Tuesday, February 28, 2023

శ్రీరమణీయం: కాలం మారుతుంది, ఆలోచనలు మారుతున్నాయి, మరి మనసు పరిస్థితి ఏమిటి ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"471"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"కాలం మారుతుంది, ఆలోచనలు మారుతున్నాయి, మరి మనసు పరిస్థితి ఏమిటి ?"*

*"పాత రూపంపోయి క్రొత్త రూపం రావటాన్ని మార్పు అంటున్నాం. భూమిలో నాటిన విత్తనం మొలకెత్తి రోజురోజుకూ అది చెట్టుగా రూపు దిద్దుకుంటుంది. సృష్టి అంతటా కనిపించే మార్పే మనలోనూ కనిపిస్తుంది. రోజురోజుకు మన దేహం మారుతుంది. వయసు మారుతుంది. అలాగే ఆలోచనలు కూడా మారుతున్నాయి. బాల్యంలో ఉన్న ఇష్టాలు ఇప్పుడు మనకు ఉండటంలేదు. నిజానికి ఈ మార్పు అంతా కాలానిదే. మల్లె చెట్టు ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. కానీ ఎండాకాలం రాగానే పుష్పాలు పూస్తుంది. అది కాలం తెచ్చిన మార్పు. మన మనస్సు కూడా అంతే. ప్రకృతిలో, మనజీవితంలో వచ్చిన మార్పులను మన మనసు అద్దంలా ప్రతిబింబిస్తుంది. ఎదురుగా మారే విషయాలను బట్టి అద్దంలో దృశ్యాలు కూడా మారుతూ ఉంటాయి. అద్దం ఎప్పుడూ మారదు ! అలాగని జరిగే మార్పును ప్రతిబింబించకుండా ఉండదు. "తాను మారకుండా జరిగే మార్పును స్వాగతించటమే దాని ప్రత్యేకత.'' మన మనసుకు కూడా ఇదేరకమైన సహజగుణం ఉంది. దాన్ని మనం కాపాడుకోలేక పోతున్నాం. మారని మనసు స్వరూపాన్ని తెలుసుకోలేక పోతున్నాం. జరుగుతున్న మార్పును స్వీకరించలేక పోతున్నాం !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
              

No comments:

Post a Comment