం రేతస్సుగా మారి దాన్నుంచి ఈ దేహలన్నీ ఏర్పడుతున్నాయి."*
*"అంటే ఈ శరీరం యొక్క మూలం ఆహరంలో ఉందనుకోవాలి."*
*ఆహారానికి మూలం భూమి.*
*భూమికి మూలం నీరు.*
*నీటికి మూలం అగ్ని.*
*అగ్నికి మూలం వాయువు.*
*వాయువుకి మూలం ఆకాశం.*
*"అంటే ఈ శరీరాలన్నీ ఆకాశం నుంచే పుడుతున్నాయి."*
*"ఆకాశం నిరాకారం అయినప్పుడు నిరాకారం నుంచి ఆకారం కలిగిన శరీరాలు ఎలా పుడతాయి."*
*పుట్టవు.*
*"కాబట్టి పైకి ఆకారంతో కనిపించే ఈ శరీరాలన్నీ వాస్తవానికి “లేనివే” అని జ్ఞాన దృష్టికి అర్ధం అవుతోంది."*
*"తల్లిదండ్రులు తిన్న ఆహరం నుంచి పట్టిన ఈ దేహంలో ఆహారానికి మూలమయిన పంచమహాభూతాల అంశ ఉంది."*
*"పంచ మహాభూతాలు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి."*
*"ఈ అయిదింటి నుంచే గదా ఆహారం తయారయ్యేది."*
*"ఆహరం నుంచి తయారయిన దేహంలో ఈ అయిదు పంచ భూతాలు ఏ రూపంలో ఇమిడి ఉన్నాయో చూద్దాం."*
*"ఈ శరీరంలో అయిదు జ్ఞానేంద్రియాలు,"*
*"అయిదు కర్మేంద్రియాలు,"*
*"మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి ఏర్పడి ఉన్నాయి."*
*"జ్ఞానేంద్రియాలు అంటే చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు"*
*"కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, నోరు, మల విసర్జన ద్వారం, మూత్ర విసర్జన ద్వారం"*
**ఇక అంతఃకరణ చతుష్టయం అని పిలువబడే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం."*
*"అయిదు పంచ మహాభూతాలు ఈ శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం."*
*"చెవులు శబ్దాన్ని వింటాయి.*
*శబ్దం ఆకాశంలో పుడుతుంది.*
*కాబట్టి చెవులకు ఆధారం “ఆకాశం”.*
*చర్మం స్పర్శను గ్రహిస్తుంది.*
*స్పర్శ వాయువు వల్ల కలుగుతోంది.*
*కాబట్టి చర్మానికి ఆధారం “వాయువు”.*
*కళ్ళు ప్రకాశాన్ని చూస్తాయి. ప్రకాశానికి మూలం సూర్యుడు. కాబట్టి కంటికి మూలం “అగ్ని”.*
*నాలుక రుచిని గ్రహిస్తుంది.*
*రుచికి మూలం “జలం”.*
*ముక్కు వాసనను గ్రహిస్తుంది.*
*వాసనకు ఆదారం “భూమి”."*
*"పంచ మహా భూతాల నుంచి ఏర్పడిన ఈ శరీరంలో"*
*"పై విధంగా పంచ మహా భూతాలు అయిదు జ్ఞానేంద్రియాల రూపంలో ఉనికి ఏర్పరచుకుని ఉన్నాయి."*
**ఇదంతా బాగానే ఉంది కదా!"*
No comments:
Post a Comment